uttarkashi tunnel collapse : ఉత్తరకాశీలో టన్నెల్ కూలిన ఘటనలో చిక్కుకుపోయిన కార్మికులను రక్షించే ప్రక్రియ కొనసాగుతోంది. అయితే వారు టన్నెల్ నుంచి సురక్షితంగా బయటకు రావడానికి ఇంకా కొన్ని రోజులు సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా.. ప్రధాని నరేంద్ర మోడీ నేడు అక్కడికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించనున్నారు.
uttarkashi tunnel collapse : ఉత్తరాఖండ్ లోని ఉత్తర కాశీలో కూలిన సొరంగం కింద చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించే ప్రక్రియ ఇంకా ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. వారు సురక్షితంగా బయటకు రావడానికి ఇంకా కొన్ని రోజులు, వారాలు కూడా పట్టే అవకాశం ఉంది. ఈ నెల 12వ తేదీన ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. అప్పటి నుంచి కార్మికులను రక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ సహాయక చర్యల్లో తరచూ ఆటంకాలు ఎదురవుతున్నాయి.
బిగ్ న్యూస్ : రైతు బంధు పంపిణీకి బ్రేక్.. అనుమతి రద్దు చేసిన ఈసీ...
undefined
ఈ అడ్డంకులను అధిగమిస్తూ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ ను కొనసాగిస్తున్నారు. సొరంగం కూలిన భాగంపై కొండపై ఆదివారం నుంచి వర్టికల్ డ్రిల్లింగ్ పనులు ప్రారంభమయ్యాయి. చివరికి రెస్క్యూ సిబ్బంది దాదాపు 20 మీటర్ల మేర కొండల్లోకి విజయవంతంగా డ్రిల్లింగ్ చేశారు. ఎలాంటి అడ్డంకులు తలెత్తకపోతే గురువారం నాటికి డ్రిల్లింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేస్తామని నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్హెచ్ఐడీసీఎల్) మేనేజింగ్ డైరెక్టర్ మహమూద్ అహ్మద్ ‘ఎన్డీటీవీ’తో తెలిపారు.
వర్టికల్ బోరింగ్ ఆపరేషన్ కొనసాగుతున్న సమయంలో టన్నెల్ లోపల చిక్కుకున్న వారికి సురక్షితమైన మార్గాన్ని సృష్టించడానికి కార్మికులు జాగ్రత్తగా 700-మిమీ వెడల్పు పైపులను చొప్పిస్తారు. అదే సమయంలో 200 ఎంఎం ప్రోబ్ ను కూడా రంగంలోకి దింపుతున్నారు. కాగా.. దాదాపు 60 మీటర్ల శిథిలాలను ఛేదించడానికి అమెరికా నుంచి తెప్పించిన భారీ డ్రిల్ శుక్రవారం దెబ్బతినగా, ప్రస్తుతం బయటకు తీస్తున్నారు. చివరి 10-15 మీటర్లను ఇప్పుడు చేతితో పట్టుకునే ఎలక్రిక్టల్ యంత్రాలతో విచ్ఛిన్నం చేయాల్సి ఉంటుంది. దీనికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది.
కాగా.. ప్రధాని నరేంద్ర మోడీ ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రా నేడు టన్నెల్ వద్దకు చేరుకుని సహాయక చర్యలను సమీక్షించనున్నారు. ఆయన వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుఖ్బీర్ సింగ్ సంధు ఉండనున్నారు. కేంద్రానికి చెందిన కొందరు సీనియర్ అధికారులు కూడా హాజరుకానున్నారు.
Telangana Elections 2023 : తెలంగాణ ఎన్నికలు యమ కాస్ట్లీ గురూ... తాజాగా మరో ఐదు కోట్లు సీజ్
180 మీటర్ల ప్రత్యామ్నాయ ఎస్కేప్ టన్నెల్ ను రెస్క్యూ సిబ్బంది మాన్యువల్ డ్రిల్లింగ్ చేయనున్నారు. ఈ ప్రయత్నం పూర్తి కావడానికి 12-14 రోజులు పట్టవచ్చు. 483 మీటర్లకు గాను 10 మీటర్లు పూర్తయిన ఈ సొరంగం బార్కోట్ ఎండ్ వద్ద డ్రిల్లింగ్ కొనసాగుతోంది. ఈ వ్యూహానికి 40 రోజుల వరకు డ్రిల్లింగ్ అవసరమవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.