West Bengal | మ‌మ‌తా సర్కార్ కీలక నిర్ణయం… ఆ దేశం నుంచి వచ్చే విమానాలపై నిషేధం

By Rajesh KFirst Published Dec 30, 2021, 8:06 PM IST
Highlights

West Bengal పశ్చిమ బెంగాల్ లోని మ‌మ‌తా బెన‌ర్జీ ప్రభుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. యునైటెడ్ కింగ్‌డమ్ నుండి కోల్ కతాకు నేరుగా వచ్చే ఇంటర్నేషనల్ విమానాలపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. జనవరి 3 నుంచి ఈ నిషేధం అమలులోకి రానుందని  మ‌మ‌తా సర్కార్ నిర్ణయించింది.
 

 దేశవ్యాప్తంగా క‌రోనా  కేసులు విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలోనే కరోనా కొత్త‌ వేరియంట్ ఓమిక్రాన్ పంజా విసురుతోంది. ఈ నేపథ్యంలో దేశ‌మంత‌టా ఆందోళనలు నెలకొన్నాయి. ఈ త‌రుణంలో కేంద్రం గురువారం ఢిల్లీ, హర్యానా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, జార్ఖండ్‌లకు లేఖలు రాసింది. క‌రోనా కేసుల‌ను క‌ట్టిడి చేయడానికి  వ్యాక్సినేషన్ వేగ‌వంతం చేయాలని రాష్ట్రాలకు సూచించింది. దీంతో పాటు కరోనా పరీక్షలు, ఆసుపత్రుల్లో సౌకర్యాలను పెంచడం, ట్రేసింగ్‌, కంటైన్మెంట్‌ జోన్లపై దృష్టిసారించాలని లేఖలో తెలిపింది.

ఈ త‌రుణంలో పశ్చిమ బెంగాల్ లోని మ‌మ‌తా బెన‌ర్జీ ప్రభుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. జనవరి 3 నుండి యూకే నుంచి కోల్ కతాకు నేరుగా వచ్చే అన్ని విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు బెంగాల్ ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా ఎట్ రిస్క్ జాబితాలో లేని దేశాల నుండి పశ్చిమ బెంగాల్‌కు వచ్చే ప్రయాణీకులందరూ వారి ఖర్చుతో తప్పనిసరిగా కోవిడ్-19 పరీక్ష చేయించుకోవాలి. ఫైట్ ఎక్కేముందు కోవిడ్ టెస్ట్ కోసం బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందని మమత సర్కార్ సృష్టం చేసింది. యూకేలో ఓమిక్రాన్ కేసులు ఎక్కువ అవుతున్న క్రమంలో పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకుంది.

Read Also: కోవిడ్‌పై జగన్ కీలక సమీక్ష: సమావేశం మధ్యలోనే ఆ రెండు కంపెనీలకు సీఎం ఫోన్

 UK నుండి విమానాలలో వచ్చే వారిలో ఎక్కువ శాతం కేసులు బ‌య‌ట‌ప‌డుతున్న‌యని, ఓమిక్రాన్ కేసులు ఎక్కువగా ఉన్న దేశాల నుండి వచ్చే విమానాలపై ఆంక్షలు విధించడంపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలని మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. మొత్తం ప్రయాణికుల్లో 10 శాతం మందికి ఆర్టీపీసీఆర్ టెస్టులు ఎయిర్ లైన్స్ సంస్థ చేయాలని…మిగతా 90 శాతం మంది రాపిడ్ యాంటీజెన్ పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఏం చేస్తుందో చూడాలి అంటూ మమతా బెనర్జీ అన్నారు.  పశ్చిమ బెంగాల్‌లో కొత్త‌గా  1,089 క‌రోనా కేసులు నమోదయ్యాయి, అందులో కోల్‌కతాలో 540 కొత్త కేసులు నమోదు కావ‌డం గ‌మ‌నార్హం. 

Read Also: మా పోలీసుల పనితీరు భేష్... ఈ విషయాల్లో మేమే టాప్..: ఎస్పీ సిద్దార్థ్ వార్షిక రివ్యూ వెల్లడించిన
 
మరోవైపు, పశ్చిమ బెంగాల్‌లో వ‌చ్చే ఏడాది జనవరి 8 నుంచి 16 వరకు గంగా సాగర్ మేళా జరగనున్నాయి. ఈ  నేపథ్యంలో.. గంగా సాగర్ మేళాలో ఎటువంటి కోవిడ్ సంబంధిత ఆంక్షలు ఉండబోవని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ సృష్టం చేశారు. కుంభమేళా జరిగినపుడు ఇటువంటి ఆంక్షలేమైనా ఉన్నాయా? అని మమత ప్రశ్నించారు. వివిధ రాష్ట్రాల నుంచి ప్ర‌జ‌ల‌ను ఏవిధంగా  ఆపగలమని ఆమె అన్నారు.

click me!