Ayushman Arogya Mandir :ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్ల పేరు మార్చిన కేంద్రం.. కొత్త పేరు ఏంటంటే

By Asianet News  |  First Published Nov 27, 2023, 9:38 AM IST

ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్లు (Ayushman Bharat-Health and Wellness Centres) పలు మార్పులకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Union Health Ministry) శ్రీకారం చుట్టుంది. అందులో భాగంగా ఆ సెంటర్ల పేరు మార్చింది. ఇక నుంచి వాటిని 'ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్' (Ayushman Arogya Mandir)గా పిలవాలని రాష్ట్రాలకు కేంద్రం స్పష్టం చేసింది. 


దేశవ్యాప్తంగా ఉన్న ఆయుష్మాన్ భారత్-హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్ల (Ayushman Bharat-Health and Wellness Centres)కు కేంద్ర ప్రభుత్వం పేరు మార్చింది. వాటికి 'ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్' (Ayushman Arogya Mandir)గా నామకరణం చేశారు. ఈ ఏడాది చివరి నాటికి రీబ్రాండింగ్ ప్రక్రియను అమలు చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా లేఖ రాసింది.

Hyderabad Accident : హైదరాబాద్ శివారులో ఆర్టిసి బస్సు బోల్తా... 20 మందికి గాయాలు

Latest Videos

ఆయుష్మాన్ భారత్-హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ (ఏబీ-హెచ్ డబ్ల్యూసీ) పోర్టల్లో రీబ్రాండెడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఫోటోలను అప్లోడ్ చేయాలని మంత్రిత్వ శాఖ రాష్ట్రాలను కోరింది. రీబ్రాండెడ్ సెంటర్లలో నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్ హెచ్ఎం ) లోగోను ఉంచాలని స్పష్టం చేసింది. రీబ్రాండెడ్ ఏబీ-హెచ్ డబ్ల్యూసీలకు 'ఆరోగ్య పరమం ధనం' అనే కొత్త ట్యాగ్ లైన్ కు కూడా ఉండనుంది. 

Rahul Gandhi : ధరణి పేరుతో ప్రజల భూములను లాక్కున్నారు - బీఆర్ఎస్ పై రాహుల్ గాంధీ విమర్శలు..

రెండు రోజుల కిందట రాష్ట్రాలకు రాసిన లేఖలో ‘‘అనారోగ్యం నుండి ఆరోగ్యానికి ఆలోచన, ఆరోగ్య సంరక్షణ పంపిణీని తీసుకెళ్లడంలో ఈ కేంద్రాలు విజయవంతమయ్యాయి. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఆయుష్మాన్ ఇండియా కలను సాకారం చేసేందుకు ఆయుష్మాన్ భారత్-హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్లకు 'ఆరోగ్య పరమం ధనం' అనే ట్యాగ్ లైన్ తో 'ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్'గా నామకరణం చేయాలని నిర్ణయించాం’’ అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. 

రాహుల్ గాంధీకి ఉద్యోగమంటే ఏంటో తెలుసా ? కర్ణాటకలో ఒక్క జాబ్ నోటిఫికేషనైనా ఇచ్చారా ?- మంత్రి కేటీఆర్

ప్రస్తుతం ఉన్న సౌకర్యాలను మార్చడానికి అవసరమైన నిధులను ఒక్కో సౌకర్యానికి రూ.3,000 చొప్పున ప్రతిపాదించారు. రీబ్రాండింగ్ పూర్తయిన తర్వాత రాష్ట్రాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల కొత్త ఫొటోలను కొత్త పేరుతో ఏబీ-హెచ్ డబ్ల్యూసీ పోర్టల్ లో అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆయుష్మాన్ భారత్ యోజన కింద గత ఐదేళ్లలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 1.6 లక్షలకు పైగా ఏబీ- హెచ్ డబ్ల్యూసీలను విజయవంతంగా ఏర్పాటు చేశారు.

click me!