Top Ten News @ 6.30 PM: ఏషియానెట్‌లో టాప్ 10 వార్తలు

By Mahesh K  |  First Published Feb 22, 2024, 6:38 PM IST

ఈ రోజు సాయంత్రం వరకు ఏషియానెట్‌ న్యూస్‌లోని టాప్ టెన్ వార్తలు.


ఐపీఎల్ 2024 షెడ్యూల్ వచ్చేసింది.. ఫస్ట్ మ్యాచ్ ఈ టీమ్‌ల మధ్యే

ఐపీఎల్ 2024 షెడ్యూల్ విడుదలైంది. వచ్చే నెల 22వ తేదీ నుంచి ఈ ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కానుంది. ఇది తొలి ఫేజ్ షెడ్యూల్ మాత్రమే. లోక్ సభ ఎన్నికలకు ఈసీ తేదీలను ప్రకటించిన తర్వాత మలి విడత షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేయనుంది. పూర్తి కథనం

Latest Videos

వైఎస్ షర్మిల అరెస్టు.. పోలీసులు అరెస్టు చేస్తుండగా చేతికి గాయం

మెగా డీఎస్సీ అని ఆరు వేల ఉద్యోగాలతో దగా డీఎస్సీ వేశారని, తాము నిరుద్యోగుల పక్షాన గళం విప్పుతున్నామని వైఎస్ షర్మిల అన్నారు. ఇందులో భాగంగానే ఛలో సెక్రెటేరియట్ చేపట్టారు. ఆమె సెక్రెటేరియట్‌కు వెళ్లుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. షర్మిలతోపాటు ఇతర కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేసి మంగళగిరి పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. పూర్తి కథనం

తొలి అభ్యర్థిని ప్రకటించిన టీ కాంగ్రెస్

పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయడానికి కాంగ్రెస్ టికెట్ కోసం 309 మంది దరఖాస్తులు చేసుకున్నారు. మొత్తం 17 లోక్ సభ స్థానాల కోసం దరఖాస్తులు అందగా.. కాంగ్రెస్ పార్టీ తొలి అభ్యర్థిని ప్రకటించింది. మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం నుంచి వంశీచంద్ రెడ్డిని పార్టీ బరిలోకి దింపనుంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. పూర్తి కథనం

బొత్సపై పోటీకి గంటా తడబాటు?

మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి విజయనగరంలోని చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని టీడీపీ నాయకత్వం తనను కోరిందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మీడియాకు తెలిపారు. చీపురుపల్లి విశాఖపట్టణానికి 150 కిలోమీటర్ల దూరం అని, అది వేరే జిల్లా అని వివరించారు. చీపురుపల్లి నుంచి పోటీ విషయమై తన అనుచరులు, సన్నిహితులు, తన టీమ్‌లో చర్చిస్తున్నట్టు చెప్పారు. పూర్తి కథనం

విశాఖలో 50 దేశాల నేవీ బృందాల విన్యాసాలు (ఫొటోలు)

విశాఖలో మిలన్ 2024 కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ నెల 19వ తేదీ నుంచి 27వ తేదీ వరకు సుమారు 50 దేశాలకు చెందిన నేవీ బృందాలు విన్యాసాలు చేపట్టనున్నాయి. ఆర్కే బీచ్‌లో అంతర్జాతీయ నగర కవాతు, సముద్ర సెమినార్, టెక్ ఎక్స్ పో, మిలన్ విలేజ్ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. పూర్తి కథనం

గంజాయి కేసులో బిగ్ బాస్ ఫేస్ షణ్ముఖ్ అరెస్టు

ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ గంజాయి కేసులో అరెస్టయ్యాడు. అన్న సంపత్‌తో కలిసి గంజాయి సేవిస్తూ షణ్ముఖ్ పోలీసులకు అడ్డంగా దొరికాడు. సంపత్‌ తనను మోసం చేశాడని మౌనికా అనే అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ విషయమై దర్యాప్తు చేయడానికి పోలీసులు రాగా.. షణ్ముఖ్ అడ్డంగా బుక్కయ్యాడు. పూర్తి కథనం

కమల్ హాసన్, శివకార్తికేయన్‌లను అరెస్టు చేయాలి

లోక నాయకుడు కమల్ హాసన్, ప్రముఖ నటుడు శివకార్తికేయన్‌లను అరెస్టు చేయాలని తమిళనాడులో ఆందోళనలు మొదలయ్యాయి. శివకార్తికేయన్ లీడ్ రోల్‌గా రంగూన్ దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో అమరన్ అనే సినిమాను కమల్ హాసన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్ విడుదలై ట్రెండింగ్‌లోకి వచ్చింది. అందులో అభ్యంతరకర సన్నివేశాలున్నాయని ఆందోళనలు వస్తున్నాయి. పూర్తి కథనం

శంకర్ సినిమాను మహేష్ కాదన్నారు!

శంకర్ దేశంలో ప్రసిద్ధ దర్శకుడు. మహేష్ బాబు సూపర్ స్టార్. శంకర్‌తో సినిమా అంటే స్టార్లు కాదనరు. కానీ, మహేష్ బాబు రెండు సార్లు ఆయన ఆఫర్‌ను రిజెక్ట్ చేశాడట. త్రీ ఇడియట్స్ సినిమాను తెలుగులో రీమేక్ చేద్దామని వస్తే.. అది తెలుగులో వర్కౌట్ కాదని మహేష్ చెప్పాడట. మరోసారి స్ట్రెయిట్ సినిమా కోసం అడిగినా కాదన్నాడట. పూర్తి కథనం

సింగిల్ ఓవర్లో 6 సిక్సర్లు బాదిన టాప్ 10 క్రికెటర్లు

ఆంధ్రా బ్యాటర్, యంగ్ క్రికెటర్ ఎం వంశీకృష్ణ రైల్వేస్ స్పిన్నర్ దమన్ దీప్ సింగ్ బౌలింగ్‌ను ఉతికి ఆరేశాడు. ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు దాటి.. లెజెండరీ ఫీట్‌ను గుర్తుకు తెచ్చాడు. ఇది వరకు సింగిల్ ఓవర్‌లో 6 సిక్సర్లు బాదిన బ్యాట్‌మెన్లను జ్ఞప్తికి తెచ్చాడు. ఈ రికార్డు రాసిన టాప్ టెన్ బ్యాట్స్‌మెన్లు వీరే. పూర్తి కథనం

కశ్మీరీ వీధుల్లో బ్యాట్‌ పట్టిన సచిన్

సచిన్ టెండూల్కర్ కశ్మీర్‌లోని గుల్మార్గ్ దారిలో బ్యాట్ పట్టాడు. క్రికెట్ ఆడుతున్నవారి వద్దకు వెళ్లి నేను ఆడనా? అని అడిగాడు. అక్కడి అభిమానులతో కలిసి క్రికెట్ ఆడాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన ఎక్స్‌లో పోస్టు చేశాడు. పూర్తి కథనం

click me!