
మయూర్ పటేల్ అనే 21 ఏళ్ల యువకుడు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.శాస్త్రినగర్ మెట్రో స్టేషన్‌లో మయూర్ పటేల్ ఒక ప్లాట్‌ఫాం నుంచి మరో ప్లాట్‌ఫామ్‌కు వెళ్లేందుకు ఆగి ఉన్న రైలు ముందు నుంచి ట్రాక్ దాటడానికి ప్రయత్నించాడు. సరిగ్గా అదే సమయంలో రైలు కదలడంతో ఒక్కసారిగా భయంతో వణికిపోయాడు.
అప్రమత్తమై పైలట్ వెంటనే రైలును ఆపడంతో మయూర్ ప్రాణాలతో బయటపడ్డాడు. దీంతో మయూర్‌కి జరిమానా విధించడంతో ఎందుకిలా చేశావంటూ ప్రశ్నించారు అధికారులు. ఈ ఘటన అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యింది.