
జైపూర్‌లోని చంద్వాజీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ భార్య తన ప్రియుడు, నర్సుతో కలిసి భర్తను చంపేందుకు కుట్ర పన్నింది. ఆసుపత్రి సిబ్బంది అప్రమత్తతతో ఆ ప్లాన్ బెడిసికొట్టి, ముగ్గురినీ అరెస్ట్ చేశారు.
అనారోగ్యం కారణంతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భర్తను చూసేందుకు భార్య తరచూ వచ్చేది. ఈ క్రమంలోనే ఆమె తన ప్రియుడు, నర్సు సహాయంతో భర్తకు ఇంజెక్షన్ ద్వారా ఓవర్‌డోస్ ఇచ్చేందుకు ప్లాన్ చేసింది. మంగళవారం అర్ధరాత్రి 3 గంటలకు ముగ్గురూ కలిసి భర్తకు ఇంజెక్షన్ ఇస్తుండగా ఆసుపత్రి సిబ్బందికి అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి ముగ్గురినీ పట్టుకున్నారు.
ప్రాథమిక విచారణలో భార్యకు భర్తతో గొడవలు ఉన్నాయని, చాలా కాలంగా ప్రియుడితో కలిసి భర్తను చంపాలని ప్లాన్ చేస్తున్నట్లు తేలిందని చంద్వాజీ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి హీరాలాల్ సైనీ తెలిపారు. నర్సు కూడా ఈ కుట్రలో భాగస్వామి. ముగ్గురినీ అరెస్ట్ చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆసుపత్రి సిబ్బంది అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది.