
Howrah: బెంగాల్ లోని హౌరాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. 100కు పైగా దుకాణాలు దగ్ధమయ్యాయి. ఉలుబేరియా పోలీస్ స్టేషన్ పరిధిలోని చెంగైల్ లోని లుడ్లో బజార్ లో అర్ధరాత్రి ఈ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం సంభవించడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్టు సంబంధిత అధికారులు తెలిపారు.
ఈ అగ్నిప్రమాదం గురించి వెల్లడించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. పశ్చిమబెంగాల్ లోని హౌరా జిల్లాలో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో 100కు పైగా దుకాణాలు దగ్ధమయ్యాయి. ఉలుబేరియా పోలీస్ స్టేషన్ పరిధిలోని చెంగైల్ లోని లుడ్లో బజార్ లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిమంటలు వేగంగా వ్యాపించి, 100 కి పైగా దుకాణాలను దగ్ధం చేసింది, వీటిలో చాలా వరకు తాత్కాలిక నిర్మాణాలుగా ఉన్నాయని సంబంధిత అధికారులు తెలిపారు. పది అగ్నిమాపక యంత్రాలు నాలుగు గంటలకు పైగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయని అగ్నిమాపక శాఖకు చెందిన వర్గాలు వెల్లడించాయి.
అయితే, ఈ ప్రమాదంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, విచారణ తర్వాత అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలుస్తాయని వారు తెలిపారు. అగ్నిప్రమాదం వల్ల జరిగిన నష్టాన్ని తెలుసుకుంటున్నామని అధికారులు పేర్కొన్నారు. ఈద్ కారణంగా అమ్మకాలు పెరుగుతాయనే అంచనాతో ఇటీవల సరుకులను నిల్వ చేశామని, అగ్నిప్రమాదం వల్ల లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని వ్యాపారులు లబోదిబో మంటున్నారు.
అంతా కాలి బూడిదైంది, లక్షల రూపాలయ నష్టం
ఈద్ వల్ల అమ్మకాలు పెరుగుతాయనే ఆశతో ఇటీవల దుకాణాల్లో చాలా సరుకులు పెట్టామని, అయితే భారీ అగ్నిప్రమాదంలో వస్తువులన్నీ దగ్ధమయ్యాయని బాధిత వ్యాపారులు తెలిపారు. అగ్ని ప్రమాదంలో లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని చెబుతున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతంలో గంటల తరబడి భయాందోళన వాతావరణం నెలకొంది.