1800 సంవత్సరంలో బళ్ళారి జిల్లా,1807లొ(అంటే పాలేగాళ్ళు అందరు అంతం అయిన తరువాత) కడప,1858లో కర్నూల్, 1882లో అనంతపురం జిల్లాలు ఏర్పడ్డాయి.
ఫ్యాక్సన్ గురించి చర్చ జరిగిన ప్రతిసారి పాలగాళ్ళ సంసృతి వలనే రాయలసీమలో ఫ్యాక్సన్ మొదలైంది అని "ఏకపక్షం"గా అనేస్తారు. పాలెగాళ్ళ వ్యవస్థకు ఫ్యాక్సనుకు ఏమాత్రం సంబంధంలేదు అని చెప్పను కాని అప్పటి పాలెగాళ్ళకు ప్రస్తుత ఫ్యాక్సన్ నాయకులకు ఎటువంటి సంబంధంలేదు.
(అళియ)రామ రాయలు 1565లొ తళ్ళికోట యుద్దంలో ఓడిపోవటంతో విజయనగర సామ్రాజ్య పతనం మొదలై 1646 నాటికి పూర్తిగా అంతరించింది.విజయనగర సామ్రాజ్య పతనం తరువాత ప్రస్తుత రాయలసీమ ప్రాంతం నిజాం & ఇతర మహ్మదీయ నవాబులు,చిన్న చిన్న రాజుల పాలనలో వున్నది.రాజకీయ సుస్థితర లేని ఆ రోజుల్లో నిత్యం ఎదో ఒక యుద్దం లేక దాడులతో ప్రజలు సతమతమయ్యారు. టిప్పుసుల్తాన్ పాలన మొదలైన (1782/1783) తరువాత రాయమసీమ ప్రాంతం టిప్పు మరియు నిజాం మధ్య ఆదిపత్య పోరులో నలిగింది.అనంతపురం జిల్లా రాయదుర్గం,చిత్తూరు గుర్రంకొండ కోటలను టిప్పు స్వయంగా స్వాదీనం చేసుకున్నాడు.
undefined
మరో వైపు భారతదేశంలొ "ఈస్ట్ ఇండియా" కంపిని ఆదిపత్యం కూడ పెరిగింది,వీళ్ళు టిప్పు సుల్తానుతో మొదటి యుద్దంలొ ఓడినా తరువాత టిప్పు మీద పైచేయి సాదించారు.టిప్పు ఈస్ట్ ఇండియా కంపినీతో చేసుకున్న ఒప్పందం ప్రకారం "నిజాం"కు 1792లో రాయలసీమ ప్రాంతాన్ని ఇచ్చాడు(దత్తత అన్న పదం వాడటం చరిత్రక ద్రోహమే).టిప్పుకు వ్యతిరేకంగా ఈస్ట్ ఇండియా కంపినీకి మద్దతుగా నిజాం యుద్దంలో పాల్గొన్నాడు.
టిప్పు సుల్తాన్ 1799లో ఈస్ట్ ఇండియా కంపినీతో జరిగిన యుద్దంలొ మరణించాడు.దీనితో ఒక్క నిజాం మాత్రమే దక్షిణాదిలో బలమైన రాజుగా మిగిలాడు.టిప్పు మరణం తరువాత ఈస్ట్ ఇండియా కంపినీకి చెయ్యవలసిన యుద్దాలు కూడ లేక పోవటం,నిజాంకు వీరి "ఆయుధ" మద్దతు అవసరంలాంటి కారణాలతో 1800 సంవత్సరంలొ నిజాం "రాయలసీమ"ను ఈస్ట్ ఇండియా కంపినీకి రాసిచ్చాడు,దీని వలనే రాయలసీమను "దత్తమండలా"లు అంటారని చరిత్రలొ రాశారు. చరిత్ర మీద ఏమాత్రం అవగాహన వున్న "దత్తత" అన్నమాటను అంగీకరించలేరు.ఈస్ట్ ఇండియా కంపిని అనే "వ్యాపార సంస్థ"కు యుద్ద ఖర్చులు,శాంతి వడంబికల కారణంగా టిప్పు మరియు నిజాం రాసివ్వటాన్ని దత్తత అనటం అసమంజసం.
