ముంబైలో కోవిడ్ -19 ఆంక్షలు: జనవరి 15 వరకు పొడ‌గించిన ప్ర‌భుత్వం

Published : Dec 31, 2021, 04:37 PM ISTUpdated : Dec 31, 2021, 04:39 PM IST
ముంబైలో కోవిడ్ -19 ఆంక్షలు: జనవరి 15 వరకు పొడ‌గించిన ప్ర‌భుత్వం

సారాంశం

మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం విధించిన ఆంక్షలను మరింత పొడిగించింది. జనవరి 15వ తేదీ వరకు ముంబై పట్టణంలో 144 సెక్షన్ విధిస్తున్నట్టు ప్రకటించింది. గతంలో జనవరి 7వ తేదీ వరకే ఆంక్షలు అమలు చేస్తామని ప్రభుత్వం పేర్కొంది.   

దేశవ్యాప్తంగా కోవిడ్ -19 కేసులు పెరుగుతున్నాయి. అలాగే కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు కూడా అధికంగా న‌మోద‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో అన్ని రాష్ట్రాలు అలెర్ట్ అవుతున్నాయి. కొత్త కేసులు పెరుగుతుండ‌టంతో ఇప్ప‌టికే ఢిల్లీ, క‌ర్నాట‌క ప్ర‌భుత్వాలు క్రిస్మ‌స్ వేడుక‌ల‌ను నిర్వ‌హించుకోనివ్వ‌లేదు. అలాగే న్యూయ‌ర్ వేడుక‌ల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించాయి. అయితే ఇప్ప‌టికే పలు రాష్ట్రాలు మినీ లాక్ డౌన్ లాంటి ఆంక్ష‌లు విధిస్తున్నాయి. అంటే నైట్ క‌ర్ఫ్యూ, 144 సెక్ష‌న్ వంటి ఆంక్ష‌లు అమ‌లు చేస్తున్నాయి. ఈ ఆంక్షలు జనవరి 31వ తేది వ‌ర‌కు మాత్ర‌మే అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించాయి. అయితే కేసులు విపరీతంగా పెరుగుతుండ‌టంతో ఆ ఆంక్ష‌ల‌ను పొడ‌గిస్తున్నారు. 

వస్త్ర పరిశ్రమకు ఊరట: జీఎస్టీ పన్ను పెంపు అమలు వాయిదా

ముంబైలో రెండో సారి పొడ‌గింపు..
మ‌హారాష్ట్రలో క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ కేసులు కూడా ఈ రాష్ట్రంలో పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ కేసుల్లో మ‌హారాష్ట్ర రెండో స్థానంలో ఉంది. మొద‌టి స్థానంలో ఢిల్లీ ఉంది. అయితే ముంబై ప్రాంతంలో క‌రోనా కేసుల్లో పెరుగుద‌ల క‌నిపించ‌డంతో రెండు రోజుల కింద‌ట మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం ఓ నిర్ణ‌యం తీసుకుంది. అంత‌కు ముందు డిసెంబ‌ర్ 31 వ‌రకే విధించిన 144 సెక్ష‌న్ ఆంక్ష‌ల‌ను 2022 జ‌న‌వరి 7వ తేదీ వ‌ర‌కు పొడ‌గించాయి. అయితే కేసుల పెరుగుద‌ల‌లో వేగం పెరుగుతుండ‌టంతో మ‌ళ్లీ దానిని జ‌న‌వరి 15వ తేదీ వ‌ర‌కు పొడ‌గిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.  ఈ మేర‌కు శుక్ర‌వారం ఉత్త‌ర్వులు జారీ చేసింది.
 
ప్ర‌భుత్వం జారీ చేసిన ఉత్త‌ర్వుల ప్ర‌కారం శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం నుంచి ఈ ఆంక్ష‌లు అమ‌లులోకి వచ్చాయి. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) సెక్షన్ 144 ప్రకారం.. బీచ్‌లు, బహిరంగ ప్ర‌దేశాలు, బీచ్ లు, టూరింగ్ ప్లేస్‌లు, పార్క్ లు, ఇత‌ర ఓపెన్ ప్లేస్ ల‌ను సాయంత్రం 5 నుండి ఉదయం 5 గంటల వరకు సందర్శించకుండా ముంబై పోలీసులు నిషేధం విధించారు.  పెద్ద సమావేశాలు పూర్తిగా నిషేధించారు. కొత్త ఆదేశాల ప్ర‌కారం అంత్యక్రియలు, దహన సంస్కారాలకు 20 మంది మాత్రమే హాజరుకావాలి. ఈ ఉత్త‌ర్వుల‌ను ఉల్లంఘించే వారిపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 188,  అంటువ్యాధి వ్యాధుల చట్టం 1897, పాండమిక్ చట్టం, జాతీయ విపత్తు నిర్వహణ చట్టం 2005లోని నిబంధనల ప్రకారం శిక్షకు  అర్హుల‌వుతార‌ని ప్ర‌భుత్వం తెలిపింది. 

రెండు డోసులు వేసుకున్నా.. ఒమిక్రాన్ సంక్రమణం.. రికవరీ తర్వాత మరణం

కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో..
మ‌హారాష్ట్రలో కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ఇలాంటి క‌ఠినమైన నిర్ణ‌యం తీసుకుంది. గ‌డిచిన 24 గంట‌ల్లో మ‌హారాష్ట్రలో 5,368 కొత్త కరోనావైరస్ కేసులు న‌మోద‌య్యాయి. ఇది ముందు రోజు కంటే 37 శాతం ఎక్కువ. ఒకే రోజులో ఒమిక్రాన్ 198  కేసులో న‌మోద‌య్యాయి. ఇందులో 190 కేసులు ముంబై న‌గ‌రంలోనే ఉన్నాయి. దేశంలో ఉన్న ఒమిక్రాన్ కేసుల్లో 450 మంది ఒమిక్రాన్ బాధితులు ఒక్క మ‌హారాష్ట్రలోనే ఉన్నారు. క‌రోనా కేసులు పెరుగుతుండ‌టంతో  గురువారం మధ్యాహ్నం సీఎం ఉద్ధవ్ ఠాక్రే మాహారాష్ట్ర  కోవిడ్ టాస్క్‌ఫోర్స్‌తో సమావేశమయ్యారు. ఈ స‌మావేశంలో వేగంగా పెరుగుతున్న కోవిడ్ - 19, ఒమిక్రాన్ కేసుల‌పై కీల‌క చ‌ర్చ జ‌రిగింది. ఈ నేప‌థ్యంలో ప‌లు నిర్ణ‌యాలు తీసుకున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Modi speech at the African Parliament:భారత్–ఇథియోపియా సంబంధాల్లో కొత్త అధ్యాయం | Asianet News Telugu
Reliance Jio : అంబానీ మామ న్యూఇయర్ గిప్ట్ ...జియో యూజర్స్ కి రూ.35,100..!