ఫిబ్రవరి 25, 2024న ఏషియానెట్‌లో సాయంత్రం 6 గంటల వరకు టాప్ 10 వార్తలు ఇవే.
ఎన్నికల వరకూ సర్వేలు .. తేడా వస్తే అభ్యర్ధుల్ని మార్చేస్తా : చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
అభ్యర్ధుల పనితీరుపై ప్రతివారం సర్వే చేపడతామని, సర్వేల్లో తేడా వస్తే అభ్యర్ధులను మార్చేందుకు సైతం వెనుకాడబోమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. రాబోయే 40 రోజులు అత్యంత కీలకమని, నిత్యం ప్రజల్లో వుండాలని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాబోయే 40 రోజులు అత్యంత కీలకమని, నిత్యం ప్రజల్లో వుండాలని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాలు, ఎమ్మెల్యేల పనితీరును ఎండగట్టాలని .. ప్రజలకు నమ్మకం, ధైర్యం కలిగించాలని చంద్రబాబు సూచించారు. పూర్తి కథనం
undefined
టీడీపీ జనసేన తొలి జాబితా విడుదల.. బీజేపీ సంగతేంటీ , మా వ్యూహం మాకుందన్న పురందేశ్వరి
వచ్చే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు గాను టీడీపీ జనసేన తొలి జాబితా ప్రకటించడంతో ఇప్పుడు అందరి చూపు బీజేపీపై పడింది . దీనిపై ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి స్పందించారు. మా వ్యూహం మాకుందన్న పురందేశ్వరి టీడీపీ, జనసేన అన్ని సీట్లను ఇంకా ప్రకటించలేదు కదా అని వ్యాఖ్యానించారు. బీజేపీ హైకమాండ్ కనుక పొత్తు ఖరారు చేస్తే.. అప్పుడు సీట్ల పంపకం గురించి ఆలోచిస్తామని ఆమె వివరించారు. పూర్తి కథనం
జనసేన అంత బలహీనంగా ఉందా .. దేహీ అనటం పొత్తు ధర్మమా : పవన్‌కు హరిరామ జోగయ్య ఘాటు లేఖ
టీడీపీ జనసేన తొలి జాబితాపై కాపు నేత, మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఒకరు ఇవ్వడం, మరొకరు దేహీ అని పుచ్చుకోవడం పొత్తు ధర్మం కాదని ఆయన తేల్చిచెప్పారు. జనసేనకు కేవలం 24 సీట్లు ఇవ్వడం ఏంటీ.. ఆ పార్టీ పరిస్ధితి అంత దయనీయంగా వుందా అని ప్రశ్నించారు. జనసేన శక్తిని పవన్ తక్కువగా అంచనా వేసుకుంటున్నారు.. 24 సీట్ల కేటాయింపు జనసైనికులను సంతృప్తి పరచలేదని.. రాజ్యాధికారంలో వాళ్లు వాటా కోరుకుంటున్నారని హరిరామజోగయ్య వ్యాఖ్యానించారు. పూర్తి కథనం
టిక్కెట్ దక్కని నేతలకు బుజ్జగింపులు: అసంతృప్తులకు చంద్రబాబు నుండి పిలుపు
టిక్కెట్లు దక్కని టీడీపీ నేతలకు ఆ పార్టీ నాయకత్వం బుజ్జగించనుంది.ఈ మేరకు టిక్కెట్టు దక్కని నేతలకు చంద్రబాబు నుండి పిలుపునిచ్చింది. పొత్తుల నేపథ్యంలో సీట్లను త్యాగం చేయాల్సిన అనివార్య పరిస్థితులున్నాయని చంద్రబాబు పార్టీ నేతలకు తేల్చి చెప్పారు. నిన్న ప్రకటించిన తొలి జాబితాలో కొందరు సీనియర్లకు చోటు దక్కలేదు. రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సీట్లు త్యాగం చేసిన వారికి పదవుల పంపకంలో ప్రాధాన్యత ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. పూర్తి కథనం
వెంకటేష్‌తో త్రిష రొమాన్స్.. 14ఏళ్ల తర్వాత కలుస్తున్న జోడీ.. ?
విక్టరీ వెంకటేష్ చివరగా `సైంధవ్` చిత్రంతో వచ్చాడు. సంక్రాంతికి ఈ మూవీ విడుదలైంది. తీవ్ర నిరాశ పరిచింది. కానీ ఈ సారి మాత్రం డిజప్పాయింట్ చేయకూడదని ప్లాన్ చేస్తున్నారట. తాజాగా వెంకటేష్ తనకు `ఎఫ్2`, `ఎఫ్3` విజయాలను అందించిన అనిల్ రావిపూడితో సినిమా చేయబోతున్నారట. ఈ కాంబోలో సినిమా ఫైనల్ అయినట్టు తెలుస్తుంది. ఇందులో హీరోయిన్‌గా మాత్రం ఇంట్రెస్టింగ్ నేమ్ వినిపిస్తుంది. త్రిషని అనుకుంటున్నారట. పూర్తి కథనం
అల్లు అర్జున్ కెరీర్ ఇక ముగిసినట్లే అని అల్లు అరవింద్ భయపడిన క్షణం..చిరంజీవి రంగంలోకి దిగి..
