కాబూల్ లో జంట ఆత్మాహుతి దాడులు: జర్నలిస్టులతో సహా 21 మంది మృతి

First Published Apr 30, 2018, 12:48 PM IST
Highlights

ఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్ ను జంట ఆత్మాహుతి దాడులు కుదిపేశాయి. ఇందులో 21 మంది మరణించారు.

కాబూల్: అఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్ ను జంట ఆత్మాహుతి దాడులు కుదిపేశాయి. ఇందులో 21 మంది మరణించారు. మృతుల్లో ఏజెన్స్ ఫ్రాన్స్ - ప్రెస్సీ చీఫ్ ఫొటోగ్రాపర్ షా మారయ్ తో పాటు మరో ముగ్గురు జర్నలిస్టులు ఉన్నారు. 

సోమవారంనాడు కాబూల్ లో రెండు ఆత్మాహుతి దాడులు జరిగినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆ దాడుల్లో 27 మంది గాయపడినట్లు మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వాహిద్ మజ్రోహ్ చెప్పారు. వారిని ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. 

గాయపడినవారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, మృతుల సంఖ్య పెరగవచ్చునని అన్నారు. రిపోర్టర్లను లక్ష్యం చేసుకుని జరిగిన తొలి దాడి తర్వాత కొద్ది నిమిషాలకే రెండో దాడి జరిగింది. 

బాంబర్ కూడా జర్నలిస్టు అని తెలుస్తోంది. గుంపులోకి చేరి అతను తానను తాను పేల్చేసుకున్నాడు. రెండు కూడా ఆత్మాహుతి దాడులేనని భద్రతా వర్గాలు ధ్రువీకరించాయి. 

మారై 1996లో డ్రైవర్ గా ఎఎఫ్ పీలో చేరారు. 2002లో పూర్తి కాలం ఫోటో స్ట్రింగర్ గా ఎదిగారు. ఆ త్రవాత బ్యూరోలో చీఫ్ ఫొటోగ్రాఫర్ గా పదోన్నతి పొందారు. ఆయనకు ఆరుగురు పిల్లలు ఉన్నారు. 

click me!