Cyclone Biparjoy: మరింత తీవ్రరూపం దాల్చనున్న బిపర్‌జోయ్.. ఈ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..

Published : Jun 08, 2023, 12:16 PM IST
Cyclone Biparjoy: మరింత తీవ్రరూపం దాల్చనున్న బిపర్‌జోయ్.. ఈ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..

సారాంశం

బిపర్‌జోయ్ తుపాన్ తీవ్రరూపం దాల్చుతుంది. రాబోయే గంటల్లో ఇది తీవ్ర తుఫానుగా మారనుందని వాతావరణ శాఖ గురువారం తెలిపింది.

బిపర్‌జోయ్ తుపాన్ తీవ్రరూపం దాల్చుతుంది. రాబోయే గంటల్లో ఇది తీవ్ర తుఫానుగా మారనుందని వాతావరణ శాఖ గురువారం తెలిపింది. రాబోయే మూడు రోజుల్లో వాయువ్య భారతదేశం వైపు కదులుతుందని పేర్కొంది. పశ్చిమ-మధ్య, దక్షిణ అరేబియా సముద్రానికి ఆనుకుని ఉన్న ప్రాంతాలు.. ఉత్తర కేరళ, కర్ణాటక, గోవా తీరాలపై తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా వేసింది. 

బిపర్‌జోయ్ తుపాన్ బుధవారం (జూన్ 7) రాత్రి 11.30 గంటల సమయంలో గోవాకు పశ్చిమ-నైరుతి దిశలో 870 కి.మీ దూరంలో, ముంబైకి  దక్షిణ-పశ్చిమ దిశలో 930 కి. మీల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది వచ్చే 48 గంటల్లో క్రమంగా మరింత తీవ్రమవుతుందని.. రాబోయే 3 రోజుల్లో దాదాపు ఉత్తర-వాయువ్య దిశగా కదులుతుందని వెల్లడించింది. 

రానున్న మూడు, నాలుగు రోజులపాటు ఈ వ్యవస్థ చాలా తీవ్రమైన తుఫానుగా కొనసాగుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. తుపాను సుదీర్ఘ సముద్ర ప్రయాణాన్ని కలిగి ఉన్నందున.. అనుకూల పరిస్థితుల కారణంగా ఇది మరింత తీవ్రతరం కావచ్చని స్కైమెట్ వెదర్ అంచనా వేసింది. 

బిపర్‌జోయ్ తుపాన్ నేపథ్యంలో.. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు తాము పూర్తిగా సిద్ధంగా ఉన్నామని గుజరాత్ ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. జూన్ 14 వరకు అరేబియా సముద్రంలోకి వెళ్లవద్దని గుజరాత్‌లోని మత్స్యకారులను హెచ్చరించింది. ఇక, తుపాను కారణంగా సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్ ప్రాంతాల్లో జూన్ 9, 11 మధ్య తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

లక్షద్వీప్, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర తీర ప్రాంతాలు బిపర్‌జోయ్ తుపాన్ ప్రభావం చూపే అవకాశం ఉంది. నైరుతి తీర ప్రాంతంలో రానున్న ఐదు రోజుల పాటు గాలులు వీస్తాయని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది.

ఇక, తూర్పు-మధ్య అరేబియా సముద్రం, పశ్చిమ-మధ్య, ఆగ్నేయ అరేబియా సముద్రం పరిసర ప్రాంతాలపై గంటకు 80-90 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఇది 100 కి.మీ వేగానికి పెరగవచ్చని అంచనా వేయబడింది. 

కేరళలో రుతుపవనాలు ప్రారంభమవుతాయని భారత వాతావరణ శాఖ తెలపింది. రెండు రోజుల్లో కేరళలో రుతుపవనాలు ప్రవేశించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పేర్కొంది. అయితే రుతుపవనాల తీవ్రతపై తుపాన్ ప్రభావం చూపుతోందని.. కేరళలో ప్రారంభం "తేలికపాటి"గా ఉంటుందని వాతావరణ నిపుణులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్