Uttar Pradesh : ఉద్యోగాల భర్తీ ప్రకటన ... ఎన్ని ఖాళీలు, ఏ విభాగంలోనో తెలుసా?

Published : Sep 02, 2025, 05:32 PM IST
Uttar Pradesh : ఉద్యోగాల భర్తీ ప్రకటన ... ఎన్ని ఖాళీలు, ఏ విభాగంలోనో తెలుసా?

సారాంశం

ఉత్తర ప్రదేశ్ విద్యావ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు యోగి సర్కార్ సిద్దమయ్యింది. ఇందులో భాగంగానే యూనివర్సిటీల్లో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం.

ఉత్తరప్రదేశ్‌లోని మూడు కొత్త యూనివర్సిటీల్లో 948 కొత్త ఉద్యోగాల భర్తీకి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ యూనివర్సిటీలు మొరాదాబాద్‌లోని గురు జంభేశ్వర్ యూనివర్సిటీ, మీర్జాపూర్‌లోని మా వింధ్యవాసిని యూనివర్సిటీ, బలరాంపూర్‌లోని మా పాటేశ్వరి యూనివర్సిటీ. వీటిలో 468 తాత్కాలిక నాన్ టీచింగ్, 480 అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఉన్నాయి. ఈ నియామకాల ద్వారా యూనివర్సిటీల పరిపాలన, విద్యా నాణ్యత మెరుగుపడతాయని… యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.

ఉన్నత విద్యాశాఖ మంత్రి యోగేంద్ర ఉపాధ్యాయ్ మాట్లాడుతూ.. "ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో ఉత్తరప్రదేశ్ ఉన్నత విద్యలో కొత్త స్థాయిని అందుకుంటోంది. ఈ ఉద్యోగాల ఆమోదం యూనివర్సిటీలను బలోపేతం చేయడానికి, రాష్ట్రాన్ని విద్యారంగంలో ముందుంచడానికి ఒక ముఖ్యమైన అడుగు." అని అన్నారు.

"యువతకు నాణ్యమైన విద్య, ఉద్యోగావకాశాలు కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి పదేపదే చెప్పారు. యూనివర్సిటీల్లో కొత్త ఉద్యోగాల కల్పన ఉన్నత విద్యను బలోపేతం చేయడానికి, యువతను స్వయం సమృద్ధిగా మార్చడానికి ఒక చర్య" అని విద్యాశాఖ మత్రి చెప్పారు.

మూడు యూనివర్సిటీలకు 156 తాత్కాలిక నాన్ టీచింగ్ ఉద్యోగాలు కేటాయించారు. ఇవి ఫిబ్రవరి 28, 2026 వరకు ఉంటాయి. అవసరమైతే ముందే రద్దు చేసే అవకాశం ఉంది. ఫార్మాసిస్ట్, ఎలక్ట్రీషియన్, జూనియర్ ఇంజనీర్, స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్ అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్, ల్యాబ్ అసిస్టెంట్, డిప్యూటీ రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, పర్సనల్ అసిస్టెంట్, అకౌంటెంట్, చీఫ్ అసిస్టెంట్, మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్ వంటి వివిధ రకాల ఉద్యోగాలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ కమిషన్ ద్వారా ప్రత్యక్ష నియామకం, ప్రమోషన్లు, డిప్యుటేషన్ ద్వారా నియామకాలు జరుగుతాయి.

అదనంగా ప్రతి యూనివర్సిటీ 160 మంది సిబ్బందిని అవుట్ సోర్సింగ్ ద్వారా నియమిస్తున్నారు… మూడు యూనివర్సిటీల్లో కలిపి 480 ఉద్యోగాలు. కంప్యూటర్ ఆపరేటర్, క్లీనర్, సెక్యూరిటీ గార్డ్, గార్డెనర్, ప్యూన్, డ్రైవర్, లైబ్రరీ అటెండెంట్ వంటి ఉద్యోగాలు ఉన్నాయి. అవుట్ సోర్సింగ్ ప్రక్రియ జెమ్ పోర్టల్ ద్వారా జరుగుతుంది. రిజర్వేషన్ నిబంధనలు, నియమాలను పాటిస్తారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Modi Putin Meeting: మోదీ, పుతిన్ భేటీతో మనకు జరిగేదేంటీ.? రష్యా ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంది.?
Hubballi : వధూవరులు లేకుండానే రిసెప్షన్ !