ఆవిధంగా రాయలసీమ ప్రాంతంలొ బ్రిటీష్ వారి ప్రత్యక్ష అధికారం మొదలైంది.అప్పటి రాయలసీమ ప్రాంతం అంటే బళ్ళారి నుంచి పశ్చిమ చిత్తూరు ప్రాంతం వరకు ఒకే జిల్లాగా "థామస్ మన్రో" కలెక్టరుగా బళ్ళారి జిల్లాను ఏర్పాటు చేశారు.మన్రో ప్రధాన లక్ష్యం రాయలసీమ ప్రాంతంలొ బ్రిటీష్ పెత్తనం తద్వార పన్నుల వసూలు చెయ్యటం.మన్రోకు "పాలెగాళ్ళ" నుంచి వ్యతిరేకత ఎదురైంది.కాకతీయ రుద్రమ పాలనలొ మొదలైన "నాయకుల" వ్యవస్థకు విజయనగర సామ్రాజ్యం పాలెగాళ్ల వ్యవస్థ జతైంది.
విజయనగర సామ్రాజ్యయంలొ పాలన పలు దశలగా విభజించారు.
1.రాజధాని మరియు ఇత్ర ముఖ్య ప్రాంతాలను చక్రవర్తి స్వయంగా పరిపాలిస్తాడు.
2.రాజధాని నుంచి దూరంగా వున్న ముఖ్య కేంద్రాలను చక్రవర్తి కుటుమ సభ్యులో లేదా ఇతర బంధువులొ పాలించేవారు.
3.సామంతులు- మిగిలిన వారికి కన్నా కొంత స్వయంప్రతిపర్తి వుంటుంది.
4.చిన్న ప్రాంతాలను "అమరం"గా కొందరు సైన్యంలొ ముఖ్య నాయకులకు,మంత్రులకు ఇచ్చేవారు.వాటిని "అమర నాయకాలు" అంటారు.వీరు స్వయంగా సైన్యాన్ని ఏర్పర్చుకోని చక్రవర్తికి మద్దతుగా యుద్దాల్లొ పాల్గొంటారు. అమరనాయక ప్రాంతంలో పన్నుల ద్వార వచ్చే ఆదాయం,వీరి సైన్యం కోసం పెట్టే ఖర్చునుబట్టి చక్రవర్తి వీరి కప్పంను నిర్ణయించేవారు.
5.పాలెగాళ్ళు అమరనాయకాలకన్నా చిన్న ప్రాంతాలు ముఖ్యంగా అడువులు,కొండలు ,రాజధాని సరిహద్దులో వుండే ప్రాంతాల్లొ శాంతి భద్రతలు,పన్ను వసూలు,బాటసారులు/యాత్రికుల రక్షణ,బందిపోట్ల దాడుల ను ఎదుర్కొంటాని పాలెగాళ్ళను ఏర్పరచారు.
ఈ పాలేగాళ్ళు నామమాత్రపు కప్పాన్ని చక్రవర్తికి కట్టేవాళ్ళు, వీళ్ళు రాజులు లేక సామంతులు కాకపోయినా ఆయా ప్రాంతాల్లొ సొంత పాలన నడిచేది.1799లొ తమిళనాడులోని కట్ట బ్రహ్మన్నను యుద్దంలొ ఓడించి చంపటం ద్వారా ఈస్ట్ ఇండియా కంపినీ పాలెగాళ్ళ వ్యవస్థను నిర్మూలించటం మొదలుపెట్టింది.బ్రిటీష్ కలెక్టర్ మన్రో 1800 సంవత్సరం నుంచి 140 మందికి పైగా వున్న పాలెగాళ్ళను లొంగదీసుకోవటానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు.పాలెగాళ్ళు రాజభక్తులేమి కాదు,వారి ఆదిపత్యానికి భంగం కలగకుండ వుంటే చాలు ఎవరు అధికారంలొ వుంటే వారికి జైకొట్టి కప్పం కట్టేవాళ్లు.మన్రో పాలెగాళ్ళ ఆదాయన్ని పూర్తిగా లాక్కోవటానికి ప్రయత్నం చెయ్యటంతో పాలెగళ్ళు తిరుగుబాటు చేశారు.
