మహిళా కానిస్టేబుల్‌పై గ్యాంగ్ రేప్.. వీడియో తీసి బెదిరింపులు

By telugu teamFirst Published Sep 25, 2021, 7:21 PM IST
Highlights

ఓ మహిళా కానిస్టేబుల్‌పై గ్యాంగ్ రేప్ జరగడం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కలకలం రేపింది. నీమచ్ జిల్లాలో ఓ మహిళా కానిస్టేబుల్‌పై ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. ఇందులో ప్రధాన నిందితుడి తల్లి కూడా ఉన్నారు.

భోపాల్: మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. సాధారణ మహిళలే కాదు.. ఓ మహిళా కానిస్టేబుల్‌పైనా గ్యాంగ్ రేప్ జరగడం కలకలం రేపింది. మధ్యప్రదేశ్‌లోని 30 ఏళ్ల మహిళా కానిస్టేబుల్‌పై ముగ్గురు దుండగులు గ్యాంగ్ రేప్ చేశారు. అంతేకాదు, ఘటనను వీడియో తీసి బెదిరింపులకు పాల్పడ్డారు. చంపేస్తామనీ, డబ్బులు ఇవ్వాలని బెదిరించారు. ఈ ఘటనపై తాజాగా కేసు నమోదైంది.

మధ్యప్రదేశ్‌ నీమచ్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇదే నెలలో జరిగిన ఈ గ్యాంగ్ రేప్‌పై బాధితురాలు 13వ తేదీన ఫిర్యాదు నివ్వగా కేసు నమోదైంది.

ప్రధాన నిందితుడు కొన్నాళ్లుగా ఆ మహిళా కానిస్టేబుల్‌తో సోషల్ మీడియాలో చాట్ చేశారని, ఫేస్‌బుక్‌లో కలిసిన నిందితుడు తర్వాత తరుచూ వాట్సాప్‌లో చాట్ చేసేవాడని తెలిసింది. నిందితుడి తమ్ముడి బర్త్ డే పార్టీకి ఆమెను ఇంటికి ఆహ్వానించాడు. అక్కడికెళ్లిన ఆమెపై నిందితుడి, అతని సోదరుడు, మరో వ్యక్తి లైంగికదాడికి పాల్పడ్డారు. నిందితులు వీడియో కూడా తీసినట్టు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితుడి తల్లి కూడా ఆమెపై బెదిరింపులకు పాల్పడినట్టు వివరించారు. నిందితుడి తల్లి, ఇతర బంధువులు ఆమెను బెదిరించినట్టు తెలిపారు. డబ్బులు ఇవ్వాల్సిందిగా బెదిరింపులకు పాల్పడ్డట్టు పేర్కొన్నారు. నీమచ్‌లో విధులు నిర్వహించిన ఆమెను ఇప్పుడు ఇండోర్‌కు ట్రాన్స్‌ఫర్ చేసినట్టు మహిళా పోలీసు స్టేషన్ ఇన్‌‌చార్జ్ అనురాధ గిర్వాల్ వివరించారు.

ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్టు అనురాధ తెలిపారు. ఇందులో ప్రధాన నిందితుడి తల్లి కూడా ఉన్నట్టు వివరించారు. ఇప్పటికే ప్రధాన నిందితుడు, ఆయన తల్లి సహా ముగ్గురిని అరెస్టు చేసినట్టు చెప్పారు.

click me!