భారత్‌ ఏకీకరణ తర్వాత.. ముందు చరిత్ర తెలుసుకోండి : రాహుల్ గాంధీపై అమిత్ షా సెటైర్లు

By Siva KodatiFirst Published Sep 10, 2022, 7:58 PM IST
Highlights

రాహుల్ గాంధీ భారత్‌ను ఏకం చేయడం కంటే ముందు భారదేశ చరిత్రను అధ్యయనం చేయాలని చురకలు వేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఈ దేశం కోసం లక్షలాది మంది ప్రజలు తమ ప్రాణాలను త్యాగం చేశారని ఆయన గుర్తుచేశారు. 

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రను లక్ష్యంగా చేసుకున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా . శనివారం జైపూర్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. భారత్ దేశం కాదని ఒకప్పుడు రాహుల్ అన్నారని, కానీ ఇప్పుడు ఫారిన్‌లో తయారు చేసిన టీ- షర్ట్ ధరించి దేశాన్ని ఏకీకరించడానికి బయల్దేరారంటూ ఎద్దేవా చేశారు. రాజస్థాన్‌ బీజేపీ బూత్ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తే ఉదయ్‌పూర్ టైలర్ కన్హయ్య లాల్‌ను ముస్లిం తీవ్రవాదులు హత్య చేయడం , కరౌలీ హింసలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంపై అమిత్ షా విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ఓటు బ్యాంక, బుజ్జగింపు రాజకీయాలను మాత్రమే చేయగలదని ఆయన ఆరోపించారు. 

పార్లమెంట్‌లో చేసిన ప్రసంగాన్ని రాహుల్ బాబా, ఇతర కాంగ్రెస్ సభ్యులకు తాను గుర్తు చేయాలని అనుకుంటున్నాని అమిత్ షా స్పష్టం చేశారు. రాహుల్ బాబా అప్పుడు భారతదేశం ఒక దేశం కాదన్నారని.. ఆయన ఏ పుస్తకంలో చదివారు.? ఈ దేశం కోసం లక్షలాది మంది ప్రజలు తమ ప్రాణాలను త్యాగం చేశారని అమిత్ షా గుర్తుచేశారు. భారతదేశం ఒక దేశమే కాదన్న వ్యక్తి ఇప్పుడు మాత్రం విదేశీ టీ- షర్ట్ ధరించి భారతదేశాన్ని ఏకం చేసే యాత్రలో వున్నాడని హోంమంత్రి దుయ్యబట్టారు. అంతేకాదు.. ఆ టీషర్ట్ ధర రూ.41,000 వేలంటూ అమిత్ షా ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ భారతదేశాన్ని ఏకీకరణ చేయడానికంటే ముందు అతను భారతదేశ చరిత్రను అధ్యయనం చేయాల్సిన అవసరం వుందని అమిత్ షా అన్నారు. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కాంగ్రెస్‌కు ఏమీ మిగలదని ఆయన జోస్యం చెప్పారు. 

ALso Read:భార‌త్ జోడో యాత్రలో మ‌రో వివాదం.. పాస్ట‌ర్ల‌లో రాహుల్ భేటీ.. వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

ఇకపోతే.. రాబోయే ఎన్నిక‌ల వ‌ర‌కు పార్టీని బ‌లోపేతం చేయాల‌ని,  ప్ర‌జ‌ల‌తో తాను మ‌మేకం కావాల‌నే ఉద్దేశ్యంతో కాంగ్రెస్ పార్టీ నేత, పార్టీ మాజీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ భార‌త్ జోడో యాత్ర‌ను చేప‌డుతున్న విష‌యం తెలిసిందే. ఈ పాద‌యాత్ర క‌న్యాకుమారి నుంచి కాశ్మీర్ వ‌ర‌కూ సాగుతుంది. ప్ర‌స్తుతం ఆ యాత్ర త‌మిళ‌నాడులో కొన‌సాగుతోంది. అయితే.. ఈ యాత్ర‌లో కొత్త వివాదం రాజుకుంది. ఈ పర్యటనలో భాగంగా రాహుల్ శుక్రవారం కొందరు క్యాథలిక్ మతగురువులతో సమావేశమయ్యారు. ఈ పూజారుల్లో వివాదాస్పద పాస్టర్ జార్జ్ పొన్నయ్య కూడా ఉన్నారు. ఈ సమావేశానికి సంబంధించిన ఓ వీడియో క్లిప్ వైరల్ అవుతోంది. అందులో ఆ పాస్ట‌ర్ చేసిన వ్యాఖ్యలు రాజ‌కీయంగా దూమారం రేపుతున్నాయి. 

ఇంత‌కీ ఈ వీడియోలో ఏముందంటే..? 
 
ఈ వీడియోలో రాహుల్ గాంధీ ఓ పాస్ట‌ర్ ను  'జీసెస్ క్రైట్ (యేసు క్రీస్తు) దేవుని స్వరూపమా? ఇది నిజమా? అని అడిగారు. ఆ ప్ర‌శ్న‌కు పాస్ట‌ర్ పొన్నయ్య స్పందిస్తూ, 'అవును జీసెస్ నిజమైన దేవుడనీ, శక్తి (హిందూ దేవత) లాగా కాదనీ అన్నారు. జీసెస్ ఓ మ‌నిషిలా అవ‌త‌రిస్తాడ‌ని, నిజ‌మైన వ్య‌క్తిలా ద‌ర్శ‌న‌మిస్తాడ‌ని, కానీ, శ‌క్తి దేవ‌తాలా కాదని అన్నారు.  ప్ర‌స్తుతం రాహుల్ ప్రశ్నకు,  పాస్ట‌ర్ ప్రకటనపై రాజకీయ దుమారం చెలరేగింది. ఈ వీడియో క్లిప్ పై బీజేపీ స్పందిస్తూ.. ఇది బార‌త్ జోడో యాత్ర కాద‌నీ,  'భారత్ తోడో యాత్ర' అని  అభివర్ణించింది. యాత్రతో విసిగిపోయిన బిజెపి చేస్తున్న దుర్మార్గమని కాంగ్రెస్ పేర్కొంది. 

click me!