రెజ్లర్ల నిరసన లో ట్విస్ట్.. యూటర్న్ తీసుకున్న మైనర్ తండ్రి.. బ్రిజ్ భూషణ్ నా కూతురిని వేధించలేదంటూ వాంగ్మూలం

By Asianet News  |  First Published Jun 8, 2023, 1:26 PM IST

రెజ్లర్ల నిరసనలో కొత్త ట్విస్ట్ వెలుగుచూసింది. తన కూతురిని బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగికంగా వేధించలేదని మైనర్ రెజ్లర్ తండ్రి తాజా వాంగ్మూలంలో పేర్కొన్నారు. అయితే కూతురు పట్ల పక్షపాతంగా వ్యవహరించడాని ఆరోపించారు. 


డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మహిళా రెజ్లర్లపై, అలాగే ఓ మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ, అతడిపై చర్యలు తీసుకోవాలని గత కొంత కాలంగా రెజ్లర్లు నిరసన తెలుపుతున్నారు. వీరి నిరసనపై దేశ వ్యాప్తంగా చర్చ సాగుతోంది. అయితే వీరి నిరసనలో ఇప్పుడు కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. జూన్ 5వ తేదీన న్యూఢిల్లీలోని మేజిస్ట్రేట్ ఎదుట ఫోన్ ద్వారా మైనర్ బాలిక తండ్రి తాజా వాంగ్మూలం ఇచ్చారు. అందులో డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ తన కుమార్తెను లైంగికంగా వేధించలేదని చెప్పారు. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తాను, తన మైనర్ కుమార్తె కొన్ని తప్పుడు ఆరోపణలు చేశామని మైనర్ రెజ్లర్ తండ్రి తెలిపారు. 

జమ్మూలో భక్తులకు అందుబాటులోకి వచ్చిన టీటీడీ వేంకటేశ్వర ఆలయం.. ప్రారంభించిన అమిత్ షా.. ప్రత్యేకతలేంటంటే ?

Latest Videos

‘టైమ్స్ నౌ’ కథనం ప్రకారం.. మైనర్ తండ్రి గతంలో తన కుమార్తె ను బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఫొటో దిగే నెపంతో బలవంతంగా అతడి వైపు లాక్కుని చేతులు గట్టిగా పట్టుకున్నాడని ఆరోపించాడు. దీంతో తన కూతురు అతడి ఆమె తన పట్టు నుంచి కదలలేక, విడిపించుకోలేకపోయిందని అన్నారు. ‘‘ఆమెను గట్టిగా పట్టుకుని ఫొటో తీసుకుంటున్నట్టు నటిస్తూ, తన వైపుకు లాక్కుని ఆమె భుజం మీద గట్టిగా నొక్కాడు, ఆపై ఉద్దేశపూర్వకంగా అతడి చేతిని ఆమె భుజం మీదకు నెట్టి, తన చేతులను ఆమె వక్షోజాలపై రుద్దాడు. అయితే తన కూతురు తనకు ఎలాంటి శారీరక సంబంధంపై ఆసక్తి లేదని, తనను వెంబడించవద్దని అతడిని గట్టిగా కోరింది’’ అని పేర్కొన్నారు.

అయితే ఇప్పుడు బాలిక తండ్రి జూన్ 5న న్యూఢిల్లీలోని మేజిస్ట్రేట్ ముందు తన తాజా వాంగ్మూలంలో ఓ ప్రముఖ దినపత్రికతో మాట్లాడుతూ.. సింగ్ తన కుమార్తెను లైంగికంగా వేధించలేదని, కానీ అతడు తన కూతురి పట్ల పక్షపాత వైఖరి ప్రదర్శించాడని పేర్కొన్నారు. ‘‘నేను నా స్టేట్ మెంట్ మార్చుకున్నాను. కొన్ని ఆరోపణలు నిజం. మరికొన్ని అవాస్తవాలు. బ్రిజ్ భూషణ్ నా కుమార్తెను లైంగికంగా వేధించలేదు. కానీ అతడి వైఖరి నా కూతురి పట్ల పక్షపాతంగా ఉంది. నాకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. కానీ నేను వారి పేర్లను వెల్లడించను. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై మాకు ఎలాంటి కక్ష లేదు. జూన్ 5న కొత్త స్టేట్ మెంట్లు నమోదు చేశాం. గతంలో ఇచ్చిన వాంగ్మూలాల్లో కొన్నింటిని మార్చాము. నేను ఒక అమ్మాయికి తండ్రిని, ఈ పోరాటంలో పాల్గొనడం నాకు ఇష్టం లేదు.’’ అని అన్నారు.

చిన్న విషయాలకే తరచూ అవమానిస్తోందని భార్యపై కాల్పులు జరిపిన రిటైర్డ్ సీఆర్పీఎఫ్ జవాన్.. ఎక్కడంటే ?

కోపంతో తాము కొన్ని తప్పుడు ఆరోపణలు చేశామని, తన కుమార్తె కొన్ని సమస్యలను ఎదుర్కొందని, అయితే ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నవన్నీ నిజం కాదని ఆయన అన్నారు. తమ కుటుంబం మొత్తం డిప్రెషన్ లో ఉందని, తన కుమార్తెను ఛాంపియన్ చేయడమే తన ప్రధాన లక్ష్యమని చెప్పారు. గత రెండు రోజులుగా తాను తన కుమార్తెతో కలిసి ఢిల్లీకి దూరంగా ఉన్నానని, మతపరమైన ప్రదేశాన్ని సందర్శిస్తున్నానని బాలిక తండ్రి ‘హిందుస్థాన్ టైమ్స్’తో తెలిపారు. 

రైతుల కోసం ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా ఖరీఫ్ పంటల ఎంఎస్పీ పెంపు - ప్రధాని మోడీ

ఇదిలా ఉండగా.. నిరసన తెలుపుతున్న రెజ్లర్లతో కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రెజ్లర్లతో సానుకూలంగా చర్చించామని, పదవీ విరమణ చేస్తున్న సింగ్ పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించిన చార్జిషీట్ ను జూన్ 15లోగా దాఖలు చేస్తామని తెలిపారు. ‘‘డబ్ల్యూఎఫ్ఐ చీఫ్పై వచ్చిన ఆరోపణలపై విచారణ పూర్తి చేసి జూన్ 15లోగా చార్జిషీట్ దాఖలు చేయాలని వారు (రెజ్లర్లు) డిమాండ్ చేశారు. జూన్ 30 నాటికి డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికలు జరుగుతాయి’’ అని చెప్పారు. సమావేశంలో అన్ని నిర్ణయాలు ఏకగ్రీవంగా తీసుకున్నామని, వివిధ అకాడమీలు, క్రీడాకారులపై కేసులను ఉపసంహరించుకోవాలని, సింగ్, అతడి సహచరులను ఎన్నికల ప్రక్రియలో పాల్గొననివ్వవద్దని రెజ్లర్లు డిమాండ్ చేశారని క్రీడా మంత్రి తెలిపారు.

click me!