అప్పుడు కమ్యూనిష్టులను గడగడలాడించిన మమత.. ఇప్పుడు మోడీపై గురి..!!

By Siva KodatiFirst Published Feb 4, 2019, 12:11 PM IST
Highlights

ప్రధాని నరేంద్రమోడీ విధానాలను తొలి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్న పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ.. కేంద్రంపై యుద్ధాన్ని ప్రకటించారు. బీజేపీ చేపట్టే ఏ కార్యక్రమానికి అనుమతి ఇవ్వకుండా మోడీతో ఢీ అంటే ఢీ అంటున్నారు.

ప్రధాని నరేంద్రమోడీ విధానాలను తొలి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్న పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ.. కేంద్రంపై యుద్ధాన్ని ప్రకటించారు. బీజేపీ చేపట్టే ఏ కార్యక్రమానికి అనుమతి ఇవ్వకుండా మోడీతో ఢీ అంటే ఢీ అంటున్నారు.

ఈ క్రమంలో శారదా కుంభకోణం కేసులో కోల్‌కతా నగర పోలీస్ కమిషనర్‌ రాజీవ్ కుమార్‌ను విచారించేందుకు సీబీఐ ప్రయత్నించడంతో మమతా అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. సీబీఐ అధికారులను నిర్బంధించడంతో పాటు నడిరోడ్డుపై ధర్నాకు దిగారు.

దేశాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించేంత వరకు తన దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు. దానితో పాటే తాను దీక్షకు కూర్చొన్న చోటే శాసనసభ సమావేశాలు జరుగుతాయంటూ స్పష్టం చేశారు.

దీంతో దేశ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాత్రంతా మెలకువగా ఉండి ఆహారాన్ని సైతం తీసుకోకుండా మమతా ఆమరణ నిరాహారదీక్షకు దిగారు. దీదీకి మద్ధతుగా విపక్ష నేతలు సైతం కోల్‌కతా చేరుకుంటున్నారు.

సరిగ్గా 13 ఏళ్ల క్రితం అప్పటి వామపక్ష ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ఆమె 26 రోజుల పాటు ఆమరణ నిరాహారదీక్షకు దిగడం సంచలనం కలిగించింది. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు మమత దీక్షలో కూర్చొన్నారు. దీంతో ఏం జరుగుతుందోనని యావత్ దేశం బెంగాల్ ‌వైపు ఆసక్తిగా చూస్తున్నారు.

చుక్కెదురు: సీబీఐ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా

మోడీపై మమత పోరు.. నోరుమెదపని కేసీఆర్: రాములమ్మ ఫైర్

కోల్‌కతా సీపీ నివాసంపై సీబీఐ దాడి..అర్థరాత్రి రోడ్డుపై మమత ధర్నా

అమిత్‌షా పర్యటనలో టీడీపీ నిరసన: శ్రేణులకు చంద్రబాబు ఆదేశాలు

దమ్ముంటే రాష్ట్రపతి పాలన పెట్డండి: మోడీకి మమత సవాల్

 

click me!