అలాంటి ఖైధీలందరు విడుదల..: యోగి సర్కార్ కీలక నిర్ణయం

Published : Sep 01, 2025, 11:49 PM IST
Yogi Adityanath

సారాంశం

యుపిలోని జైళ్లలో తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడే ఖైదీలకు, వృద్ధులను ముందస్తుగానే విడుదలచేసేలా కొత్త నిబంధనలు తీసుకువస్తోంది యోగి సర్కార్.  

ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం మానవత్వంతో కూడిన ఓ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని వివిధ జైళ్లలో శిక్ష అనుభవిస్తూ తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడే ఖైదీలను విడుదల చేసేందుకు కొత్త నిబంధనలు రూపొందిస్తోంది యోగి  సర్కార్. మానవతా దృక్పథంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం యోగి చెప్పారు.

సుప్రీంకోర్టు మార్గదర్శకాలు

సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నియమాలు ఉంటాయి. అర్హులైన ఖైదీలకు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు.అర్హులైన ఖైదీలను గుర్తించేందుకు జైళ్లలో సర్వే నిర్వహిస్తారు. మహిళలు, వృద్ధులకు ప్రాధాన్యత ఇస్తారు. 

ఎవరికి వర్తించదు?

ఖూనీ, ఉగ్రవాదం, దేశద్రోహం, మహిళలు, పిల్లలపై జరిగిన నేరాలకు పాల్పడిన వారికి ఈ ముందస్తు విడుదల వర్తించదు.ప్రతి మూడు నెలలకోసారి అర్హులైన ఖైదీల జాబితాను సమీక్షిస్తారు. విడుదల చేయని వారికి కారణాలు తెలియజేస్తారు.

ఖైదీలకు న్యాయ సహాయం, పునరావాసం

ఖైదీలకు న్యాయ సహాయం అందించేందుకు, వారి పునరావాసానికి ప్రణాళికలు రూపొందిస్తోంది యోగి సర్కార్. వ్యవసాయం, గోసంరక్షణ వంటి పనుల్లో వారిని భాగస్వాములను చేసేందుకు సిద్దమయ్యింది యోగి సర్కార్. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Heavy Rush at Sabarimala Temple అయ్యప్ప స్వాములతో కిటకిట లాడిన శబరిమల | Asianet News Telugu
దేశంలోని 55 శాతం సెల్ ఫోన్లు తయారయ్యేది ఎక్కడో తెలుసా?