కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదికి పైగా రైతులు ఉద్యమం చేస్తున్నారు. ఇటీవలే ఆ చట్టాలను రద్దు చేసినప్పటికీ.. మరికొన్ని డిమాండ్లతో అన్నదాతాలు ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ప్రధాన ఆరు డిమాండ్లపై చర్చకు సిద్ధమన్నసర్కారు.. ముందుగా ఉద్యమాన్ని విరమించుకోవాలని పేర్కొంది. రైతు ఉద్యమాన్ని కొనసాగనుందా? ముగియనుందా? ఎస్‌కేఏం ఏం నిర్ణయం తీసుకోనుంది? అనేదానిపై ఉత్కంఠ నేలకొంది.
కేంద్ర ప్రభుత్వం వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలు తీసుకురావడంతో రైతున్నలు ఉద్యమం ప్రారంభించారు. ఏడాదికి పైగా కొనసాగుతున్నది. దేశవ్యాప్తంగా మహా పంచాయత్‌లను నిర్వహిస్తూ.. ఉద్యమాన్ని ఉధృతంగా ముందుకు తీసుకెళ్లింది. కేంద్రం వెనక్కి తగ్గక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇటీవలే సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటూ.. పార్లమెంట్‌లో బిల్లు పెట్టడం, దానికి ఆమోదించడం, రాష్ట్రపతి చట్టాల రద్దు గెజిట్ నోటిఫికేషన్లు జారీచేయడం జరిగిపోయాయి. అయితే, రైతులు మాత్రం తమ ఉద్యమాన్ని ఆపలేదు. మరో ఆరు ప్రధాన డిమాండ్లతో రైతు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. వాటిలో పంటకు గిట్టుబాటు ధర (ఎంఎస్ఎస్‌పీ) కల్పించే చట్టం, రైతులపై పెట్టిన కేసుల ఎత్తివేత, ఉద్యమంలో మరణించిన రైతు కుటుంబాలకు పరిహారం అందించడం వంటివి ప్రధాన అంశాలుగా ఉన్నాయి. రైతు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలా? లేదా మిరమించుకోవాలా? అనే దానిపై ఇటీవల పలుమార్లు రైతు సంఘాలు సమావేశమైన ఏలాంటి నిర్ణయానికి రాలేదు. బుధవారం జరగనున్న సమావేశంలో రైతు ఉద్యమంపై ఓ నిర్ణయానికి రానున్నట్టు రైతు నాయకుడు రాకేశ్ టికాయత్ పేర్కొన్నారు.
Also Read: హార్న్‌బిల్ ఫెస్టివల్ రద్దు.. AFSPAను రద్దు చేయాలంటూ డిమాండ్
undefined
దేశంలోని 40 పైగా రైతు సంఘాలకు సంయుక్త్ కిసాన్ మోర్చ ప్రాతినిధ్యం వహిస్తున్నది. ఎస్‌కేఎం నేతృత్వంలోనే రైతు ఉద్యమం కొనసాగుతోంది. నవంబర్ 21న రైతు సంఘాలు ఆరు ప్రధానమైన డిమాండ్లతో ప్రధాని మోడీకి లేఖ రాశాయి. అయితే, మంగళవారం నాడు కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాలకు సమగ్ర ప్రతిపాదన పంపింది. దీనిపై కూడా రైతు సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. సుదీర్ఘంగా ఐదు గంటల పాటు సాగిన సమావేశం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది. అయితే, ఇందులో పలు రైతు సంఘాలు ఉద్యమాన్ని ముగించడానికి అనుకూలంగా ఉండగా, భారతీయ కిసాన్ యూనియన్ సహా మరికొన్ని రైతు సంఘాలు MSPపై అధికారికా హామీ లేకుండా ఉద్యమాన్ని ముగించాలనుకోవడం లేదు. ఇక ఎంఎస్‌పీపై చట్టంతో సహా ఇతర అంశాలపై కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత తొలిసారిగా కేంద్రం మంగళవారం నాడు సంయుక్త్ కిసాన్ మోర్చాకు లిఖితపూర్వక ప్రతిపాదనను పంపింది. ఇందులో రైతుల డిమాండ్లన్నింటిని ఆమోదించే ప్రస్తావన ఉండగా, మోర్చా నాయకులు చెప్పిన ప్రతిపాదనను స్వాగతించి మూడు ప్రధాన అభ్యంతరాలతో ప్రభుత్వానికి తిప్పి పంపారు. వారి ఆందోళనలను సానుభూతితో పరిశీలించిన ప్రభుత్వం బుధవారంలోగా సమాధానం చెబుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి ఫ్రంట్ బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు మరోసారి సమావేశం కానుందనీ, అప్పుడే రైతు ఉద్యమం, ప్రభుత్వ ప్రతిపాదనలపై తుది నిర్ణయానికి వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తుంది. ఇదిలావుండగా, తమ ఆందోళనను విరమిస్తున్నట్టు వస్తున్న వార్తలను ఎస్‌కేఎం ఖండించింది. అలాంటి ప్రకటనలు తాము చేయలేదని స్పష్టం చేసింది.
Also Read: భీమా కోరేగావ్ కేసు.. సుప్రీంకోర్టులో సుధా భరద్వాజ్‌కు ఊరట
మంగళవారం మధ్యాహ్నం హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి ప్రతిపాదన వచ్చిందని, అయితే అందులో కొన్ని అంశాలపై స్పష్టత లేదని సంయుక్త్ కిసాన్ మోర్చా సీనియర్ నాయకుడు అశోక్ దావ్లే అన్నారు. ఈ ప్రతిపాదనలు ఇరువురు ఒకే చెప్పేలా లేదని అభిప్రాయాలున్నాయి. దీన్ని మరింత సవరించే అవకాశం ఉంది. ఎంఎస్‌పీపై ఏర్పాటు చేసే కమిటీలో ఎస్‌కేఎంతో పాటు ఇతర రైతు సంఘాలను కూడా చేర్చనున్నట్లు ప్రతిపాదనలో పేర్కొన్నట్లు బల్బీర్ సింగ్ రాజేవాల్ తెలిపారు. గురురునామ్ సింగ్ చదుని మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రైతులపై పెట్టిన వేల కేసులను ఉపసంహరించుకోవడమే అత్యంత ముఖ్యమైన అంశం అని అన్నారు. ఇక ప్రతిపాదనలో ప్రభుత్వం కాలపరిమితిని నిర్ణయించలేదు. ముందు ఆందోళన ఆపాలని, అప్పుడే కేసులు ఉపసంహరించుకుంటామని ప్రభుత్వం చెబుతోంది. దీనిపై మోర్చా నేత శివకుమార్ కక్కా మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్‌లో రైతులపై పోలీసుల కాల్పులు, రైతుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్న నేపథ్యంలో మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లిస్తామని, నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకుంటామని ప్రభుత్వం అసెంబ్లీలో హామీ ఇచ్చిందని తెలిపారు. ఇప్పటి వరకు రైతులపై పెట్టిన కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకోలేదన్నారు. రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని, ఉద్యమానికి మద్దతిస్తున్న అన్ని పార్టీలు ఉద్యమించాలని మోర్చా డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వ హామీలకు నిర్ధిష్ట సమయం ప్రకటించాలని పేర్కొంటున్నాయి. బుధవారం రెండు గంటలకు రైతు సంఘాల సమావేశం జరగనుంది. రైతు ఉద్యమంపై తుది నిర్ణయం, ప్రభుత్వ ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకోనున్నారు.
Also Read: భీమా కోరేగావ్ కేసు.. సుప్రీంకోర్టులో సుధా భరద్వాజ్‌కు ఊరట
Also Read: 47 దేశాలకు వ్యాపించిన ఒమిక్రాన్..