టేస్టీ..వంకాయ మంచూరియా

First Published Dec 16, 2017, 3:12 PM IST
Highlights
  • వంకాయ మంచూరియా తయారీ విధానం..

కూరగాయలన్నింటిలోనూ రారాజు వంకాయ. గుత్తి వంకాయ, వంకాయ కూర, వేపుడు, చట్నీ.. ఇలా వంకాయతో ఏదీ చేసినా రుచిగానే ఉంటుంది. అయితే.. ప్రస్తుత కాలం పిల్లలు ఫాస్ట్ ఫుడ్ లకు బాగా అలవాటుపడ్డారు. అలాంటి వారికి మాములు కూరలు వండి పెడితే.. నచ్చడం లేదు. అందుకే కాస్త వెరైటీగా ట్రై చేస్తే సరిపోతుంది. వంకాయలో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆ పోషకాలన్నింటినీ మీ పిల్లలకు అందించాలనుకుంటే.. ఈ వంకాయ మంచూరియా ట్రై చేయండి. కచ్చితంగా నచ్చుతుంది.

కావలసిన పదార్థాలు: వంకాయలు - 4, వెల్లుల్లి తరుగు - 4 టేబుల్‌ స్పూన్లు, అల్లం తరుగు - 2 టేబుల్‌ స్పూన్లు, పచ్చిమిర్చి - 1, కొత్తిమీర తరుగు - 4 టేబుల్‌ స్పూన్లు, ఉల్లికాడల తరగు - 1 కప్పు, సోయా సాస్‌ - 2 టేబుల్‌ స్పూన్లు, టమోటా సాస్‌ - 3 టేబుల్‌ స్పూన్లు, పంచదార - 1 టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, నూనె - ఒకటిన్నర టేబుల్‌ స్పూను, జారు కోసం: కార్న్‌ఫ్లోర్‌, మైదా -8 టేబుల్‌ స్పూన్ల చొప్పున, ఉప్పు - చిటికెడు.


తయారుచేసే విధానం: మైదా, కార్న్‌ఫ్లోర్‌, ఉప్పుని కొద్ది నీటితో జారుగా కలుపుకోవాలి. వంకాయలను పొడుగ్గా ‘ఫింగర్స్‌’ లా కట్‌ చేసుకుని జారులో ముంచి నూనెలో దోరగా వేగించాలి. ఇప్పుడు నూనెలో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు వేగించాలి. మంట తగ్గించి సోయా, టమోటా సాస్‌లు, పంచదార, ఉప్పు వేసి 2 నిమిషాల తర్వాత అరకప్పు నీరు పోసి ఉడికించాలి. గ్రేవీ చిక్కబడ్డాక వంకాయ ముక్కలు వేసి ఒకసారి కలిపి 5 నిమిషాల తర్వాత దించేసి, ఉల్లికాడలతో అలంకరించాలి. అంతే టేస్టీ టేస్టీ వంకాయ మంచూరియా రెడీ..

 



 

click me!