ఇంత పెద్ద దేశంలో: రేప్ లపై కేంద్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

First Published Apr 22, 2018, 4:11 PM IST
Highlights

ఇంత పెద్ద దేశంలో: రేప్ లపై కేంద్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: దేశంలో జరుగుతున్న అత్యాచార ఉదంతాలపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో కేంద్ర మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్ చాలా పెద్ద దేశమని, ఇంత దేశంలో ఏదో ఒక మూల ఒకటో, రెండో అత్యాచారాలు జరిగితే వాటికి విపరీతమైన ప్రచారం కల్పించి, రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. 

అత్యాచార సంఘటనలను అడ్డుకోలేమని, తమ వంతుగా వాటిని అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇలాంటివి జరుగుతుండడం దురదృష్టకరమని ఆయన అన్నారు. ఆదివారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. 

అత్యాచారాలు జరగడం దురదృష్టకరమేనని, అయితే కొన్నిసార్లు వాటిని ఆపలేమని ఆయన అన్నారు. అవసరమైన మేరకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని అన్నారు. 

కథువా, ఉన్నావ్ రేప్ కేసుల విషయంలో తీవ్రమైన ఆందోళన తలెత్తుతున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై వివాదం చెలరేగుతోంది. 12 ఏళ్ల లోపు చిన్నారులపై అత్యాచారాలకు పడిన కేసుల్లో దోషులకు మరణశిక్ష విధిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ కు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆదివారంనాడు ఆమోద ముద్ర వేశారు. 
click me!