డ్రెస్ వేసుకునే హక్కు ఉందంటే.. విప్పుకునే హక్కు కూడా ఉంటుందా? హిజాబ్ బ్యాన్‌పై విచారణలో సుప్రీంకోర్టు షాకింగ్

By Mahesh KFirst Published Sep 8, 2022, 6:01 AM IST
Highlights

హిజాబ్ ధరించంపై విధించిన నిషేధాన్ని తొలగించలేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తులను న్యాయవాది ప్రశ్నించారు. వేసుకునే డ్రెస్‌ను ఎంచుకునే హక్కు తమకు ఉందని వాదించారు. దీనిపై సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. డ్రెస్ వేసుకునే హక్కు ఉన్నదనే వాదనలో.. తమకు డ్రెస్ విప్పేసుకునే హక్కు కూడా అంతర్లీనంగా ఉన్నదని వివరించారు.
 

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో హిజాబ్ బ్యాన్ రద్దు గురించిన అంశం పై నిన్న విచారణ జరిగింది. ఈ విచారణలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు షాకింగ్ కామెంట్స్ చేశారు. మీ వాదనను తర్కం లేకుండా వాదించొద్దని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హేమంత్ గుప్తా తెలిపారు. డ్రెస్ వేసుకునే హక్కు గురించి మాట్లాడినప్పుడు వాటిని విప్పేసుకునే హక్కు కూడా అంతర్లీనంగా ఉంటుందని అన్నారు.

దీనికి సమాధానంగా న్యాయవాది దేవ్ దత్ కామత్.. స్కూల్‌లలో ఎక్కడా డ్రెస్‌లు విప్పుకోవడం లేదే? అని ప్రశ్నించారు. న్యాయమూర్తికి, న్యాయవాదికి ఈ విచారణలో ఘాటు వ్యాఖ్యలు చేసుకున్నారు. అన్ని వర్గాలు డ్రెస్ కోడ్‌ను అంగీకరించాయని, ఇక్కడ సమస్య కేవలం ఒక వర్గానికి మాత్రమేనని వివరించారు. ఇతర వర్గాల కమ్యూనిటీ పిల్లలు ప్రత్యేకంగా అలాగ తయారు కారని అన్నారు.

దీనిపై న్యాయవాది కామత్ మాట్లాడుతూ, చాలా మంది విద్యార్థులు రుద్రాక్ష మాలలు లేదా శిలువ గుర్తులు ధరించి స్కూల్‌కు వస్తారని వాదించారు. దీనిపై న్యాయమూర్తి స్పందించాడు. వాటిని లోపల ధరిస్తారని అన్నారు. ఎవరూ ఆ విద్యార్థి చొక్కా పైకి లేపి.. రుద్రాక్ష ధరిస్తున్నాడా? లేదా?అని ఎవరూ చూడరని వివరించారు.

ఒక మత ఆచారంలో భాగంగా మీరు అనుసరించాలనుకున్న అంశాలను పాటించవచ్చు అని న్యాయమూర్తులు హేమంత్ గుప్తా, సుధవాంశు ధూలియా‌ల ధర్మాసనం పేర్కొంది. కానీ, ఆ ఆచారాన్ని స్కూల్‌కు తీసుకెళ్లి.. స్కూల్‌లో పాటించాల్సిన యూనిఫామ్‌ను నిరసిస్తారా? అనే ఇక్కడ అసలు సమస్య అని వివరించారు.

ఆర్టికల్ 25 ప్రకారం, హిజాబ్ ధారణ కచ్చితంగా పాటించాల్సిన ఆచారమా? అని బెంచ్ పేర్కొంది. దీన్ని  రెండు విధాలుగానూ చెప్పుకోవచ్చని న్యాయమూర్తులు వివరించారు. హిజాబ్ ధరించడాన్ని తప్పనిసరిగా అనుకోవచ్చు.. లేదా అవరమైనప్పుడే వేసుకోవచ్చని వారు చెప్పవచ్చని తెలిపారు.

రాజ్యాంగ పీఠికలో లౌకిక దేశం అని ఉన్నదని వారు వివరించారు. కానీ, ఒక ప్రభుత్వ సంస్థలోకి మీరు వచ్చి తాము తమ మత ఆచారాలనే పాటిస్తామని అడగవచ్చా? అనేది ప్రశ్న అని పేర్కొంది. 

జనవరి 1వ తేదీన కర్ణాటకలోని ఉడుపు జిల్లాలో ప్రభుత్వ పీయూ కాలేజీలో ఈ ఘటన చోటుచేసుకుంది.

click me!