భర్త హోటల్‌ కు వాటర్ సప్లయ్ చేసే వ్యక్తితో భార్య అక్రమ సంబంధం.. అడ్డుగా ఉంటున్నాడని ప్రియుడితో కలిసి..

Published : Jul 04, 2023, 02:22 PM IST
భర్త హోటల్‌ కు వాటర్ సప్లయ్ చేసే వ్యక్తితో భార్య అక్రమ సంబంధం.. అడ్డుగా ఉంటున్నాడని ప్రియుడితో కలిసి..

సారాంశం

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి ఓ భార్య తన భర్తను హతమార్చింది. ఈ ఘటన కర్ణాటకలో వెలుగులోకి వచ్చింది. ఈ హత్యలో పాల్గొన్న నలుగురితో పాటు భార్యను కూడా పోలీసులు అరెస్టు చేశారు. 

కర్ణాటకలోని తలఘట్టపుర పోలీసు స్టేషన్ పరిధిలో గత నెల 29వ తేదీన జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో మృతుడి భార్య తో పాటు ఆమె ప్రియుడు, మరో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు తేల్చారు. వివరాలు ఇలా ఉన్నాయి.

2022 లోనే మహా ప్రభుత్వంలో చేరే అవకాశాలను చూడాలని శరద్ పవార్ ను ఎమ్మెల్యేలు కోరారు - ప్రఫుల్ పటేల్

కర్ణాటకలోని రామనగర జిల్లా ఆర్‌ఆర్‌నగర ఉత్తరహళ్లి ప్రాంతంలో 34 ఏళ్ల అరుణ్ కుమార్ ఓ హెటల్ నడిపిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు కొన్ని సంవత్సరాల కిందట రంజిత అనే మహిళతో వివాహం జరిగింది. అయితే ఆయన నడిపించే హోటల్ కు రెగ్యులర్ గా గణేష్ అనే వ్యక్తి వాటర్ సప్లయ్ చేస్తుండేవాడు. అతడితో రంజితకు పరిచయం ఏర్పడింది. కొంత కాలం తరువాత ఆ పరిచయం వారిద్ధరి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది.

గత ఆరేళ్లలో యూపీలో క్రైమ్ ను తొక్కిపెట్టాం.. నేర, అల్లర్ల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాం - యోగి ఆదిత్యనాథ్

అయితే వీరి మధ్య కొనసాగుతున్న వివాహేతర సంబంధం కొన్నాళ్ల తరువాత అరుణ్ కుమార్ కు తెలిసింది. దీంతో ఆయన భార్యను మందలించాడు. ఇలా చేయడం తప్పు అని, సరైంది కాదని అన్నాడు. కానీ ఆమె ఆ మాటలను వినిపించుకోలేదు. భర్త ఇలాగే అడ్డుపడితే వివాహేతర సంబంధం కొనసాగదని ఆమె భావించింది. దీంతో అరుణ్ కుమార్ ను హతమార్చాలని తన ప్రియుడితో కలిసి ప్లాన్ తయారు చేసింది. 

2024పై కాదు.. 2047పై దృష్టి పెట్టండి - మంత్రులకు ప్రధాని నరేంద్ర మోడీ సూచన

అందులో భాగంగానే జూన్ 28వ తేదీన దావత్ చేసుకుందామని అరుణ్ కుమార్ గణేష్ ఆహ్వానించారు. అతడి వెంటనే స్నేహితులు శివానంద, దీపు, శరత్‌లు కూడా ఉన్నారు. వారి మాటలు నమ్మి అరుణ్ కుమార్ అక్కడికి వెళ్లాడు. అప్పటికే కాపుకాచి ఉన్న ఈ నలుగురు.. అతడి కళ్లపై కారంపొడి చల్లారు. దీంతో బాధితుడు ఎక్కడికి పారిపోకుండా వారికి అవకాశం దొరికింది. అనంతరం అతడిని దారుణంగా హతమార్చారు.

శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ కు నిప్పుపెట్టిన ఖలిస్థాన్ మద్దతుదారులు.. తీవ్రంగా ఖండించిన అమెరికా

తెల్లారి అరుణ్ కుమార్ డెడ్ బాడీ పోలీసులకు కనిపించింది. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం అని గుర్తించి, తలఘట్టపుర పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. పోలీసుల విచారణలో భార్య మొబైల్ ను పరిశీలించారు. అయితే ఫోన్ కాల్ డేటాను ఆధారం చేసుకొని విచారణ చేపట్టిన పోలీసులకు అసలు నిజం తెలిసింది. దీంతో ఆ ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం రిమాండ్ కు తీసుకెళ్లారు. 
 

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం