ఉడుపి వంకాయ కబుర్లు

First Published Apr 26, 2017, 6:09 AM IST
Highlights

కర్నాటక లో  రెండు రకాల విశిష్టమయిన వంకాయలున్నాయి.వాటిని ఉడుపి ప్రాంతంలో పండిస్తారు. ఇందులో మట్టుగుళ్లకు జిఐ సర్థిఫికెట్ కూడా వచ్చింది. రెండోది హెద్దూరు వంకాయ. వంకాయకూరల్లాగే, వంకాయ కబుర్లూ నోరూరిస్తాయి. కల్కూర చెప్పే కన్నడ పెద్ద వంకాయ  కబుర్లు ఇవి.

మాట వరుసకు, పనికిరాని విషయమయితే, ఓ ’వంకాయా’ అనడం పరిపాటి.  అనుమానం లేదు,  వంకాయంటే చలకనే.అయితే,వంకాయ వాడని కిచెనూ, ఏవో ఎలర్జీలు, గిలర్జీలుంటే తప్ప, వంకాయకూరంటే నోరూరకపోవడం వుండవు.

 

  ప్రపంచంలొ సర్వత్రా తినేది, అన్ని కాలాలలొ పండుతూ, వంటకాలను పండించే కూరగాయలలో వంకాయదే పై చేయి. అన్ని ఖండాలలొ పండుతుంది. ఆంగ్లములో కొన్ని చోట్ల  ’బ్రింజాల్’  అంటే  మరిచోట్ల ’ఎగ్ ప్లాంట్’ అని పిలుస్తారు.  దేశం, కాలం, వాతావరణం, మట్టి ఇతర పరిస్థితులను బట్టి,  లెక్కలేనన్ని రకాల వంకాయల పండుతాయి. ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ అధ్యయనం ప్రకారం, ప్రతి సంవత్సరం, ప్రపంచమంతటా దాదాపు  20 లక్షల హెక్టార్ లలో 3, 20,00,000 టన్నుల వంకాయ పంట పండిస్తున్నారు. మన దేశములొ టొమెటొ తరువాత, అతి ఎక్కువగా, దాదాపు, ఐదు లక్షల హెక్టార్ లలో ఒంకాయ పండిస్తున్నారు.  ఇది దేశంలో  పండెే కురగాయిలలొ 8.%.   2007-08 సంవత్సరములో  రూ.1,90,00,000, విలువయిన  3,40,000 టన్నుల వంకాయిని తాజాగానో లేదా  శీతలీకరించో   ఇంగ్లండ్, సౌది అరెబియా, నెదర్ ల్యాండ్, మధ్య ప్రాచ్య దేశాలకు ఎగుమతి చేసినట్లు ప్రభుత్వ నివేదిక. 

 శాకాహారులకు కూరగాయిలే పౌష్టిక ఆహారం. మధుమేహ, రక్తపు పోటు, వంటి రోగాలతొ బాధ పడేవాళ్ళకి, మాంసముకంటె, వంకాయివంటి, పచ్చి కూరగాయిలు మేలు అని డాక్టర్లు చెబుతారు. అవి దేశ నలుమూలలా  సునాయాసముగా అన్ని కాలాలో, పండడమే కాకుండా,  సులభాంగా జీర్ణమవుతాయి. మన దేశములోనే రకరకాల ఆకారాల రంగుల రుచుల వంకాయలు దొరుకుతాయి.  ఒక రాష్ట్రములోనే కాదు,  ఒక జిల్లాలో పండే  వంకాయల్లో కూడా వైవిధ్యం వుంటుంది. ఒక వూరి వంకాయ రుచి మరొకవూరి వుండదు.

 

భారత దెేశంలో వంకాయకి దాదాపు 4,000 సంవత్సరాల చరిత్ర ఉందని చెబుతారు. ఇక్కడి నుంచే నలుమూలలా వెళ్లినట్లు చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. కాని, దానికి సంబంధించి సుదీర్ఘమైన, అధికారపూర్వకమైన పరిశోధన ఇంకా జరగాలి.  క్రి.పూ. ఐదవ శతాబ్దంలో ఈ పంట భారత దేశమునుండి చైనా వైపు పయణించినట్లు పరిశోధకులు అభిప్రాయ పడుతున్నారు. చైనానుండి అఫ్రికా, అమెరికా, ఆస్ట్రేలియా ఖండాలకు ఇది జైత్రయాత్ర చేసిందంటారు.  ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణాలో చిన్న చిన్నవంకాయలు ఎక్కువగా పండుతాయి. అవే పాపులర్. సుమారు 20 నుండి 50 గ్రాముల బరువు గల, బూడిద, తెలుపు, పసుపు, వయలెట్ రంగుల మిశ్రణం గలిగిన వంకాయలు తెలుగు రాష్ట్రాలలో పండుతుంటాయి.  

మట్టుగుళ్ల

  కర్ణాటకలొ సుమారు 50 రకాల వంకాయిలుంటాయి. వాటిలో కొన్ని చాలా ప్రసిద్ధమయినవి.  ఇందులో మట్టుగుళ్ల ఒకటి(పై ఫోటో) హెద్దూరు వంకాయలకు చాలాపేరు.

ఉడుపి పట్టణానికి పది కి.మీ. దూరములో  అరేబియా సముద్ర తీరములో మట్ట (మట్టీ )  గ్రామ పరిసరాలలో మట్టుగళ్ల అనే వంకాయ పండుతుంది. ఇవి చాలా పెద్ద వంకాయలు, అంటే సుమారు 200 గ్రాములకు పై బరువుంటాయి.ఇక్కడిసమీపంలోని  ఇంకొక రెండు, మూడు గ్రామాలలొనూ, సుమారు 500 ఎకరాలలో ఈ పెద్ద వంకాయలను పండిస్తారు. వివిధ కారణాలవల్ల ఇప్పుడు ఈ పంట విస్తీర్ణం 200 ఎకరాలకు కుంచించుకుపోయింది.

 

వంకాయిని  కన్నడంలో  ‘బదనె కాయి’ అంటారు. స్థానిక తుళు భాషలొ దానికి ’గుళ్ళ’ అంటారు. మట్టి అనే వూర్లో పండింది కాబట్టి ’మట్టు గుళ్ళ’  అని కూడా పిలుస్తారు. ఇది ఉడుపి, దక్షిణ కన్నడ జిల్లాలలో చాలా ప్రసిద్ధమైన కూరగాయ. 

‘ఉడుపి వారసులం’ ప్రపంచములో ఎక్కడ ఉన్నా ఈ వంకాయిపై మమకారం ఎక్కువగా చూపిస్తాం. దీనిని పదహారవ శతాబ్దంలో శ్రీ వాదిరాజ స్వామి (A.D.1480-1600) తన శిష్య వర్గానికి ప్రసాదించారని ప్రతీతి.  అందువల్ల, ప్రతి రైతు, ప్రతి సంవత్సరం మొదటి పంటన్ని ఉడుపి శ్రీకృష్ణునికి సమర్పిస్తాడు. వర్షాకాలం పోగానే సెప్టెంబర్ అక్టొబర్ మాసంలో వంగ నారు వేస్తారు. జనవరినుండి సుమారు ఎప్రిల్ వరకు పంట కాపు ఉంటుంది. చెట్టు సుమారు మూడున్నర అడుగుల వరకు పెరుగుతుంది.  ఒకొక్క చెట్టుకు దాదాపు మూడు నెలల పాటు సుమారు 30-40 కాయిలవరకు కాస్తూ ఉంటాయి. కాయ దాదాపు తెలుపు, ఆకుపచ్చదనం రంగుల్లో గోలాకారములో నిగనిగలాడుతూ ఉంటుంది.  చెట్టులోనూ, కాయ ముచ్చిక (తొడిమె) లోనూ కొండి ఆకారములొ ముల్లు ఉంటుంది.  1960 వ దశకం వరకు, కేవలం పశువుల, చాపల, ఎరువులు,   మాత్రమె ఈ పంటకు వాడే వారు. పురుగులు, రోగాలు చాలా తక్కువగా ఉండేవి. పురుగు మందులు గొట్టడం చాలా అరుదుగా జరిగేది. ఇప్పుడు రసాయనిక ఎరువులెక్కువయ్యాయి.  పురుగుల బెడద తీవ్రమయిన మందుల వాడకం బాగా పెరిగింది.  ఫలితం, అన్ని పంటలవల్లె, ’మట్టు వంకాయ’ కూడా ఆ నాటి రుచి కోల్పోయింది. దీనికి ఆశ్చర్య పడనక్కర లేదు.

 

మార్కెట్ పరిస్థితులను బట్టి ఇపుడు  కెజి. రూ 25 నుంచి 100 దాకా ఉంటుంది. మొదట పంట  ఎక్కువ; రాను, రాను తగ్గుముఖంపడుతుంది.  పంట సెంటుకు  క్వింటాల్ కు పైబడి దిగుబడి ఉంటుంది. పంటలో  నష్టం ఉండదు గాని, ప్రస్తుతము ఖర్చులు విపరీతముగా పెరగడములో  లాభాలు తగ్గాయి.

 

                 మట్టి వంకాయిపై హైదరాబాద్, జాతీయ పౌష్టిక ఆహార సంస్థ (National Institute of Nutrition -NIN) మాజీ ఉప డా.రమేశ భట్టు (కుడి), మంగళూరు విశ్వవిద్యాలయా బయాలజీ ప్రొఫెసర్ నాగప్పయ్య మధ్యస్థ (ఎడమ), మట్టు గుళ్ళ బెళెగారర సంఘ (Mattugulla Growers' Association - మట్టు వంకాయి పంటదారుల సంఘం) కార్యదర్శి, మట్టు పరమేశ్వర అధికారి కలిసి పరిశోధన చేసి, ఈ వంకాయకు  ప్రపంచ  గుర్తింపు సాధించినారు. 2010,మార్చి 3 న ప్రపంచ వర్తక సంస్థ Geographical Indication (జిఐ) Certificate అందించారు.  బిటి వంకాయలు దాడి చేస్తున్నపుడు ఉడిపి రైతులు తమ వంకాయను ఇలా కాపాడుకోగలిగారు. ఈ వంకాయ వంటలు కూడా విశేషంగా ఉంటాయి. మట్టు గుళ్ల బజ్జి, బజ్జీలు, మట్టుగుళ్ల గుతి వంకాయ... ఇలా ఎన్నో. ఎపుడయిన ఉడుపి వెళ్లినపుడూ మీరూ పరీక్షించవచ్చు.

హెద్దూరు వంకాయి

 ఉడుపికి పక్క శివమొగ్గ జిల్లా, తీర్థహళ్ళి తాలూకా, హెద్దూరు గ్రామం, (హెద్దూరు బదనె)పండే  హెద్దూరు వంకాయి చాలా ప్రసిద్ధిచెందిందిన ఈ కాయ ఇంకా పెద్దది, నమ్మలేనంతగా, బరువుతో  500 నుండి  750 గ్రాములవరకు ఉంటుంది. తుంగా నదిలొ బ్రాహ్ని నది సంగమ స్థలంలో రెండునదుల  ఒడ్డున, పాత్రంలోలొ,  తువ్వ పొలం ఉంటుంది. అక్కడే ఋతుపవనాలు తగ్గి, వర్షకాలం పోయిన తరువాత, సెప్టెంబర్, ఒక్టొబర్ లొ నారువేస్తారు. నది పాత్రంలో కళియె ఎరువు. నది గర్భములొ తేమయే నీరు. ప్రత్యేకముగా దీనికి నీరు, ఎరువు అవసరం లేదు. తెగుళ్లు చాలా తక్కువ.  డిసెంబర్ నుండిమార్చి వరకు, పంట.   చెట్టుకు గాని, కాయకి గాని, ముళ్ళు ఉండవు. చెట్టు రెండు నుంచి అడుగులు పెరుగుతుం ది. ఈ కాయిలు కూడా, తెలుపు, బూడిద, ఆకు పచ్చిమిశ్రిత రంగులొ ఉంటాయి. విత్తనాలు చాలా తక్కువగా ఉంటాయి.  తుంగా భద్రా అద్భుతాలలొ ఇది ఒకటి.   

              

           మట్టు గుళ్లపై జరుగినట్లు  దీనిపై ఎటువంటి పరిశోధన జరుగలేదు. అందువల్ల ఇది ఎంత పురాతనమయిందనే విషయాన్ని, నిర్దిష్టంగా చెప్పే వాళ్ళెవరూ లెరు. మా తాత ముత్తాతల కాలంనుండి ఈ పంట ఉన్నదని వృద్ధులు చెప్పుతారు. ఇక్కడి జానపద, జేజెమ్మ కథలు, తాళ పత్రాలు, పరిశీలిస్తేఈ విషయం తెలియరావచ్చు.

             ఈ రెండు రకాల వంకాయిలనుండి, నోరూరించె, సమాన రుచిగల, ఒకే పద్దతిలో కూరలు చేస్తారు. నిప్పులొ కాల్చి, తోలు తీసి, ఉప్పు, కారాలతొ పాటు పెరుగుతో కలపడం ఒక రకం బజ్జి.  పెరుగు లేకుండా ఒక రకమైన పచ్చడి చేస్తారు. నాలుగయిదు రకాల కూరగాయాలు, ఉల్లిగడ్డలు, మునక్కాయ, కలిపి, మూడు, నాలుగు రకాల  సాంబారు, పులుసు చేస్తారు. గుండ్రగా కోసి, సెనిగ పిండిలొ కలిపి ఆమ్లెట్, బజ్జీలు కూడా వేపుకోవచ్చు.

 

               ఏ ప్రాంతములొ, ఎప్పుడు పండినా, వంకాయతో  షడ్రసోపేతమైన వంటకాలు చేస్తారు.  తమిళ నాడు, కేరళ ఉప్పుడు బియ్యం అన్నంతో  మొదలు, వరి అన్నం, దోసె, ఇడ్లి తొ కలిపి తినవచ్చు.   తాళింపు, సాంబారు, పులుసు, పచ్చడి చేసుకుని లాగించవచ్చు.(వంకాయల రైతుతో రచయిత ఫోటో ఎడమ)

 

  రాయలసీమ,తెలంగాణా ఉత్తర కర్ణాటక,  మరాఠ్ వాడా  ప్రాంతాల  కలయిక అయిన  "దక్కన్  పీఠభూమి లోని, జొన్న రొట్టె, కొర్ర అన్నం,  రాగి సంకటి నుంచి , ఉత్తర భారతంలోని,   చపాతి, పూరి, గోదం అన్నం,  పంజాబి రోటి వరకు,  మేళవించె వంకాయ కూర చక్కగా మ్యాచ్ అవుతుంది.  భారత - అరేబియా – ఫారశీక  సంస్కృతుల సమ్మేళనంతో  వచ్చిన నూనెవంకాయ, గుత్తి ఒంకాయి, బగారా బైంగన్ వంటిలో కూడా ఒదిగిన ఘనత వంకాయదే.   వివిధ చర్మ రోగాలనుండి భాదపడేవాళ్ళకు, ప్రత్యేకంగా సుఖ రొగాల పీడితులకు వంకాయి కష్టమే. ఐతేనేమి? 

 

"వంకాయ వంటి కూరయు

పంకజముఖి సీతవంటి భామా మణియున్

శంకరుని వంటి దైవము

లంకాధిపు వైరి వంటి రాజును గలడే"  అంటూ ఒక కవి వంకాయని కొనియాడారు కదా.

 

వంకాయ అంటే  చెప్పలేనంత పిచ్చి ఉన్న నాకు ఈ ’పంట శ్రేష్టుడి’ కి ఇంత రుచి  ఎలా వచ్చిందో తెలుసుకోవాలనే కుతూహలం రావటం సహజం.    

 

 

 

click me!