చుక్కెదురు: సీబీఐ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా

By narsimha lodeFirst Published Feb 4, 2019, 11:27 AM IST
Highlights

బెంగాల్‌లో సీబీఐకు చుక్కెదురు కావడంతో విచారణకు సహకరించేలా  బెంగాల్ సర్కార్‌కు  ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సీబీఐ సోమవారం నాడు సుప్రీంకోర్టులో సోమవారం నాడు పిటిషన్‌ను దాఖలు చేసింది


న్యూఢిల్లీ: బెంగాల్‌లో సీబీఐకు చుక్కెదురు కావడంతో విచారణకు సహకరించేలా  బెంగాల్ సర్కార్‌కు  ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సీబీఐ సోమవారం నాడు సుప్రీంకోర్టులో సోమవారం నాడు పిటిషన్‌ను దాఖలు చేసింది. అయితే ఈ పిటిషన్‌ను త్వరగా విచారించాలని సుప్రీంకోర్టును  సీబీఐ కోరింది. అయితే ఈ పిటిషన్‌ను త్వరగా విచారించాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. 

బెంగాల్‌లో శారదా చిట్‌‌ఫండ్ కేసులో సీబీఐ విచారణకు వచ్చింది. ఆదివారం నాడు  బెంగాల్ సీపీని అరెస్ట్ చేసేందుకు సీబీఐ ప్రయత్నాలు చేసిందని బెంగాల్ సీఎం మమత బెనర్జీ ఆరోపించారు. అంతేకాదు సీబీఐకు బెంగాల్ సర్కార్ సహకరించని విషయం తెలిసిందే.

దీంతో బెంగాల్ సర్కార్‌ను ఈ కేసులో సహకరించాలని కోరుతూ ఆదేశాలు జారీ చేయాలని  సుప్రీంకోర్టులో ఇవాళ సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది.సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టులో ఇవాళ ఈ పిటిషన్‌ను  వేశారు. ఈ కేసును త్వరగా విచారించాలని సీబీఐ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరారు.

ఈ కేసును త్వరగా విచారణ చేయాల్సిన అవసరం ఉందా అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజగన్ గోగోయ్ ప్రశ్నించారు. ఈ కేసు విచారణను మంగళవారం ఉదయానికి వాయిదా వేశారు.

కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ సీఎం మమత బెనర్జీ  ఆదివారం రాత్రి నుండి  కోల్‌కత్తాలో దీక్షను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. 

click me!