న్యూ ఇయర్‌ను మన దేశం కంటే ముందుగా ఆహ్వానించేవి.. ఆ తర్వాత వెల్‌కమ్ చెప్పేవి ఇవే..!

By Mahesh KFirst Published Dec 31, 2021, 8:02 PM IST
Highlights

కొత్త సంవత్సరం ఒక్కో దేశంలో ఒక్కో సమయానికి ప్రవేశిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్‌కు వెల్‌కమ్ చెబుతున్నా.. ఒక్కో దేశంలో ఒక్కో సమయానికి వేడుకలు జరుగుతాయి. మన దేశం కంటే ముందుగానే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, జపాన్ వంటి దేశాల్లో కొత్త సంవత్సరం ప్రవేశిస్తుంది. మన తర్వాత కూడా చాలా దేశాలు నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటాయి.
 

న్యూఢిల్లీ: కొత్త సంవత్సరం(New Year) అంటే.. కొత్త ఆశలు, కొత్త ఆశయాలు, కొత్త తీర్మానాలు. గడిచిన ఏడాదిలో బాధలు, గాధలు, విజయాలు, అపజయాలను తలుచుకుంటూ సరికొత్త ఉత్తేజంతో.. ఉత్సాహంతో కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తుంటాం. గడిచిన ఏడాదిలో సాధించిన విజయాలకు మించిన టార్గెట్లను నిర్దేశించుకుంటాం. కొత్త శిఖరాలన లక్ష్యాలుగా ఎంచుకుంటాం. ఒక పాజిటివ్ వ్యూ తో న్యూ ఇయర్‌కు వెల్‌కమ్(Wel Come) చెబుతాం. మనల్ని మనం మళ్లీ రిఫ్రెష్ చేసుకోవడానికి ఒక వేదికగా నూతన సంవత్సర ఆరంభాన్ని భావిస్తుంటాం. ప్రపంచ వ్యాప్తంగా ఈ న్యూ ఇయర్ కోసం ఎదురుచూసి ఘనంగా వేడుకలు చేసుకుంటుంటారు. ఒమిక్రాన్ కారణంగా పలు దేశాల్లో ఆంక్షలు అమలు అవుతున్నా.. ఈ వేరియంట్ తీవ్రత తక్కువగానే ఉన్నదని పేర్కొంటూ ఇంకొన్ని దేశాలు కొత్త సంవత్సర సంబురాల(Celebrations)పై ఆంక్షలు(Curbs) విధించలేవు. ప్రపంచ దేశాలు ఈ న్యూ ఇయర్‌ను సెలబ్రేట్ చేసుకుంటాయి. కానీ, అన్నీ ఒకే సమయంలో కొత్త ఏడాదిని ఆహ్వానించవు. ఒక్కో దేశం ఒక్కో సమయంలో కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతాయి. మన దేశానికంటే ముందే.. మన దేశం తర్వాత కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించే దేశాలను చూద్దాం..

ప్రపంచంలో కొత్త సంవత్సరాన్ని ఫస్ట్ ఆహ్వానించే ప్రదేశం ఓషియానియా. పసిఫిక్ దీవులు టోంగా, సమోవా, కిరిబాటి దేశాలు మొదటగా నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తాయి. ఇక్కడ కొత్త సంవత్సరం అంటే.. అన్ని దేశాల కంటే ముందుగా వస్తుంది. భారత కాలమానం ప్రకారం, డిసెంబర్ 31వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకే ఆ దేశాల్లో కొత్త సంవత్సరం వస్తుంది. కాగా, చివరగా అమెరికా సంయుక్త రాష్ట్రాల సమీపంలోని దీవుల్లో కొత్త సంవత్సరం ప్రవేశిస్తుంది. భారత కాలమానం ప్రకారం, జనవరి 1వ తేదీన సాయంత్రం 5.30 గంటలకు యూఎస్ సమీపంలోని హౌలాండ్, బేకర్ దీవుల్లో కొత్త సంవత్సరం వస్తుంది. 

Also Read: New year 2022: హైదరాబాద్‌లో మొదలైన ఆంక్షలు.. ఫ్లైఓవర్లు మూసివేత, డ్రంకెన్ డ్రైవ్‌లు

మనకంటే ముందుగా ఈ దేశాల్లో న్యూ ఇయర్:
మన దేశం కంటే ముందుగా చాలా దేశాల్లో కొత్త సంవత్సరం ప్రవేశిస్తుంది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణ కొరియా, ఉత్తర కొరియా, చైనా, బంగ్లాదేశ్, నేపాల్‌లలో మన దేశం కంటే ముందుగానే న్యూ ఇయర్ ప్రవేశిస్తుంది. భారత కాలమానం ప్రకారం చెబితే.. డిసెంబర్ 31వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకే  న్యూజిలాండ్‌లో, సాయంత్రం 6.30 గంటలకే ఆస్ట్రేలియాలో, రాత్రి 8.30 గంటల ప్రాంతంలో జపాన్, దక్షిణ కొరియా, ఉత్తర కొరియాల్లో కొత్త సంవత్సరం వచ్చేస్తుంది. అంటే.. మన దేశంలో మధ్యాహ్నం 3.30 గంటల సమయానికి.. న్యూజిలాండ్‌లో అర్ధరాత్రి దాటుతుందని అర్థం.

Also Read: న్యూ ఇయర్ జనవరి 1నే ఎందుకు జరుపుకుంటారు, దీని చరిత్ర ఏమిటో తెలుసా..?

మన తర్వాత ఇక్కడ న్యూ ఇయర్:
మన దేశం తర్వాత కూడా చాలా దేశాల్లో కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుంటారు. అంటే.. ఆయా దేశాల కాలమానాలు మన కంటే వెనుక ఉంటాయి గనుక ఆ దేశాల్లో కొత్త సంవత్సరం లేట్‌గా ప్రవేశిస్తుంది. బ్రెజిల్, చిలీ, పరాగ్వే, అర్జెంటినాలు మన తర్వాతే న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటాయి. కాగా, ఒక్క అమెరికాలోనే గంటల వ్యత్యాసంతో కొత్త సంవత్సర వేడుకలు జరుగుతాయి. విస్తీర్ణంలోనూ విశాలంగా ఉండటంతో యూఎస్‌లో రోజులో గంటలు భిన్న సమయాల్లో గడుస్తుంటాయి. భారత కాలమానం ప్రకారం, జనవరి 1వ తేదీ ఉదయం 7.30 గంటలకు బ్రెజిల్‌లో, ఉదయం 8.30 గంటల ప్రాంతంలో అర్జెంటినా, చిలీ, పరాగ్వే, బ్రెజిల్‌లోని కొన్ని ప్రాంతాల్లో కొత్త సంవత్సరం వస్తుంది. కాగా, ఉదయం 10.30 గంటలకు అమెరికాలోని న్యూయార్క్, వాషింగ్టన్, డెట్రాయిట్‌లలో న్యూ ఇయర్ ప్రవేశించగా, ఉదయం 11.30 గంటలకు చికాగోలో, మధ్యాహ్నం 12.30 గంటలకు కొలరాడో, అరిజోనాలో, మధ్యాహ్నం 1.30 గంటలకు నెవాడాలో, మధ్యాహ్నం 2.30 గంటలకు అలస్కాలో, మధ్యాహ్నం 3.30 గంటలకు హవాయ్‌లో న్యూ ఇయర్ వేడుకలు జరుగుతాయి.

click me!