భక్తులే ఆ మహిళలకు సహకరించారు.. కేరళ సీఎం

By ramya neerukondaFirst Published Jan 3, 2019, 1:56 PM IST
Highlights

శబరిమల అయ్యప్పను దర్శించుకునేందుకు ఆ ఇద్దరు మహిళలకు భక్తులే సహకరించారని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయ్ తెలిపారు

శబరిమల అయ్యప్పను దర్శించుకునేందుకు ఆ ఇద్దరు మహిళలకు భక్తులే సహకరించారని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయ్ తెలిపారు. ఆ ఇద్దరు మహిళలకు భక్తుల నుంచి ఎలాంటి వ్యతిరేకత ఎదురు కాలేదని ఆయన చెప్పారు.

బుధవారం ఉదయం ఇద్దరు మహిళలు అయ్యప్పను దర్శించుకున్న సంగతి తెలిసిందే. అలా మహిళలు అయ్యప్పను దర్శించుకోవడం కేరళలో వివాదంగా మారింది. ఈ రోజు బంద్ కూడా నిర్వహించారు. ఆందోళన కారులు బస్సులు తగలపెట్టడం లాంటివి కూడా చేశారు. దీంతో పలు చోట్ల ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

దీనిపై సీఎం పినరయి విజయన్ తాజాగా స్పందించారు. ‘‘హింసకు వ్యతిరేకంగా ఆ మహిళలు వ్యూహాత్మకంగా, ప్రణాళికాబద్దంగా వ్యవహరించారు. భక్తుల సహకారంతోనే సురక్షితంగా లోపలికి వెళ్లి తిరిగి వచ్చారు. మహిళలకు భద్రత కల్పించడం ప్రభుత్వం బాధ్యత. రాజ్యాంగపరమైన బాధ్యతను ప్రభుత్వం నెరవేర్చింది. శబరిమలను ఘర్షణలు సృష్టించేందుకు సంఘ్ పరివార్ ప్రయత్నిస్తోంది. దీన్ని కఠినంగా అడ్డుకోవడం తప్ప ప్రభుత్వానికి మరో మార్గం లేదు..’’ అని పేర్కొన్నారు. సంఘ్‌పరివార్ సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తోందనీ.. నిజమైన భక్తులెవరూ సుప్రీంకోర్టు ఆదేశాలను వ్యతిరేకించడం లేదని సీఎం అన్నారు.
 
కాగా నిన్న పందాళంలో జరిగిన అల్లర్లలో శబరిమల కర్మ సమితి కార్యకర్త చంద్రన్ ఉన్నతన్ తీవ్రంగా గాయపడ్డాడని ముఖ్యమంత్రి తెలిపారు. ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ... గుండెపోటు కారణంగా ఆయన మృతిచెందాడని వెల్లడించారు. ఆందోళన కారులు ఇప్పటి వరకు 7 పోలీసు వాహనాలు, 79 ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారు. 
 

read more news

శబరిమలలో మహిళల ప్రవేశం: అట్టుడుకుతున్న కేరళ

అయ్యప్ప దర్శనం అనంతరం.. డ్యాన్స్ లు చేసిన మహిళలు

శబరిమలలోకి మహిళలు.. ఆలయం మూసివేత

శబరిమలలోకి ఇద్దరు మహిళల ఆలయ ప్రవేశం (వీడియో)

అయ్యప్పని దర్శించుకున్న మహిళ.. పరారీలో భర్త


శబరిమల వివాదం.. ప్రధాన అర్చకుడికి చుక్కెదురు

click me!