ఆది శంకరుడి బోధనల నుంచి నేతలు స్ఫూర్తి పొందాలి

First Published Jul 8, 2017, 2:32 PM IST
Highlights

ఆచార్యులవారి ధ్యేయం,సనాతన ధర్మ పునరుద్ధరణ. ఆనాడు  బుద్ధ, జైన ధర్మాలను ఎదిరించడం అసాధ్యమైన కృత్యం. అందుకే ఒక చోట కూడా, ఆ ధర్మాల ప్రస్థాపనే చెయ్యలేదు.  బుద్ధ భగవానుని, తొమ్మిదవ అవతారాన్ని ప్రశ్నించలేదు. భజగోవిందం పాడి, ప్రాపంచిక సుఖం పై ఎక్కువ మోజు ఊందకూడదని, ’భజగోవిందం, భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం మూఢమతే’ అని సలహాలిచ్చారు.మహాకవి శ్రీ శ్రీ  శంకరులవారిని అనుకరిస్తూ నే "మరో ప్రపంచం , మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది అన్నారు".

 

 

వేదవ్యాసులవారి జన్మదినమని, వారు వేదాలను ప్రబోధించిన శుభగడియ అని లేక వారు నిర్యాణం చెందిన దినమని గురు పౌర్ణిమ(ఆషాడ పౌర్ణమి ,వ్యాస పౌర్ణిమ)గా వేలాది సంవత్సరాలుగా ఆచరించబడుతున్నది. ఆ రోజున సారనాథలొ గౌతమ బుద్ధుడు తన ప్రథమ ఉపదేశాన్ని చెప్పినందువల్ల, బౌద్ధులు  బుద్ధ పౌర్ణిమ గా  ఆచరిస్తున్నారు. గురు పరంపరలొ ఆది శంకరాచార్య, మధ్వాచార్య మరియు రామానుజాచార్య ముఖ్యులు.   

                    కేరళలో  కాంగ్రెస్ పార్టీ నేత్రత్వములొని ఐక్య ప్రజాస్వామ్యం కూటమి ప్రభుత్వం, 2005 నుండి వైశాఖ శుద్ధ పంచమి  ఆది శంకరాచార్య జయంతిని, "తత్వ శాస్త్రజ్ఞుల దినొత్సవం"  (Philosophers' Day) గా ప్రకటించింది. దానిని వామ పక్ష ప్రజాస్వామ్య ప్రభుత్వం కూడా కొన సాగిస్తున్నది.  నరేంద్ర మోదిగారి నాయకత్వములోని, జాతీయ ప్రజాస్వామ్య కూటమి కేంద్ర పభుత్వం కూడా, "జాతీయ తత్వ శాస్త్రజ్నుల దినొత్సవం" గా 2015లొ  ప్రకటించింది.

                ప్రపంచ చరిత్రలొ, ఒక రక్తపు బొట్టు కూడా చిందించ కుండా జరుగిన ఒకే, ఒక విప్లవం- భారత దేశములో 8,9వ శతాబ్దాలలొ సనాతన ధర్మ పునరుద్ధరణ. ఇది కేవలం ఒక వ్యక్తి సాహసం. ఆ వ్యక్తియే ఆది శంకరాచార్య. ఎవ్వరిని విమర్శించలేదు; ధూషించలేదు; అవహేళన చెయలేదు; అపహస్యానికి పాల్పడలేదు; అశ్లీలాలు పలకలేదు; క్రూరత్వం జోలికి పోలేదు. కేవలం మాటల మాయలతో తెలివి తేటలతో, వాగ్ధాటితో చర్చలతో, సంభాషణలతో, నశించి పోతున్న, ఆర్శ ధర్మాన్ని ప్రజల ముందుకు తెచ్చి యావత్ భారతావనిని మేలుకొల్పినవారు శంకర భగవత్పాదులవారు.  1963 లొ కర్నూలు ఉస్మానియా కాలేజి తరఫున తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయములో చర్చా కూటమిలో నేను  పాల్గొన్నాను. విశ్వవిధ్యాలయ కళాశాల ప్రిన్సిపల్, జంతు శాస్త్ర ఆచార్యులు డా.పంపాపతి రావుగారు మమ్ములనుద్దేశించి ఉపన్యసించారు.  తేనె పురుగులు మొదలు, వేద, వేదాంతాలు, ఉపనిశత్తులు, భగవద్గీత, ఋషులు, మునులు, సన్యాసులు, మన దేశానికి, చర్చా సంస్కృతిని వారసత్వముగా ప్రసాదించిన గురువులన్నారు. వారు ఉదాహరించిన వ్యక్తులలొ, ఆది శంకర, వివేకానంద, మహాత్మా గాంధీ ఉన్నారు. ఆది శంకరుల కొన్ని శ్లోకాలను మన ముందు ఉంచారు. 

