2022 లోనే మహా ప్రభుత్వంలో చేరే అవకాశాలను చూడాలని శరద్ పవార్ ను ఎమ్మెల్యేలు కోరారు - ప్రఫుల్ పటేల్

Published : Jul 04, 2023, 01:11 PM IST
2022 లోనే మహా ప్రభుత్వంలో చేరే అవకాశాలను చూడాలని శరద్ పవార్ ను ఎమ్మెల్యేలు కోరారు - ప్రఫుల్ పటేల్

సారాంశం

2022లోనే మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరే అవకాశాన్ని పరిశీలించాలని 51 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు శరద్ పవార్ ను కోరారని ఆ పార్టీ నేత, రాజ్యసభ్య ఎంపీ ప్రఫుల్ పటేల్ అన్నారు. గత ఏడాది బీజేపీ కూటమిలో చేరడంపై అంతర్గత చర్చలు జరిగాయని ఆయన గుర్తు చేశారు. 

గత ఏడాది మహారాష్ట్రలో ఎంవీఏ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత బీజేపీతో చేతులు కలిపే అవకాశాలను పరిశీలించాలని 53 మంది పార్టీ ఎమ్మెల్యేల్లో 51 మంది ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కు సూచించారని ఆ పార్టీ రెబల్ నేత, రాజ్యసభ సభ్యుడు ప్రఫుల్ పటేల్ అన్నారు. ప్రస్తుతం అజిత్ పవార్ వర్గంలో ఉన్న ఆయన.. మరాఠీ న్యూస్ ఛానెల్ ‘జీ 24 టాస్’ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్సీపీ శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు, బీజేపీతో ఎందుకు ఏర్పాటు చేయకూదని ఆయన ప్రశ్నించారు.

గత ఆరేళ్లలో యూపీలో క్రైమ్ ను తొక్కిపెట్టాం.. నేర, అల్లర్ల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాం - యోగి ఆదిత్యనాథ్

గత ఏడాది బీజేపీ కూటమిలో చేరడంపై అంతర్గత చర్చలు జరిగాయని పటేల్ చెప్పారు. ఎమ్మెల్యేల మధ్య చర్చ జరిగిందని అన్నారు. దీనిపై చర్చలు జరిగినా ఓ నిర్ణయానికి రాలేదని తెలిపారు. ‘‘ దానికి ఇప్పుడు ఒక రూపం ఇచ్చారు. ఈ నిర్ణయం ఒక పార్టీగా తీసుకున్నారు. నేను లేదా అజిత్ పవార్ వ్యక్తిగతంగా తీసుకోలేదు’’ అని ఆయన అన్నారు. శరద్ పవార్ ప్రభుత్వంలో చేరే అవకాశాలను పరిశీలించాలని కోరిన 51 మంది ఎమ్మెల్యేలలో జయంత్ పాటిల్ కూడా ఉన్నారని ప్రఫుల్ పటేల్ గుర్తు చేశారు. కేవలం అనిత్ దేశ్ ముఖ్, నవాబ్ మాలిక్ మాత్రమే హాజరుకాలేదని తెలిపారు.

పార్టీ అధికారానికి దూరంగా ఉండకూడదని ఎన్సీపీ మంత్రులు శరద్ పవార్ కు లేఖ రాశారని, అందులో ప్రభుత్వంలో చేరే అవకాశాలను అన్వేషించడంలో ఎలాంటి నష్టమూ లేదని పేర్కొన్నారని తెలిపారు. అయితే ప్రభుత్వంలో చేరడానికి ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించగా.. దీనిపై తాము ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని, కానీ వారికి తాము అవసరం లేదని అవతలి పక్షం భావించి ఉండొచ్చని పటేల్ సమాధానం ఇచ్చారు.

2024పై కాదు.. 2047పై దృష్టి పెట్టండి - మంత్రులకు ప్రధాని నరేంద్ర మోడీ సూచన

తాను శరద్ పవార్ కు చాలా సన్నిహితుడినని, అయినప్పటికీ ఆయన పార్టీ చీఫ్ పదవికి (కొన్ని నెలల క్రితం) రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న విషయం తనకు తెలియదని ప్రఫుల్ పటేల్ అన్నారు. ‘శరద్ పవార్ నాపై కలత చెందుతారని నేను అనుకోవడం లేదు. నాపై ఆయనకు ఎలాంటి భావాలున్నా ఎదుర్కొంటాను’ అని అన్నారు. అధికార కూటమిలో చేరిన అజిత్ పవార్ తో పాటు మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ జయంత్ పాటిల్ అసెంబ్లీ స్పీకర్ కు పిటిషన్ దాఖలు చేయడంపై ప్రశ్నించగా.. జయంత్ పాటిల్ ను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకోలేదని, ఆయన తీసుకునే నిర్ణయాలకు ప్రధాన్యత లేదని అన్నారు.

కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఘటన (వీడియో)

శరద్ పవార్ తనను పార్టీ నుంచి తొలగించడంపై పటేల్ మాట్లాడుతూ.. ఎన్సీపీ చీఫ్ చర్యపై తాను వ్యాఖ్యానించదలచుకోలేదన్నారు. కేంద్ర క్యాబినెట్ లో భాగం అవుతారా అని అడిగిన ప్రశ్నకు ప్రస్తుతానికి ఏమీ నిర్ణయించలేదని స్పష్టం చేశారు. తాము ఇప్పుడు వారితోనే ఉన్నామని, బహుశా తరువాత కావొచ్చని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం