Apple: టెక్ దిగ్గ‌జం ఆపిల్ త‌మిళ‌నాడు ప్లాంట్.. షాకింగ్ విష‌యాలు వెలుగులోకి..

By Mahesh Rajamoni  |  First Published Dec 30, 2021, 11:25 PM IST

Apple: ప్ర‌పంచంలోనే టాప్ కంపెనీల్లో ఒక‌టైన టెక్నాల‌జీ దిగ్గ‌జం ఆపిల్ ఇండియా ప్లాంట్ కు సంబంధించి షాకింగ్ విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. అక్కడ ప‌నిచేస్తున్న మ‌హిళా కార్మికుల‌కు క‌నీస సౌక‌ర్యాలు లేవ‌ని అక్క‌డ ప‌నిచేస్తున్న కార్మికులు పేర్కొంటున్నారు. 
 


Apple: టెక్నాలజీ దిగ్గ‌జ కంపెనీ ఆపిల్ దేశీయ ప్లాంట్లలో మహిళలకు కనీస సౌకర్యాలు లేవు. ప్లష్‌ టాయిలెట్‌లు లేని రద్దీ వసతి గృహాలు, నాణ్యతలేని ఆహారం వంటి దుర్భర పరిస్థితులు ఉన్నాయి. వివరాల్లోకెళ్తే.. తమిళనాడులోని ఫాక్స్‌కాన్‌ ప్లాంట్‌లో ఐఫోన్‌లను అసెంబుల్‌ చేసే మహిళా ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వారికి అవసరమైన కనీస సౌకర్యాలు లేవని వారు పేర్కొంటున్నారు. ప్లష్‌ టాయిలెట్‌లు లేని రద్దీగా ఉండే వసతి గృహాలు, నాణ్యతలేని ఆహారం.. కొన్ని సార్లు అందులో పురుగులు సైతం రావడం వంటి పరిస్థితులు ఉన్న‌ప్ప‌టికీ ఉపాధి కోసం వారు వీటిని భరించాల్సిన పరిస్థితి ఉంద‌ని రాయిటర్స్  నివేదించింది. అయితే, ఇలాంటి కల్తీ ఆహారం తిని 250 మందికి పైగా కార్మికులు అనారోగ్యానికి గురైన సమయంలో తీవ్ర ఆగ్ర‌హం వ్యక్తంచేసిన కార్మికులు.. నిరసనకు దిగారు. మొత్తం 17 వేల మందికి కార్మిలు నిరసనలో పాల్గొన‌గా..  అనేక పరిణామాలు చోటుచేసుకుని ప్లాంటు మూతకు కారణమైంది.

Also Read: journalists: 2021లో 45 మంది జ‌ర్న‌లిస్టుల హ‌త్య‌.. ప్ర‌మాదంలో పత్రికా స్వేచ్ఛ‌..

Latest Videos

undefined

అయితే, యాపిల్‌ ప్లాంటులోని పరిస్థితుల గురించి  మహిళా ఉద్యోగులు మాట్లాడుతూ.. వసతి గృహాలు ఉండాల్సిన దాని కంటే రద్దీగా ఉండేవనీ, సరైన సౌకర్యాలు కూడా లేవన్నారు. ఆరు నుంచి 30 మంది మహిళలు ఉండే గ‌దుల్లో ఉండేవ‌నీ, కార్మికులు నేలపైనే పడుకునే వారని చెప్పారు. మంచినీరు కూడా అందుబాటులోలేని విధంగా ఉన్నాయ‌నీ, మరుగు దొడ్ల‌ పరిస్థితి దారుణమేనని పేర్కొన్నారు. ‘‘ప్లాంట్‌ వసతి  గృహంలో ఉంటున్న వారు  ఏప్పుడూ ఏదో ఒక అనారోగ్య‌ సమస్యకు గురయ్యేవారు. వాటిలో చర్మ సంబంధ అలెర్జీలు, ఛాతీ నొప్పి, ఫుడ్‌ పాయిజనింగ్‌’’లు అని ఓ మహిళా ఉద్యోగి తెలిపారు. అయితే, త్వరలోనే ఈ సమస్యలు పరిష్కరించబడతాయని భావించామనీ, అయితే, సమస్య తీవ్రత పెరిగి అనేక మందిని ప్రభావితం చేసిందని తెలిపారు.

Also Read: Amit Shah: క‌రోనా మ‌ళ్లీ విజృంభిస్తోంది.. నిర్లక్ష్యం వహిస్తే.. మహమ్మారి నియంత్రణ కష్టమే..!

ఈ ప్లాంట్‌లో ఉద్యోగుల‌ కోసం ఉపయోగించే కొన్ని డార్మిటరీలు, డైనింగ్‌ రూమ్‌లు అవసరమైన ప్రమాణాలకు అనుగుణంగా లేవని ఆపిల్‌, ఫాక్స్‌కాన్‌లు వెల్లడించాయి. ఆయా విషయాలు పరిశీలనలో ఉన్నాయ‌నీ, ప్లాంట్‌ను తిరిగి తెరవడానికి ముందు ఆపిల్‌ దాని కఠినమైన ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా ఏర్పాట్లు చేస్తుందని ఆపిల్‌ వెల్లడించింది.  ‘‘ఉద్యోగుల‌ కోసం ఉపయోగించే కొన్ని రిమోట్‌ డార్మిటరీలు, వసతి, భోజన గ‌దులు మా అవసరాలకు అనుగుణంగా లేవని మేము గుర్తించాం. సమగ్ర‌మైన దిద్దుబాటు చర్యలను వేగంగా అమలు చేయడానికి మేము సరఫరాదారుతో కలిసి పని చేస్తున్నాం’’ అని ఆపిల్‌ పేర్కొంది. చెల్లింపుల విషయం కూడా తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది. ఈ ప్లాంట్ ఉద్యోగుల‌ నిరసనల తర్వాత ఫుడ్‌ సేఫ్టీ అధికారులు.. ఫుడ్‌ పాయిజనింగ్‌ సంభవించిన హాస్టల్‌ను సందర్శించారు. అక్కడ ఎలుకలు, అధ్వాన్నమైన డ్రైనేజీని  గుర్తించిన తర్వాత వాటిని మూసివేశారు. హాస్టల్‌ ఉన్న తిరువళ్లూరు జిల్లాకు చెందిన సీనియర్‌ ఫుడ్‌ సేఫ్టీ అధికారి జగ‌దీష్‌ చంద్రబోస్‌ మాట్లాడుతూ.. భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా అక్కడ పరిస్థితులు లేవని అన్నారు.

Also Read: Omicron: ఆ మూడు గంటలు మద్యం అమ్మకాలు ఆపండి... హైకోర్టు ఆదేశాలు

click me!