            చికాగో సర్వధర్మ సమ్మెళనములో సనాతన ధర్మాన్ని గురించి గర్జించిన, వివేకానంద, జాతీయ ఉద్యమానికి నాయకత్వం వహించిన, గోఖలే, తిలక్, గాంధీ, రాజాజి, నెహ్రూ, బోస్ మొదలుగువారికి, అద్వైత సిద్దాంత స్థాపనాచార్య, శంకర భగవత్పాదులవారు గురుతూల్యులు.

299 మంది భారత రాజ్యాంగ నిర్మాతలంతా మహ మేధావులు. చాలా మంది ఆంగ్ల, హిందీయెగాక, సంస్కృతం లోనూ ఉద్దండ పండితులు.  వారి చర్చా సామర్థ్యాన్ని మనం అంచనా వెయ్యలేము. ప్రతి, నరములోనూ రక్తపు బొట్టులోనూ దేశభక్తి.  అందువల్లనే, కేవలం రూ. 63,96,729.00 ఖర్చుతొ ప్రపంచములొని అతి పెద్ద రాజ్యాంగాన్ని నిర్మాణం చెయ్యగలిగాము. మూడు సంవత్సర కాలములొ ఒక నిమిషం కూడా వృథా చెయ్యకుండా, కావలిసింత " హోమ్ వర్క్" కూడా చేసి చర్చలలొ పాల్గొన్నారు.   సభా సమయాన్ని వృథా చేస్తున్న, ఈ నాటి చట్ట సభల సభ్యులకు శంకరుల జీవిత చరిత్రలొ శిక్షణ అవసరం.  వారి "అహం బ్రహ్మ" నినాదమే: One man; One vote. ప్రపంచానికి, ప్రజాస్వామ్య నినాదాలను అందించిన మొట్ట మొదటి సంస్కృతి మనది అని నిరూపించనవారు ఆచార్యులవారు: "లోకా సమస్తా, సుఖినో భవంతు". "సర్వ సన్మంగళాని భవంతు". "సర్వెజనాః సుఖినో భవంతు."  ఇ.ఎమ్.ఎస్. నంబూదరి పాడ్ వంటి వామ పక్ష నాయకులు కూడా, శంకర తత్వం, ఈ నాటికీ ప్రస్తుతం అని గర్జిస్తూ, వాటిని పాటించేవాళ్ళ సంఖ్య కరువైందని ఐదు దశాభ్దాల కిందట భాద పడ్డారు.  

                  కేరళలొని పెరియార్ నది ఒడ్డునగల, కాలడిలొ,  వైశాఖ శుద్ధ పంచమి, (April, May) శంకరులవారి జననం. శంకర జయంతి రోజు వటువులకు బ్రహ్మ చర్య దీక్షకు, ముహూర్తం, తారానుకూలం, గురుబలం చూడవలసిన అవసరం లేదని, ఈ నాటికి, ఆర్శ ధర్మీయులలొ నమ్మకం. ఎక్కువ మందిపండిత పామరులుకు సమ్మతమైన శంకరుల జన్మదినం, క్రి.శ.788.  చిన్న తనంలోనే తండ్రిని పొగొట్టుకొన్న బాలుడికి తల్లే సర్వస్వం; మొదటి గురువు.  పేదరికం. దాయాద మాత్సర్యం, సొంత నంబూదరి వంశీయులనుండే, అడుగడుగున ఇబ్బందులు. శివుని ఆజ్ఞ  మేరకు, మొసలి నోరునుండి తప్పించుకొని,  బ్రహ్మచర్యాన్ని స్వీకరించి, నర్మాదా తీరం లోని  గోవింద భగవత్పాదులవారిని  గురువుగా స్వీకరించి,  అనతి కాలములోనే ధర్మ శాస్త్రాలన్నిటిని అధ్యయనం చేసి, జైత్ర యాత్రకు బయలుదేరినారు. దేశ నలుమూలలను మూడు సార్లు తిరుగి, తన ముందు చర్చకు వచ్చిన ప్రతి వ్యక్తిని జయించి, సనాతన ధర్మ పున: స్థాపనలొ కృతకృత్యులైనారు. వారందరూ శంకరులవారిని గురువుగా స్వీకరించారు. శిష్యవర్గములొ  ప్రధాన వ్యక్తు లు: .1. పద్మపాదుడు. 2. కుమారిల భట్టు. 3. భట్టిపాదుడు. 4. మండన మిశ్ర,ఆయన భార్య ఉభయ భారతి   జయకేతన సంకేతముగా దేశం నాలుగు దిశలయందు; బదరి, ద్వారకా, పూరి, శృంగేరి లలొ నాలుగు పీఠాలను స్థాపించి, ధర్మాన్ని కాపాడారు. మఠాల వివరాలు: 1. హస్తామలకాచార్యుడు, గోవర్ధన పీఠం, పూరి 2.సురేశ్వరాచార్యుడు,శృంగేరి శారదాపీఠం.. శృంగేరి. 3. పద్మపాదాచార్యుడు,కాంచి పీఠం. ద్వారకా  4.తోటకాచాఱ్యుడు జ్యోతిర్మఠం బదరీనాథ్.   ఈ పరంపరలో చాలా మంది చరిత్ర పుటలెక్కిన జగద్గురువులున్నారు. వారిలో శృంగేరి పీఠమెక్కిన 12 వ జగద్గురువులైన మాధవ విద్యారణ్యులవారు, దక్షిణ భారతములోనే అతి ప్రసిధ్ధమైన, హిందూ సామ్రాజ్యం, విజయనగరాన్ని, హరిహర రాయులు, బుక్క రాయల ద్వారా 1336 లొ స్థాపించి అమరులైనారు. 

