corona third wave :కరోనా థర్డ్‌వేవ్ తప్ప‌దు.. మ‌రో రెండు నెలల్లో పీక్ స్టేజ్

By Rajesh K  |  First Published Dec 8, 2021, 11:04 AM IST

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. వేగంగా వ్యాపిస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. క్రమంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఫిబ్రవరికల్లా పీక్ స్టేజ్ (corona third wave) కు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. అయినా భయపడాల్సిన అవసరం లేదంటున్నారు. ఐఐటీ కాన్పూర్ కు చెందిన ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ తెలిపారు.


Omicron Third Wave : ప్ర‌పంచ దేశాల‌ను క‌రోనా మహమ్మారి కొత్త వేరియంట్ భ‌యాందోళ‌న‌కు గురి చేస్తోంది. ఇప్ప‌టికే డెల్టా వేరియంట్‌తోనే తలమునకలైన ప్రపంచ దేశాలకు తాజాగా..ఒమిక్రాన్‌ చావుదెబ్బ కొట్టేలా కనిపిస్తోంది. చాప‌కింద నీరులా విస్త‌రిస్తోంది. ద‌క్షిణాఫ్రికాలో వెలువ‌డిన ఈ వేరియంట్ కేవ‌లం రెండు వారాల వ్య‌వ‌ధిలోనే ఇప్ప‌టి వ‌ర‌కూ ఈ కొత్త వేరియంట్ 57 దేశాల‌కు విస్త‌రించింది. ఒమిక్రాన్​ వేరియంట్​ డెల్టా కంటే ఆరు రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతోందని  వైద్య నిపుణల హెచ్చరిస్తున్నారు.
 
గ‌త నెల‌లో దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఈ వేరియంట్‌ రోజురోజుకు వ్యాప్తి చెందుతోంది.  ఇప్పటివ‌ర‌కూ ప్రపంచ వ్యాప్తంగా 1,701 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయని తెలుస్తోంది. దీంతో ప్రపంచ దేశాల్లో ఆందోళన‌లు మొద‌ల‌య్యాయి. ఇప్ప‌టికే పలు ప్ర‌పంచ దేశాలు అప్ర‌మ‌త్త‌మయ్య‌యి. విదేశీ ప్ర‌యాణీకుల‌పై ఆంక్షాలు విధిస్తోన్నాయి. క‌రోనా నిబంధ‌న‌ల‌ను క‌ఠినత‌రం చేస్తోన్నాయి. ప‌బ్బులు, పార్టీలు, మీటింగ్ ల‌ను ర‌ద్దు చేశాయి. 

Read Also: https://telugu.asianetnews.com/national/6822-fresh-covid-cases-in-india-r3qdj9 

Latest Videos

undefined

ఈ క్ర‌మంలో భార‌త్ లో కూడా ఒమిక్రాన్ ఏంట్రీ అయింది. ఈ వేరియంట్ రోజురోజుకూ విస్తరిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కూ 25 కేసులు న‌మోదయ్యాయి. దీంతో ఒమిక్రాన్‌ వ్యాప్తి దేశంలో దడ పుట్టిస్తోంది. క‌రోనా సెకండ్‌ వేవ్‌ మిగిల్చిన నష్టాన్ని మర్చిపోకముందే.. ఇప్పుడూ క‌రోనా కొత్త వేరియంట్ రావ‌డంతో .. ఇక, థర్డ్‌ వేవ్‌ ముప్పు తప్పదన్నఅనే క‌ల‌వ‌రం మొద‌లైంది. ఇక ఇతర రాష్ట్రాలకు వ్యాప్తించే  ప్రమాదం ఉందని కేంద్ర,  రాష్ట్ర ప్రభుత్వాలు భయపడుతున్నాయి.

మ‌రో వైపు .. క‌రోనా వైర‌స్ మ‌రో సారి విజృంభిస్తోంది. వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి క‌ల్లా.. థర్డ్‌వేవ్‌ (corona third wave) వచ్చే ప్రమాదం ఉందన్న  వైద్య నిపుణులు హెచ్చరిస్తోన్నారు. దేశంలో సగానికి పైగా వ్యాక్సినేష‌న్ పూర్తి అయినా.. వైరస్‌ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. దీంతో ప్ర‌భుత్వాల‌కు , ప్ర‌జ‌ల‌కు  కంటి మీద కునుకు లేకుండా పోయింది. థర్డ్‌..ఫోర్త్‌.. ఫిఫ్త్‌ ఇలా ఎన్ని వేవ్‌లు వచ్చినా ఎదుర్కొనేలా యుద్ధానికి సన్నద్ధం కావా ల్సిందేనని కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలను సంసిద్దం చేస్తోంది.  

ఈ క్ర‌మంలో  ఐఐటీ కాన్పూర్ కు చెందిన ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ క‌రోనా, దేశంలోని ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌పై ఓ అధ్య‌యనం చేశారు. వ‌చ్చే జనవరి నెలల్లో భార‌త్ లో క‌రోనా కేసుల సంఖ్య‌ స్వల్ప స్థాయిలో ఉన్నా.. ఫిబ్ర‌వ‌రి క‌ల్లా పీక్ స్టేజ్ కు చేరుకుంటాయ‌ని తెలిపారు. అయినా.. భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదంటున్నారు.

Read Also: https://telugu.asianetnews.com/national/change-has-to-come-also-from-within-to-end-evil-of-dowry-supreme-court-r3qhzl

కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ‘సూత్ర’ అనే విధానం ఆధారంగా ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌పై అధ్య‌యనం చేసిన‌ట్టు తెలిపారు. ఒమిక్రాన్ కు భయపడాల్సిన అవసరం లేదని ప్రొ.అగర్వాల్ చెప్పారు. అందరూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే.. సరిపోతుందని అన్నారు. మనిషి శరీరంలో సహజంగా ఉండే రోగ నిరోధకశక్తిని ఒమిక్రాన్ తగ్గించబోదని వెల్ల‌డించారు. 

Read Also: https://telugu.asianetnews.com/national/6822-fresh-covid-cases-in-india-r3qdj9
 
భార‌త్ లో క‌రోనా థర్డ్ వేవ్ ఖ‌చ్చితంగా వ‌స్తోంద‌నీ, ఒమిక్రాన్‌కు సంక్రమణ సామర్థ్యం ఎక్కువేన‌ని తెలిపారు.  అయినా ఆ వైర‌స్ వ్యాప్తి చెందినా.. స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఒమిక్రాన్ సోకినా క్లిష్టమైన సమస్యలు రావ‌ని తెలిపారు.దేశంలో కేసుల సంఖ్య ఫీక్స్ వెళ్లిన‌ప్ప‌టికీ.. ఒమిక్రాన్ ప్రభావంతో  ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య త‌క్కువ‌గానే ఉండ‌వ‌చ్చున‌ని చెప్పుకొచ్చారు. కేంద్ర,రాష్ట్ర ప్ర‌భుత్వాలు  తీసుకునే చర్యలపైనే.. ఈ వేరియంట్ ప్ర‌భావం ఉంటుంద‌ని.. నియ‌మ‌నిబంధ‌న‌ల‌ను స‌క్ర‌మంగా పాటిస్తే.. ఈ ముప్పు నుంచి త‌ప్పించుకోవ‌చ్చున‌ని, ఇప్ప‌టికే మన దేశంలో స‌గానికి పైగా జ‌నాభా వ్యాక్సినేష‌న్ చేయించుకున్నార‌నీ, ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని తెలిపారు ప్రొ.అగర్వాల్.  

click me!