పట్టపగలు గ్యాంగ్ రేప్.. చీరకూడా లేకుండా 500మీ.లు నడిచి నేరుగా స్టేషన్ కు వెళ్ళిన మహిళ...

By SumaBala BukkaFirst Published Jan 22, 2022, 12:05 PM IST
Highlights

సమాచారం అందిన వెంటనే ఉదయ్ పుర్ ఎస్పీ మనోజ్ చౌదరి, ఝాఢోల్ పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అక్కడి నుంచి మహిళ చీర ఓ చేతి గడియారం స్వాధీనం చేసుకున్నారు. నిందితులు పరిసర ప్రాంతం వారేనని అనుమానిస్తున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షలకు పంపించి.. వారి కోసం గాలింపు చేపట్టారు. 

రాజస్థాన్ : ఒంటరిగా వెడుతున్న గిరిజన married womanను ఇద్దరు దుండగులు పట్టపగలే దారిలో అడ్డగించి gang rapeకి పాల్పడ్డారు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయారు. తేరుకున్న బాధిత woman ఒంటిమీద చీర లేకుండానే 500 మీటర్ల దూరంలో ఉన్న బాఘ్ పురా చౌక్ కు వెళ్లింది. అక్కడ ఉన్నవాళ్లకు తనపై జరిగిన అఘాయిత్యాన్ని వివరించింది. 

వారి సాయంతో పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఈ అమానుషన ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్ పుర్ జిల్లాలో వెలుగు చూసింది. సమాచారం అందిన వెంటనే ఉదయ్ పుర్ ఎస్పీ మనోజ్ చౌదరి, ఝాఢోల్ పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అక్కడి నుంచి మహిళ చీర ఓ చేతి గడియారం స్వాధీనం చేసుకున్నారు. నిందితులు పరిసర ప్రాంతం వారేనని అనుమానిస్తున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షలకు పంపించి.. వారి కోసం గాలింపు చేపట్టారు. 

ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో జరిగింది.. ‘అన్నయ్యా..’ అని పిలిచినా కనికరించలేదు.. కాళ్ళ వేళ్ళు పడ్డ వదిలిపెట్టలేదు.. నోరెత్తితే.. చంపేస్తానని కత్తితో బెదిరించాడు. ‘అన్నయ్యను కాదు, మావయ్య అవుతా’’ అంటూ.. సినిమా డైలాగులు కొడుతూ..  అభం శుభం తెలియని 11యేళ్ల చిన్నారిపై Sexual assault చేశాడు ఓ కామాంధుడు. ఈ దారుణ ఘటన గురువారం రాత్రి నక్కపల్లి మండలం రాజపేటలో జరిగింది.  11 ఏళ్ల మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన  నాగేష్ (22) అత్యాచారానికి పాల్పడ్డాడు.  బాధితురాలి ఫిర్యాదు ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి…

బాధిత బాలిక పాఠశాల నుంచి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఎవరూ లేరు. వంట చెరుకు కోసం ఆమె సోదరి పక్కనే ఉన్న Cashew gardenకి వెళ్ళింది. ఆమెకు సహాయపడేందుకు బాధితురాలు కూడా తోటకు బయలుదేరింది. ఈ విషయం గమనించిన నిందితుడు ఆమె వెంట వెళ్లి ఈ అఘాయిత్యం చేశాడు. బాలిక నోట్లో గుడ్డలు కుక్కి.. తోటలోకి లాక్కెళ్లాడు. తర్వాత బాలిక మీద అమానుషంగా అత్యాచారానికి ఒడిగట్టాడు. నగ్నంగా ఫొటోలు, వీడియో తీసి ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని  కత్తితో బెదిరించాడు.  

అంతేకాకుండా బాధితురాలి సోదరిని, తల్లిని సైతం స్నానం చేసేటప్పుడు వీడియోలు తీసి తన నిమొబైల్ కి పంపించాలి అని చెప్పాడు. అలా ఆ బాలికను నాలుగు గంటల పాటు చిత్రహింసలకు గురిచేశాడు. ఎవరికీ చెప్పనని ఒదిలి పెట్టాలంటూ ఆ చిన్నారి కాళ్లావేళ్లా పడడంతో.. రాత్రి 9 గంటల సమయంలో తన ఇంటి వద్ద వదిలి వెళ్ళాడు.

తన చిన్న కుమార్తె కనిపించలేదని కంగారుగా వెతుకుతున్న తల్లిదండ్రులు…  ఎట్టకేలకు ఇంటికి చేరడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆమె చెప్పిన విషయం విని వారి గుండెలు బద్దలైపోయాయి. వెంటనే బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు శుక్రవారం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలికను వైద్యపరీక్షల కోసం.. విశాఖ కేజీహెచ్కు తరలించారు. అక్కడ ఆమెకు చికిత్స అందిస్తున్నారు. 

click me!