ప్రజాస్వామ్య రక్షణకు కలుస్తున్నాం: చంద్రబాబు

By narsimha lodeFirst Published Nov 19, 2018, 6:43 PM IST
Highlights

మోడీ పాలనలో దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోయిందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడుఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు.
 

కోల్‌కతా: మోడీ పాలనలో దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోయిందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడుఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు.

పశ్చిమబెంగాల్  ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సోమవారం నాడు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సమావేశమయ్యారు. ఈ సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.

కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేసినట్టు చంద్రబాబునాయుడు ఆరోపించారు.

బీజేపీయేతర పార్టీలతో ఫ్రంట్ ఏర్పాటు గురించి బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో చర్చించినట్టు ఆయన చెప్పారు. త్వరలోనే ఢిల్లీలో సమావేశమై తమ కార్యాచరణను ప్రకటిస్తామని ఆయన తెలిపారు.

ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకొనేందుకు కలిసి నిర్ణయం తీసుకొంటామన్నారు చంద్రబాబునాయుడు.బీజేపీయేతర పార్టీలతో కలిసి పనిచేస్తున్నట్టు చెప్పారు. నోట్ల రద్దు  నిర్ణయంతో   సామాన్యులు తీవ్రంగా ఇబ్బందులు పడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ఇంతకుముందు కూడ  కర్ణాటకలో మమత బెనర్జీతో  చర్చలు జరిపినట్టుగా ఆయన  ప్రస్తావించారు. తమ మధ్య అన్ని విషయాలపై చర్చించినట్టు చెప్పారు. తొలుత ఈ నెల 22వ తేదీన సమావేశం కావాలని నిర్ణయించామన్నారు. కానీ,  ఎన్నికలు ఉన్నందున  ఈ సమావేశాన్ని పార్లమెంట్ సమావేశాల ముందు నిర్వహించాలని భావిస్తున్నట్టు తెలిపారు.

సంబంధిత వార్తలు

ప్రజాస్వామ్య రక్షణకు కలుస్తున్నాం: చంద్రబాబు

ప్రధాని ఎవరనేది అప్పుడే: దేవేగౌడతో భేటీ తర్వాత బాబు

బీజేపీయేతర ఫ్రంట్: దేవేగౌడ‌, కుమారస్వామిలతో బాబు భేటీ

బాబు ఫ్రంట్‌: ధర్మపోరాట దీక్షకు బీజేపీయేతర పార్టీలు


 

click me!