coronavirus : పలు దేశాల్లో కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. భారత్‌లోనూ ఈ రకం కేసులు క్రమంగా అధికమవుతున్నాయి. ఇప్పటికే వీటి సంఖ్య 41కి దాటింది. అయితే, సాధారణ కరోనా వైరస్ కొత్త కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. మంగళవారం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి.
coronavirus : దేశంలో కరోనా వైరస్ కొత్త కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇదే సమయంలో కోవిడ్-19 కొత్త వేరియంట్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే పలు దేశాల్లో ఈ రకం కేసులు నమోదైన కొన్ని రోజుల్లోనే మొత్తం కొత్త కేసులు రోజురోజుకూ రెట్టింపు స్థాయిలో పెరిగిపోతున్నాయి. మంగళవారం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కరోనా వైరస్ కొత్త కేసులు భారీగా తగ్గాయి. ఏకంగా 6 వేల దిగువకు చేరుకున్నాయి. గత 24 గంటల్లో మొత్తం 5,784 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు రోజుతో పోలిస్తే కొత్త కేసుల నమోదులో 21 శాతం మేర తగ్గాయి. ప్రస్తుత కేసులతో కలుపుకుని భారత్ లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,47,03,644కు చేరాయి. ఇదే సమయంలో మొత్తం 7,995 మంది కరోనా వైరస్ నుంచి బయటపడ్డారు. దీంతో కోవిడ్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 3,41,38,763కు చేరింది. యాక్టివ్ కేసులు సైతం భారీగా తగ్గాయి. 90 వేల దిగువకు క్రియాశీల కేసులు చేరుకున్నాయి. ప్రస్తుతం 88,993 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Also Read: Omicron Variant | దేశంలో 41 ఒమిక్రాన్ కేసులు.. ముందస్తు చర్యలు తీసుకోకుంటే విపత్తే..
undefined
అలాగే, గత 24 గంటల్లో కరోనా వైరస్ తో పోరాడుతూ మొత్తం 252 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,75,888 చేరింది. కొత్త మరణాల్లో అత్యధికంగా 203 కేరళలోనే నమోదయ్యాయి. ప్రస్తుతం కరోనా వైరస్ మరణాల రేటు 1.35 శాతంగా ఉంది. రికవరీ రేటు 98.4 శాతానికి చేరింది. కరోనా పాజిటివిటీ వారంతపు రేటు 5.3 శాతంగా ఉంది. దేశంలో కరోనా వైరస్ కేసులు తగ్గుతున్నప్పటికీ.. దక్షిణాఫ్రికాలో గత నెలలో వెలుగుచూసిన కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో ఇప్పటివరకు మొత్తం 41 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మొత్తం ఎనిమిది రాష్ట్రాల్లో ఈ కేసులు వెలుగుచేశాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 20 మందిలో ఈ రకాన్ని గుర్తించారు. రాజస్థాన్(9), గుజరాత్(4), కర్ణాటక(3), డిల్లీ(2), కేరళ(1), ఏపీ(1), ఛండీగఢ్(1)లో ఈ వేరియంట్ బాధితులున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో అప్రమత్తమైన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడి చర్యలను ముమ్మరం చేసింది. దీనిలో భాగంగా కరోనా వ్యాక్సినేషన్, పరీక్షల్లో వేగం పెంచింది.
Also Read: Justice Chandru: అవగాహన లేని మాటలు.. జస్టిస్ చంద్రు వ్యాఖ్యలపై ఏపీ హైకోర్టు ఆగ్రహం
ఇప్పటివరకు దేశంలో మొత్తం 65,66,72,451 కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించినట్టు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) వెల్లడించింది. సోమవారం ఒక్కరోజే 8,55,692 కోవిడ్-19 శాంపిళ్లను పరీక్షించినట్టు తెలిపింది. అలాగే, వ్యాక్సినేషన్ ప్రక్రియను సైతం వేగవంతం చేశారు అధికారులు. ఇప్పటివరకు మొత్తం 139.9 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసులను పంపిణి చేసినట్టు కేంద్రం తెలిపింది. ఇందులో మొదటి డోసు తీసుకున్న వారు 81.7 కోట్ల మంది ఉన్నారు. పూర్తి డోసులు (రెండు డోసులు) తీసుకున్నవారు 52.1 కోట్ల మంది ఉన్నారు.
Also Read: Farooq Abdullah | దేశ విభజనపై ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు !
భారత్‌లో ఇలాంటి పరిస్థితులు ఉండగా, ప్రపంచంలోని పలు దేశాల్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. అన్ని దేశాల్లో కలిపి ఇప్పటివరకు మొత్తం 271,103,247 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. అలాగే, 5,328,593 మంది వైరస్ కారణంగా చనిపోయారు. కరోనా కేసులు, మరణాలు అధికంగా నమోదైన దేశాల జాబితాలో అమెరికా, భారత్, బ్రెజిల్, యూకే, రష్యా, టర్కీ, ఫ్రాన్స్, జర్మనీ, ఇరాన్, అర్జెంటీనా, స్పెయిన్, ఇటలీ, కొలంబియాలు టాప్‌లో ఉన్నాయి. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు అమెరికా, దక్షిణాఫ్రికా, బ్రిటన్‌లలో క్రమంగా పెరుగుతున్నాయి.
Also Read: పార్లమెంట్‌లో CBSE రగడ.. క్షమాపణలకు సోనియా డిమాండ్ !