మహారాష్ట్రలో ఎన్కౌంటర్‌... ఇద్దరు మహిళా మావోయిస్టుల మృతి

By Arun Kumar PFirst Published Nov 19, 2018, 4:08 PM IST
Highlights

మహారాష్ట్రలో మరోసారి అలజడి రేగింది. గడ్చిరోలి జిల్లా పరిధిలో కూబింగ్ నిర్వహిస్తున్న భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఇందులో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతిచెందారు.

మహారాష్ట్రలో మరోసారి అలజడి రేగింది. గడ్చిరోలి జిల్లా పరిధిలో కూబింగ్ నిర్వహిస్తున్న భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఇందులో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతిచెందారు.

మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టుల ప్రాభల్యం అధికంగా ఉంటుంది. అందువల్ల అక్కడి అటవీ ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతా దళాల ఆద్వర్యంలో నక్సల్స్ ఏరివేత ఆపరేషన్స్ జరుగుతుంటాయి. ఇలా ఇవాళ ఉదయం ధనోరా తాలూకాలోని అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా సిబ్బందికి మావోలు తారసపడ్డారు. దీంతో మావోలు, భద్రతా సిబ్బంది మధ్య భీకర ఎన్కౌంటర్ జరిగింది. 

ఈ ఎన్కౌంటర్ లో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతిచెందినట్లు గడ్చిరోలి ఏఎస్పీ మహేంద్ర పండిట్ వెల్లడించారు. మావోల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఎన్కౌంటర్ నుండి తప్పించుకున్న మావోల కోసం గాలిస్తున్నట్లు ఏఎస్పీ తెలిపారు. 

click me!