యూపీలో గ్యాంగ్ రేప్: సిట్ ఏర్పాటు, విపక్షాల ఆందోళన

By narsimha lodeFirst Published Sep 30, 2020, 6:48 PM IST
Highlights

 ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని హత్రాస్ లో గ్యాంగ్ రేప్ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నాడు సిట్ ఏర్పాటు చేసింది.
 

లక్నో: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని హత్రాస్ లో గ్యాంగ్ రేప్ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నాడు సిట్ ఏర్పాటు చేసింది.

గ్యాంగ్ రేప్ కు గురైన 19 ఏళ్ల యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం నాడు ఆసుపత్రిలో మరణించింది. ఆసుపత్రి నుండి మృతదేహాన్ని తీసుకొచ్చి అర్ధరాత్రి హడావుడిగా అంత్యక్రియలు నిర్వహించారు.

మృతదేహాన్ని కడసారి చూపకుండానే అంత్యక్రియలు నిర్వహించడంపై బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ బుధవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

బాధితురాలి తండ్రితో సీఎం యోగి మాట్లాడారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన సీఎం ను కోరారు. మరణించిన కుటుంబానికి సహాయం అందించాలని సీఎం ఆదేశించారని యూపీ హొం మంత్రి తెలిపారు.

ఈ విషయమై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ కూడ మాట్లాడారు.హత్రాస్ అత్యాచార బాధితురాలి అంత్యక్రియలు హడావుడిగా చేయడం సాక్ష్యాలను నాశనం చేయడం కోసమేనని  సమాజ్ వాదీ పార్టీ ఆరోపించింది.

also read:హత్రాస్‌లో బాలికపై గ్యాంగ్ రేప్: నిందితులను శిక్షించాలని యోగిని కోరిన మోడీ

బాధితురాలి కుటుంబం సమ్మతి లేకుండా  అంత్యక్రియలు చేయడం సరైంది కాదని మాజీ సీఎం అఖిలేష్ యాదవ్  ఆరోపించారు.  సాక్ష్యాలను నాశనం చేసే ఈ చర్య ఖండించదగిందని అఖిలేష్ యాదవ్ ట్విట్టర్ ద్వారా ఆరోపించారు.

ఈ ఘటనను నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ నేతలు రాజ్ భవవ్ ఎదుట బుధవారం నాడు ధర్నాకు దిగారు.హత్రాస్ గ్యాంగ్ రేప్ నిందితులను శిక్షించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.

click me!