1801లో ప్రస్తుత చిత్తూరు జిల్లా(అప్పట్లో ఉత్తర ఆర్కాట్ జిల్లా) బంగారుపాళ్యం పాలెగారు హత్యతో మొదలైన మన్రో అణిచివేత 1807లో ఆదోని పాలెగారు "అనంతప్ప" హత్యతో ముగిసింది. ఎక్కువ మంది పాలెగాళ్ళు యుద్దం చేసి బ్రిటీష్ /ఈస్ట్ ఇండియా సైన్యం చేతిలో చనిపోయారు. కొందరు మాత్రం మన్రోతో ఒప్పందం చేసుకోని ఆస్తులను,కోటలను వదులుకోని వారు ఇచ్చే పెన్షన్ తీసుకున్నారు.కర్నూల్ జిల్లా తెర్నేకల్ పాలెగాడు "ముత్తుకూరు గౌడప్ప"గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.గౌడప్పను లొంగదీయటం బ్రిటీష్ వాళ్ళకు చాలా రోజుల సాధ్యపడలేదు.వారంపైగా యుద్దం చేసినా ఆయన కోటను పగలగొట్టలేకపోయారు.చివరికి గౌడప్ప సైన్యంలోని ఒకడిని లొంగదీసుకోని కోట రహస్యాలను తెలుసుకోని గౌడప్పను బంధించి బహిరంగంగా ఉరితీశారు. గౌడప్ప ఉరికన్నా ముందు అనేక మంది కోటలోని ఒక బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.బ్రిటీష్ అధికార రికార్డుల ప్రకారం 1807 నాటికి పాలెగాళ్ళ వ్యవస్థ పూర్తిగా తుడుచిపెట్టుకోని పోయింది.
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి "ఉయ్యాలవాడ" & "నుసుం" పాలెగాడు.తల్లి వైపు వారికి వారసులు లేకపోవటంతో నుసుం పాలెగారు కూడ నరసింహారెడ్డికి దక్కింది.వీరు తండ్రి మన్రోతో ఒప్పందం చేసుకోని పెన్షన్ తీసుకున్నారు.1843 ప్రాంతంలో బ్రిటీష్ వారసత్వ హక్కుల మీద చట్టం తీసుకొచ్చింది.ఈ చట్ట ప్రకారం వారసత్వ హక్కులు ఒక్క జమీందారి మీదనే దక్కుతాయి.వారసత్వంగా సంక్రమించే "మిరాశి" హక్కులు కోల్పోవలసి రావటం వలన జమిందార్లు & పాలెగాళ్లు వారి వారసత్వం మాన్యాలు,ఇనాం భూములు, పెన్షన్ కోల్పోయారు.
ఈ మిరాశి రద్దు చట్టం వలన ఉయ్యాలాడ నరసింహారెడ్డి నుసుం లేదా ఉయ్యాలవాడ రెండిటిలొ ఎదో ఒకదాన్ని వదులుకోవలసి వచ్చింది.అదే సమయంలో ఈయన సోదరుడు "జయరామిరెడ్డి" మరణించటం వలన ఆయనకు వచ్చే పెన్షన్ బ్రిటీష్ వాళ్ళు రద్దు చేశారు,వారసత్వంగా అది నరసింహారెడ్డికి రావాలి.ఈకారణాలతో నరసింహారెడ్డి 1846లో బ్రిటీష్ వారి మీద తిరుగుబాటు చేసాడు.అనేక నెలలపాటు గెరిల్లా యుద్దంచేశాడు. చివరికి 1847లొ బ్రిటీష్ వాళ్ళు నరసింహారెడ్డిమి బంధించి ఊరి తీసి,ఆయన శవాన్ని అనేక రోజులపాటు కోట గుమ్మానికి వేలాడదీశారు.అస్తిపంజరం నశించినా కూడా ఆ ఇనుప గొలుసులను సంవత్సరాలపాటు అలాగే వుంచారంట.
