త్రిపుర సిఎం వివాదాస్పద వ్యాఖ్యలు ఇవీ: మోడీ భగ్గు, ఢిల్లీకి రావాలని ఆదేశం

First Published Apr 30, 2018, 10:15 AM IST
Highlights

 త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ కుమార్ దేబ్ పై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

గౌహతి: త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ కుమార్ దేబ్ పై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆయనను ఢిల్లీకి రావాల్సిందిగా ఆదేశించినట్లు సమాచారం. 

ఆయన మే 2వ తేదీన ఢిల్లీకి వెళ్లి మోడీని, బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షాను కలుస్తారని అంటున్నారు. తాను చేసిన వ్యాఖ్యలపై ఆయన వివరణ ఇవ్వాల్సి వస్తుంది. గత కొద్ది రోజులుగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతుండడంపై బిజెపి జాతీయ నాయకత్వం ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.

యువతీయువకులు ప్రభుత్వోద్యోగాలపై ఆశపడకుండా ఆవులను పెంచుకోవాలని లేదా పాన్ షాపులు పెట్టుకోవాలని బిప్లబ్ దేబ్ తాజాగా వ్యాఖ్యానించారు. రాజకీయ పార్టీల చుట్టూ ప్రభుత్వోద్యోగాల కోసం తిరగడం వల్ల విలువైన సమయం వృధా అవుతుందని ఆయన అన్నారు. ఆదివారంనాడు ఆయన ఓ సదస్సులో ఆ విధంగా అన్నారు. 

ఒక్కో లీటర్ ఆవులు ఇప్పుడు రూ.50 ఉందని, ప్రభుత్వోద్యోగాల కోసం తిరగకుండా పాలు అమ్ముకుని ఉంటే ఒక్కొక్కరికి రూ.10 లక్షలు ఉండేవని ఆయన అన్నారు. కనీసం రూ.75 వేల పెట్టుబడితో కాస్తా శ్రమిస్తే నెలకు వీరు రూ.25,000 పొందవచ్చుని అన్నారు. గత పాతికేళ్లలో నెలకొన్న కమ్యూనిస్టు సంస్కృతే దీనికి ఆటంకంగా మారిందని విమర్శించారు. 

గతంలో ఆయన పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహాభారత కాలంలో శాటిలైట్ కమ్యూనికేషన్ ఉందని అన్నారు. మతి చెడిందంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై వ్యాఖ్యానించారు. మాజీ మిస్ వరల్డ్ హెడెన్ పై అభ్యంతరకమైన వ్యాఖ్యలు చేశారు. 

సివిల్ ఇంజనీరింగ్ చదివినవాళ్లే సివిల్ సర్వీసెస్ కు పనికి వస్తారని, మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్లు పనికి రారని అన్నారు. చదువుకోవడం కన్నా పాన్ షాపులు పెట్టుకోవడం, ఆవులను పోషించుకోవడం మంచిదని అన్నారు. 

click me!