నోయిడా సొసైటీ పార్కులో మహిళ, ఆమె పెంపుడు శునకంపై వీధికుక్కలు దాడి.. షాకింగ్ వీడియో వైరల్...

Published : Apr 19, 2023, 03:55 PM IST
నోయిడా సొసైటీ పార్కులో మహిళ, ఆమె పెంపుడు శునకంపై వీధికుక్కలు దాడి.. షాకింగ్ వీడియో వైరల్...

సారాంశం

నోయిడాలోని సొసైటీ పార్కులో బుధవారం ఉదయం ఓ మహిళ, ఆమె పెంపుడు కుక్కపై మూడు వీధికుక్కలు దాడి చేశాయి. ఈ ఘటన మొత్తం కెమెరాకు చిక్కింది.

నోయిడా : నోయిడాలోని సొసైటీ పార్కులో బుధవారం ఉదయం ఓ మహిళ, ఆమె పెంపుడు కుక్కపై మూడు వీధికుక్కలు దాడి చేశాయి. ఈ సంఘటన సెక్టార్ 78లోని మహాగున్ మోడరన్ సొసైటీ పార్కులో జరిగింది. సొసైటీలో ఉండే ఓ వ్యక్తి ఈ మొత్తాన్ని కెమెరాలో బంధించారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఆ మహిళ తన పెంపుడు కుక్కను వాకింగ్ కోసం బయటకు తీసుకెళ్లగా మూడు వీధి కుక్కలు ఆమె పెంపుడు జంతువుపై దాడి చేశాయి. తన పెంపుడు జంతువును రక్షించే ప్రయత్నంలో, ఆ మహిళ దానిని తన ఒడిలో పెట్టుకుంది. దీంతో వీధికుక్కలు ఆమెపై దాడి చేశాయి. కుక్కలు వెంబడించడంతో ఆ మహిళ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరిగెత్తింది.

కానీ వీధికుక్కలు రెచ్చిపోయి ఆమెను వెంబడించి కరవడానికి ప్రయత్నించాయి. పెంపుడుకుక్కను కరిచి చంపేస్తాయన్న భయంతో ఆమె దాన్ని చేతుల్లోకి ఎత్తుకుని పారిపోవడం వీడియోలో కనిపిస్తుంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. వీధికుక్కల సమస్యపై నెటిజన్లు చాలామంది తమ ఆందోళనలను వ్యక్తం చేశారు. అధికారులు ఈ సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ సంఘటన నోయిడాలో వీధి కుక్కల సమస్యను మరోసారి హైలైట్ చేసింది. నగరంలోని వివిధ ప్రాంతాల నుండి ఇలాంటి అనేక సంఘటనలు నివేదించబడ్డాయి. గత నెలలో ఇదే సొసైటీలో ఓ ఇంటి సహాయకుడిపై దాడి జరిగినట్లు సమాచారం. ముప్పును అరికట్టడానికి నోయిడా అథారిటీ న్యూ డాగ్ పాలసీని కూడా అమలు చేసింది. అయితే ఇలాంటి ఘటనలు నిరాటంకంగా కొనసాగుతూనే ఉన్నాయి.

భారతదేశం మ్యాప్‌ను తప్పుగా చూపించిన యూఎన్ఎ‌ఫ్‌ఏ డాష్‌బోర్డు.. సరికొత్త వివాదం..!

ఇదిలా ఉండగా, తెలుగు రాష్ట్రాల్లోనూ శునకాల బెడద ఇంకా తీరడం లేదు. మనుషులమీద దాడిచేస్తూ వీధి కుక్కలు గాయపరుస్తున్న ఘటనలు ఇంకా వెలుగు చూస్తూనే ఉన్నాయి. సిద్ధిపేట అదనపు కలెక్టర్ ను కుక్కలు కరిచిన ఘటన సంచలనంగా మారింది. ఇదింకా మరువకముందే ఏపీలోని అన్నమయ్య జిల్లాలో కుక్కల దాడిలో ఓ రైతు మృతి చెందిన ఘటన వెలుగుచూసింది. ఈ ఘటన అన్నమయ్య జిల్లా సంబేపల్లె మండలం నారాయణరెడ్డిగారిపల్లె పంచాయతీ ముద్దినేని వడ్డెపల్లెలో ఏప్రిల్ 4వ తేదీ రాత్రి జరిగింది. 

స్థానికులు, పోలీసులు ఈ ఘటనకు సంబంధించి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మదనపల్లె రెడ్డయ్య (55)  ముద్దినేనివడ్డెపల్లెకు చెందిన రైతు. అతనికి గ్రామ సమీపంలో మామిడి తోట ఉంది. ఆ రోజు రాత్రి తోటకు కాపలా ఉండడానికి వెళ్లాడు. తోట గట్టున పడుకోవడానికి ప్రయత్నిస్తుండగా అతడి మీద కుక్కల గుంపు దాడి చేసింది. వాటినుంచి తప్పించుకోలేక.. ఆ రైతు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అర్థరాత్రి జరిగిన ఈ ఘటన  ఉదయానికి గానీ వెలుగులోకి రాలేదు. 

ఉదయం సమీప పొలాల్లోని రైతులు రెడ్డయ్య చనిపోయి ఉండడాన్ని గుర్తించారు. వెంటనే కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. ఈ వార్త విని కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. తోటకు చేరుకున్న వారు అక్కడ బీభత్సంగా ఉన్న దృశ్యాన్ని చూసి కన్నీటిపర్యంతమవుతున్నారు. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న రాయచోటి గ్రామీణ పోలీసులు.. మృతదేహాన్ని పోస్ట్ మార్టానికి తరలించారు. దీనిమీద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Viral News : ఇక జియో ఎయిర్ లైన్స్.. వన్ ఇయర్ ఫ్రీ..?
Viral News: పెరుగుతోన్న విడాకులు.. ఇకపై పెళ్లిళ్లు చేయకూడదని పండితుల నిర్ణయం