డేరాబాబా: జైలులో ఏం చేస్తున్నాడో తెలుసా?

By narsimha lodeFirst Published Sep 4, 2018, 4:48 PM IST
Highlights

డేరా బాబా ఏడాదిగా జైలు  జీవితానాన్ని అనుభవిస్తున్నాడు.  జైలుల్లో  సాధారణ ఖైదీగానే  జీవనాన్ని గడుపుతున్నాడు. జైల్లో నిర్వహిస్తున్న పనుల్లో భాగంగా డేరా బాబా ప్రతి రోజూ రూ. 40 సంపాదిస్తున్నాడు.

న్యూఢిల్లీ: డేరా బాబా ఏడాదిగా జైలు  జీవితానాన్ని అనుభవిస్తున్నాడు.  జైలుల్లో  సాధారణ ఖైదీగానే  జీవనాన్ని గడుపుతున్నాడు. జైల్లో నిర్వహిస్తున్న పనుల్లో భాగంగా డేరా బాబా ప్రతి రోజూ రూ. 40 సంపాదిస్తున్నాడు.

డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మిత్ రామ్ రహీం సింగ్ బాబా అలియాస్ డేరా బాబా  అత్యాచారం, హింస కేసులో 20 ఏళ్ల పాటు జైలు శిక్షను అనుభవిస్తున్నాడు. ఆశ్రమంలో  సకల సౌకర్యాలను అనుభవించిన డేరా బాబా చివరకు జైల్లో సాధారణ ఖైదీగానే జీవనాన్ని గడుపుతున్నాడు. 

జైల్లో ఉంటున్న ఖైదీలు ఏదో ఒక పని చేయాల్సి ఉంటుంది.  డేరా బాబా  మాత్రం   జైల్లో  కాయగూరలు పండిస్తున్నాడు. కూరగాయలు పండించినందుకు గాను  ప్రతి రోజూ రూ. 40 సంపాదిస్తున్నాడు.   నైపుణ్యం ఉన్న  పనులు తెలియని కారణంగా  డేరా బాబాకు  కూరగాయలు పండించే పనిని అప్పగించారు. 

గత ఏడాది ఆగష్టు మాసంలో డేరా బాబా అరెస్టై జైలులో ఉన్నాడు. పలుమార్లు బెయిల్ కోసం  ఆయన కోర్టును ఆశ్రయించాడు. కానీ, ఆయనకు కోర్టు  బెయిల్ మాత్రం ఇవ్వలేదు.

ఆశ్రమంలో ఉన్న వారిపై  డేరాబాబా అత్యాచారానికి పాల్పడ్డారని  2002 ఏప్రిల్ లో కేసు నమోదైంది.   సీబీఐ ఈ కేసు నమోదు చేసింది.  ఈ కేసుకు సంబంధించి 2007 జూలైలో  సీబీఐ ఛార్జీషీట్ దాఖలు చేసింది. 

2017 ఆగష్టు 25 వ తేదీన పంచకుల కోర్టు  డేరా బాబాకు  20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. డేరా బాబాకు  శిక్షను విధించడంపై  అల్లర్లు చెలరేగాయి. సుమారు 40 మంది మృత్యువాతపడ్డారు. 
 

click me!