 

 

 

 

Full moon this weekend - called Guru Purnima, Hay Moon, Mead Moon, Ripe Corn Moon, Buck Moon, or our favorite, ⛈️ THUNDER MOON ⛈️ pic.twitter.com/XLufAdoDEQ

— NASA Moon (@NASAmoon) 7 July 2017

  ధర్మం తొక్కబడి, అధర్మం విజ్రంబించినప్పుడు, ధర్మ సంస్థాపనకొరకు, మహా పురుషులు అప్పుడప్పుడు, జన్మిస్తారని భగవద్గీత సందేశానికి, మొదటి, సోదాహరణ, శ్రీ శంకరులవారు. ఇది కథ కాదు; చరిత్ర.        

                  ఆచార్యులవారి ధ్యేయం,సనాతన ధర్మ పునరుద్ధరణ. ఆనాడు  బుద్ధ, జైన ధర్మాలను ఎదిరించడం అసాధ్యమైన కృత్యం. అందుకే ఒక చోట కూడా, ఆ ధర్మాల ప్రస్థాపనే చెయ్యలేదు.  బుద్ధ భగవానుని, తొమ్మిదవ అవతారాన్ని ప్రశ్నించలేదు. భజగోవిందం పాడి, ప్రాపంచిక సుఖం పై ఎక్కువ మోజు ఊందకూడదని, ’భజగోవిందం, భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం మూఢమతే’ అని సలహాలిచ్చారు.మహాకవి శ్రీ శ్రీ  శంకరులవారిని అనుకరిస్తూ నే "మరో ప్రపంచం , మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది అన్నారు". "శంకరులవారి స్థాయిని నేను అందుకొలేక పోయాను. వారికి శిష్యుడు అనిపించుకొనే అర్హత నాకు లేదు" అన్నారు.

సర్వస్వాన్ని వదలి పెట్టండని (renunciation) శంకరుల వాదం కాదు. ఒకనాడు బిక్షాటనకెళ్ళిన ఇంట్ళొ కట్టుకోడానికి సరైన వస్త్రాలు కూడా లేని ఇల్లాలు, ఉన్న కేవలం ఒక ఉసిరి కాయిని, ఇంటి తలుపు చాటునుంచి  దానం చేసిన పరిస్థితి గ్రహించిన శంకరులవారు లక్ష్మీదేవిని స్తుతించారు.  "మనమున ద్విజాంగన పయిన్ / కనికముం గని సుతించెగమలాలయన/ య్యనఘండంతం గురిసినవి/ కనకామలకములు ధారగా వారింటన్." (డా.కోడూరి విష్ణు ప్రసాద్ రచన, ధర్మ దండము).