1847లొ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మరణించిన తరువాత మరే ఇతర పాలెగళ్ళ వారసులు బ్రిటీష్ మీద తిరుగుబాటు చేసినట్లు రికార్డుకెక్కలేదు.1857 సిపాయి తిరుగుబాటుకన్నా ముందు జరిగిన పాలెగాళ్ళ తిరుగుబాటును మొదటి స్వతంత్ర సంగ్రామం అనటం వాస్తవ విరుద్దం అయితే కాదు.పాలెగాళ్ల చిన్న జాగీర్లలాగ చరిత్రలో కూడ వీరి స్థానం చిన్నాగానే మిగిలిపోయింది. దత్తమండలాల గురిచి కొందరు కేవలం కర్నూల్,అనంతపురం & కడప జిల్లాలనే బ్రిటీష్ వారికి ఇచ్చారు,చిత్తూరును ఇవ్వలేదు అని వాదిస్తుంటారు.ఇది తప్పు,అప్పట్లో జిల్లాలు లేవు బళ్ళారి నుంచి తమిళనాడులొని ఉత్తర ఆర్కాట్ జిల్లాలో వున్న మొత్తం ప్రాంతాన్ని నిజాం బ్రిటీష్ వారికి దారదత్తం చేశాడు.
1800 సంవత్సరంలో బళ్ళారి జిల్లా,1807లొ(అంటే పాలేగాళ్ళు అందరు అంతం అయిన తరువాత) కడప,1858లో కర్నూల్, 1882లో అనంతపురం జిల్లాలు ఏర్పడ్డాయి.
ఫ్యాక్సన్ గురించి చర్చ జరిగిన ప్రతిసారి పాలగాళ్ళ సంసృతి వలనే రాయలసీమలో ఫ్యాక్సన్ మొదలైంది అని "ఏకపక్షం"గా అనేస్తారు. పాలెగాళ్ళ వ్యవస్థకు ఫ్యాక్సనుకు ఏమాత్రం సంబంధంలేదు అని చెప్పను కాని అప్పటి పాలెగాళ్ళకు ప్రస్తుత ఫ్యాక్సన్ నాయకులకు ఎటువంటి సంబంధంలేదు.
అప్పటి పాలెగాళ్ళలో చెప్పుకోదగ ఫ్యాక్సన్ వున్నది "కప్పట్రాల్ల"లో మాత్రమే.బ్రిటీష్ అధికారిక లెక్కల ప్రకారం 142 మంది పాలెగాళ్ళు వుంటే అందులో అత్యధికులు బోయ, ఏకిర, గొల్లలు.రెడ్లు ఐదుగురు,కమ్మలు ఇద్దరు వున్నారు. (జాబితా చూడండి) 1975 తరువాత మొదలైన ఫ్యాక్సను మూలాలు సహజ వనరుల మీద ఆధిపత్యం,రాజకీయ పోరే ప్రధాన కారణం.
పాలెగాళ్ళ వ్యవస్థ బలంగా వున్న తమిళనాడులోని మధురై, సేలం కాని కర్ణాటకలొని బళ్ళారి ప్రాంతంలోకాని ఎప్పుడు ఫ్యాక్సన్ హత్యలు జరగలేదు.ఫ్యాక్సన్ ఒక రాజకీయ దుర్లక్షణమే!దీని చారిత్రిక మూలాలు బలమైనవి కావు.