Visa Free: భారతీయులకు మలేషియా ఆఫర్.. వీసా లేకున్నా ఆ దేశంలోకి అనుమతి.. ఎప్పటి నుంచి అంటే?

By Mahesh K  |  First Published Nov 26, 2023, 9:28 PM IST

భారతీయులకు, చైనీయులకు మలేషియా కీలక సదుపాయాన్ని కల్పించనుంది. ఈ రెండు దేశాల పౌరులకు వీసా లేకున్నా దేశంలోకి అనుమతించాలని నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 1వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది.
 


మలేషియా కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయులకు, చైనా వాసులకు మంచి ఆఫర్ ప్రకటించింది. ఈ రెండు దేశాల పౌరులకు వీసా లేకున్నా దేశంలోకి అనుమతించే నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 1వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమలవుతుందని ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం పేర్కొన్నారు.

భారతీయులు, చైనీయులు 30 రోజుల వరకు ఎలాంటి వీసా లేకుండా మలేషియాలో ఉండొచ్చని అన్వర్ ఆదివారం ఓ ప్రసంగంలో తెలిపారు. సెక్యూరిటీ, స్క్రీనింగ్ సంబంధ అంశాలు ఉంటాయని వివరించారు. 

Latest Videos

తమ దేశంలోకి పర్యాటకుల సంఖ్యను పెంచుకోవాలని మలేషియా భావిస్తున్నది. ఇది ఆ దేశ ఆర్థిక ప్రగతికి ఉపకరిస్తుందని ఆలోచిస్తున్నది. విదేశీ టూరిస్టులు, పెట్టుబడిదారులను ప్రోత్సహించడానికి వారి వీసా సంబంధ ప్రక్రియను సరళతరం చేయాలని ఆలోచిస్తున్నట్టు గత నెల అన్వర్ తెలిపారు. ముఖ్యంగా భారత్, చైనాల నుంచి వచ్చే వారికి ఈ సౌకర్యం కల్పించనున్నట్టు వివరించారు.

Also Read: Kambala: జల్లికట్టు, కంబళను కాపాడుకుంటేనే సనాతన ధర్మం నిలుస్తుంది: బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య

మలేషియా సహా ఆరు దేశాల పౌరులకు వీసా లేకుండా అనుమతులు ఇస్తామని చైనా శుక్రవారం ప్రకటించింది. డిసెంబర్ 1వ తేదీ నుంచి వచ్చే ఏడాది నవంబర్ 30వ తేదీ వరకు ఈ నిర్ణయం అమలులో ఉంటుందని పేర్కొంది. ఈ దేశాల పౌరులు 15 రోజులపాటు ఎలాంటి వీసా లేకుండా చైనాలో ఉండొచ్చని వివరించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా మలేషియా కూడా వీసా లేకుండా ఉభయ దేశాల పర్యాటకులకు అనుమతిస్తున్నట్టు వెల్లడించింది.

click me!