              శ్రీశైలములో,  పాలధార, పంచదార అని పిలువబడే  గుహ ఉంది. ఇక్కడ ఆచార్యులు తపస్సు చేయ్యడమే కాకుండా, అక్కడే సౌందర్య లహరి, శివానంద లహరి, భ్రమరాంభాష్ఠకం రచించారనేప్రతీతి. "శ్రీ మల్లికార్జుని నా/భ్రామరి సేవించి శంరుండటవి/ సీమలం దపమును గొని యా/స్వామి ’శివానందలహరి స్థుతి చేసెన్". (డా.కోడూరి విష్ణు ప్రసాద్ రచన, ధర్మ దండము).  

                  ఏ ఆధునిక సౌకర్యాలూ లేని, ఎద్దుల బండి యుగములొ  ఆచార్యులవారు సన్యాస దీక్ష తిసుకొన్నది 16 సంవత్సరం. మొత్తం ఆయుస్సు 32 సంవత్సరాలు. దేశం మొత్తాన్ని మూడు సార్లు ఎలా తిరుగగలిగారు? ఇన్నిఎలా సాధించగలిగారు? ఆ శక్తి ఎక్కడనుండి? గాందీజి గురించి "మాంస, ఖండాలతొ ఒక వ్యక్తి ఇలా బదికినాడంటె, ముందు తరాలు నమ్మడం కష్టం" అన్న ఐన్ స్టిన్ కు శంకరాచుర్యలగురించి తెలిసి ఉంటే ఏమనేవాడో?  

దీక్ష తీసుకొన్నప్పుడు తల్లికి, ఇచ్చిన వాగ్ధానం బట్టి: "అవసాన దశయ తల్లికి;/ నవమాసంబును మోసి ననుం గాంచిన యా / ప్రవిముల మూర్తినిం గని తీ/ రవలెన్ దన యార్తిం దీర్చి రావలెనిప్పుడే". (డా.కోడూరి విష్ణు ప్రసాద్ రచన, ధర్మ దండము) కన్న తల్లి దండ్రులు, పిల్లల నిర్లక్ష్యానికి గురియవుతున్న ఈ రోజులలొ శంకరువారి జీవితం ఆదర్శం. "కుపుత్ర జాయతే భవతు. కుమాతా జాయతే న భవతి." (చడ్డ కొడుకు పుట్టవచ్చు. చడ్ద తల్లి పుట్టదు.). 

            శ్రీరామచంద్ర, పాండవుల తరువాత, భారత దేశములోని ఎక్కువ ప్రదేశాలతొ అనుబంధం ఉన్న వ్యక్తి, శంకరులవారు అనే విషయాన్ని గుర్తుంచుకొవాలి. మన దేశములోనే గాక, ప్రపంచవ్యాప్తముగా,  ధర్మ శాస్త్రజ్ఞులకే గాక, మేధావి వర్గానికి, సామాన్య ప్రజానీకానికి, తత్వ శాస్త్రజ్ఞులకు, చట్టసభల సభ్యులకు, అధ్యాపకులకు, ఆచార్యులకు, విద్యార్థులకు, సంసారులకు, సన్యాసులకు, వ్యాపార వాణిజ్య వర్గాలకు, కృషి పండితులకు, ప్రభుత్వోద్యోగులకు, విదేశీ జీవితం పై  మోజు పెంచుకొని, మన దేశాన్ని హీనంగా విమర్శించే "Educated" అనుకొంటున్నవర్గానికి, శంకరులవారు ఆదిగురువులు కావాలి. దేశానికి ఆచార్య పంపాపతి, విద్యారణ్య, రాజ్యాంగ నిర్మాతల, వంటివారి ఆవశ్యకత ఎంతో ఉన్నది. "ఏ జాతి తన చరిత్రను,  తనలొ జనించిన మహా పురుషుల జీవితాలను విస్మరిస్తుందోఆ జాతికి, ఉజ్వలమైన వర్తమానం గాని, భ్యవిష్యత్తు గాని లేదని చెప్పవచ్చు. అందుకనే, ఒక జాతిని జాగృత, మొనర్పదలచిన, ఆ జాతి పూర్వ యశస్సును, ఆ జాతిలొ జన్మించిన మహాపురుషుల గుణ గణాలను, స్తుతించడం జరుగుతుంది." (మహత్మా గాంధీ).

       

 

(* రచయిత కన్నడ దేశం నుంచి వచ్చి కర్నూలులో  స్థిరపడిన ఉడిపి హోటల్ యజమాని. తెలుగువాడైపోయి తెలుగు భాష పరిరక్షణకు,  పుస్తక పఠన వ్యాప్తికి  గత మూడు దశాబ్దాలుగా శ్రమిస్తున్నారు)

click me!