రేప్ కేసులో జీవిత ఖైదు: తీర్పు విని ఏడ్చేసిన ఆశారాం

First Published Apr 25, 2018, 3:28 PM IST
Highlights

పదహారేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఆశారాం బాపునకు జోథ్ పూర్ కోర్టు జీవిత ఖైడు విధించింది. 

అహ్మదాబాద్: పదహారేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఆశారాం బాపునకు జోథ్ పూర్ కోర్టు జీవిత ఖైడు విధించింది. ఈ కేసులో మరో ఇద్దరికి 20 ఏళ్ల చొప్పున జైలు శిక్ష విధిస్తూ కోర్టు బుధవారం తీర్పు చెప్పింది. 

2013 నుంచి జైలులో ఉన్న ఆశారాంపై మూడు అత్యాచారం కేసులు నమోదయ్యాయి.  పదహారేళ్ల అమ్మాయిపై అత్యాచారం చేసిన కేసులో ఆరోపణలు రుజువు కావడంతో కోర్టు ఆయనకు జైలు శిక్ష వింధించింది. 

జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించిన వెంటనే ఉద్వేగానికి గురై ఆశారాం ఏడ్పు ప్రారంభించాడు. ఆశారాంను పెట్టి జోథ్ పూర్ కేంద్ర కారాగారం లోపలే ఎస్సీ/ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి మధుసూడాన్ శర్మ తీర్పు వెలువరించారు. 

ఈ కేసులో శిల్పి, శరద్ అనే ఇద్దరికి న్యాయమూర్తి 20 ఏళ్ల చొప్పున జైలు శిక్ష విధించారు.  తాము న్యాయవ్యవస్థను గౌరవిస్తామని, ఈ తీర్పును తాము ఉన్నత స్థాయి కోర్టులో సవాల్ చేస్తామని ఆశారాం అధికార ప్రతినిధి నీలం దూబే చెప్పారు. 

click me!