ఓ సినిమా కథ విషయంలో ప్రయోగాలు చేస్తే అల్లు అర్జున్ కెరీరే ముగిసిపోతుందేమో అని అల్లు అరవింద్ భయపడ్డారట. అప్పుడు కథ చిరంజీవి దగ్గరకి వెళ్ళింది. చిరు కథ వినగానే ఎలాంటి డౌట్ వద్దు.. ఈ మూవీ బన్నీకి పర్ఫెక్ట్.. సూపర్ హిట్ అవుతుందని మెగాస్టార్ తేల్చేశారు. కట్ చేస్తే ఆర్య రిజల్ట్ ఏంటో అందరికి తెలుసు. అదన్నమాట ఆర్య వెనుక జరిగిన కథ. పూర్తి కథనం
SSMB29 ప్రకటన కోసం హాలీవుడ్ దిగ్గజాలు, ఇంటర్నేషనల్ మీడియా.. రాజమౌళి స్కెచ్ నెక్ట్స్ లెవల్?
మహేష్ బాబుతో రూపొందించబోతున్న సినిమా విషయంలో రాజమౌళి ప్రారంభం నుంచి భారీ ప్లానింగ్‌తో వెళ్తున్నారట. అందులో భాగంగా అధికారిక ప్రకటనకు భారీ మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నారట. జనరల్‌గా ఆయన తన సినిమాలను మీడియా వేదికగా ప్రకటిస్తారు. అందుకోసం ఈవెంట్ ప్లాన్ చేస్తారు. ఇందులో ఎలాంటి సినిమా చేయబోతున్నారో వివరిస్తాడు. ఇప్పుడు కూడా అదే చేయబోతున్నారట. అందుకోసం ఓ హాలీవుడ్ దిగ్గజాన్ని దించాలనే ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తుంది. పూర్తి కథనం
హైపర్ ఆది జాతకంలో దోషం, పెళ్లి కావాలంటే అంత దారుణం చేయాలా? జరిగే పనేనా?
హైపర్ ఆది పెళ్లికి సంబంధించిన ఓ షాకింగ్ మేటర్ వెలుగులోకి వచ్చింది. హైపర్ ఆది జాతకంలో దోషం ఉందట. అందుకే వివాహం కావడం లేదట. ఈ దోష నివారణకు ఒకటే మార్గం ఉందట. అయితే హైపర్ ఆది.. అందుకు ఒప్పుకుంటాడా లేదా అనేదే సమస్య. అప్పుడు ఆది నచ్చిన అమ్మాయిని వివాహం చేసుకోవచ్చట. ఈ విషయాన్ని తాగుబోతు రమేష్ శ్రీదేవి డ్రామా కంపెనీ షో వేదికగా తెలియజేశాడు. పూర్తి కథనం
డిఫ్రెషన్ లో ఉన్నా.. నా పరిస్థితి బాలేదు.. అందుకే ఆపనిచేశా.. షణ్ముఖ్ జస్వత్...?
గంజాయి తాగుతూ పట్టబడ్డాడు ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్.. ఈకేసు రకరకాల మలుపులు తిరుగుతోంది. ఈక్రమంలో షణ్ముఖ్ ఈ విషయంలో స్పందించినట్టుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే షణ్ముఖ్ జస్వంత్ మాత్రం దానికి కారణాలు చెప్పినట్టు తెలుస్తోంది. తాను డిప్రెషన్ లో ఉన్నాను అని, నా పరిస్థితి ఏం బాగోలేదు అని, సూసైడ్ చేసుకోవాలనుకున్నాను అని.. ఆ బాధలోనే గంజాయి తీసుకున్నాను అని అతను తెలిపినట్టు సమాచారం. పూర్తి కథనం
IND vs ENG : అద్భుతమైన ఇన్నింగ్స్ తో మెరిసిన ధృవ్ జురెల్.. రాంచీలో రికార్డుల మోత !
భారత్-ఇంగ్లాండ్ సిరీస్ లో అరంగేట్రం చేసిన భారత వికెట్ కీపర్ ధృవ్ జురెల్ అద్భుతమైన ఆటతో రాణిస్తున్నాడు. అరంగేట్రం మ్యాచ్ లోనే మంచి ఇన్నింగ్స్ ఆడిన జురెల్.. రాంచీలో మరోసారి ఇంగ్లాండ్ పై హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. భారత్ తొలి ఇన్నింగ్స్ వరుస వికెట్లు కోల్పోయిన తరుణంలో సూపర్ ఇన్నింగ్స్ తో వికెట్ కీపర్ ధృవ్ జురెల్ భారత స్కోర్ ను 300 పరుగులు దాటించాడు. తొలి ఇన్నింగ్స్ చివరలో కుల్దీప్ యాదవ్ తో కలిసి 76 పరుగుల అద్భుతమైన భాగస్వామ్యాన్ని అందించాడు. పూర్తి కథనం