చైనాను అధిగమించిన భారత్.. ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా రికార్డు.. ప్రస్తుతం మన దేశ జనాభా ఎంతో తెలుసా..?

Published : Apr 19, 2023, 04:13 PM IST
చైనాను అధిగమించిన భారత్.. ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా రికార్డు.. ప్రస్తుతం మన దేశ జనాభా ఎంతో తెలుసా..?

సారాంశం

జనాభా విషయంలో చైనాను భారత్ అధిగమించింది. ఐక్యరాజ్యసమితి (UNFPA) గణాంకాల ప్రకారం.. భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఆవిర్భవించింది.  ఇప్పుడు భారతదేశంలో చైనా కంటే రెండు మిలియన్ల మంది ఎక్కువ ఉన్నారు. భారతదేశ జనాభా 140 కోట్లు దాటింది. అదే సమయంలో చైనాలో జననాల రేటు తగ్గింది.  

India Population: డ్రాగన్ కంట్రీ చైనాను భారత్ వెనకకు నెట్టి వేసింది. జనాభా విషయంలో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్‌ అవతరించింది. చైనా(China) జనాభా 142.57 కోట్లు కాగా, భారత దేశ జనాభా 142.86 కోట్లు అని ఐక్యరాజ్యసమితి జనాభా నిధి (UNFPA) వెల్లడించింది. UNFPA తన నివేదికను 'ది స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్ 2023', '8 బిలియన్ లైవ్స్, ఇన్ఫినిట్ పాసిబిలిటీస్: ది కేస్ ఫర్ రైట్స్ అండ్ ఛాయిస్' శీర్షికతో నివేదిక విడుదల చేసింది.

ఈ నివేదిక ప్రకారం.. భారతదేశ జనాభా 1,428.6 మిలియన్లు (142.86 కోట్లు) కాగా, చైనా జనాభా 1,425.7 మిలియన్లు (142.57 కోట్లు). ఇరు దేశాల మధ్య దాదాపు 29 లక్షల జనాభా తేడా ఉంది. 2022లోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్‌ అవతరిస్తుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. 

'యువ' భారతం 

ప్రపంచంలోనే అత్యధిక యువత జనాభా కూడా భారత్‌లోనే ఉంది. UNFPA నివేదిక ప్రకారం.. భారతదేశ జనాభాలో

>> 0-14 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు 25% మంది.  

>> 10-19 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు 18% మంది

>> 10-24 సంవత్సరాల వయస్సు గలవారు 26% మంది

>> 15-64 సంవత్సరాల వయస్సు గల వారు 68% మంది 

>> 65 ఏళ్లు పైబడిన వ్యక్తులు 7% మంది ఉన్నట్టు నివేదికల సమాచారం. 

అయితే.. ఆయుర్దాయం పరంగా భారతదేశం కంటే చైనా మెరుగ్గా ఉంది. ఇక్కడ ఆడవారికి 82 ఏండ్ల కాగా.. పురుషుల ఆయుర్దాయం 76 సంవత్సరాలు. భారతదేశ ఆయుర్దాయం విషయానికి వస్తే.. ఆడవారి ఆయుర్దాయం 74 ఏండ్ల కాగా.. మగవారి ఆయుర్దాయం 71 ఏండ్లుగా ఉన్నట్టు నివేదిక తెలిపింది. 
 
తొలిసారి చైనాను అధిగమించిన భారత్

ఐక్యరాజ్యసమితి జనాభా డేటా రికార్డులో 1950 నుండి భారతదేశ జనాభా చైనా కంటే ఎక్కువగా నమోదు కావడం ఇదే మొదటిసారి, వాస్తవానికి 1945లో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఐక్యరాజ్యసమితి స్థాపించబడింది మరియు 1950 ఐక్యరాజ్యసమితి జనాభా డేటా సేకరించి జారీ చేయడం ప్రారంభించారు. మీరు 1950 నుండి 2023 వరకు ఐక్యరాజ్యసమితి యొక్క జనాభా యొక్క చార్ట్ మరియు పట్టికను పరిశీలిస్తే,

భారతదేశ జనాభా ఈ విధంగా పెరిగింది..

2023లో భారతదేశ జనాభా 1,428,627,663, ఇది 2022 కంటే 0.81% ఎక్కువ.

2022లో భారతదేశ జనాభా 1,417,173,173, ఇది 2021 కంటే 0.68% ఎక్కువ.

2021లో భారతదేశ జనాభా 1,407,563,842, ఇది 2020 కంటే 0.8% ఎక్కువ.

2020లో భారతదేశ జనాభా 1,396,387,127, ఇది 2019 కంటే 0.96% ఎక్కువ.

చైనాలో జననాల రేటు తగ్గింది.. వృద్ధులు రేటు పెరిగింది..

మరోవైపు చైనాను పరిశీలిస్తే.. 65 ఏళ్లు పైబడిన వారు దాదాపు 200 మిలియన్లుగా ఉన్నట్టు తెలుస్తోంది. కొన్ని దశాబ్దాల క్రితం.. చైనా ప్రభుత్వం 1-చైల్డ్ (సింగల్ చైల్డ్ పాలసీ) విధానాన్ని అమలు చేసింది. దీని కారణంగా ప్రజలు పిల్లలను కనడం మానేసే విధంగా ప్రభుత్వం బాధపడవలసి వచ్చింది. ఈ పాలసీ ప్రభావం.. చైనాపై పడింది. దీంతో జనాభా పెరుగుదల క్రమంగా తగ్గింది. 

తాజాగా  చైనా ప్రభుత్వం దేశ జనాభా పెరగడానికి పలు పాలసీలను అమలు చేస్తుంది. ఇప్పుడు ఇద్దరూ  లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు పుట్టే దంపతులకు అనేక సౌకర్యాలు కల్పిస్తామని చైనా ప్రభుత్వం చెప్పే పరిస్థితి నెలకొంది. అక్కడ కాలేజీల్లో విద్యార్థులకు ప్రెగ్నేస్సీ హాలీ డేను ప్రకటించడం ప్రారంభించాయంటే.. ఆ దేశంలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.  ఈ ఏడాది ప్రారంభంలో.. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన నగరం, చైనా రాజధాని బీజింగ్ లో జనాభా పెరగడానికి బదులు తగ్గింది అనే షాకింగ్ న్యూస్ కూడా వచ్చింది. దీనికి కరోనా మహమ్మారి కూడా ప్రధాన కారణంగా భావిస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Putin India Tour: భారత్ లో అడుగుపెట్టిన పుతిన్ సెక్యూరిటీ చూశారా? | Modi Putin | Asianet News Telugu
Putin Tour: భారత్‌కి పుతిన్‌ రాక.. వారణాసిలో దీపాలతో స్వాగతం | Vladimir Putin | Asianet News Telugu