Asianet News TeluguAsianet News Telugu

ఐపీఎల్ 2024 షెడ్యూల్ వచ్చేసింది.. ఫస్ట్ మ్యాచ్ ఈ టీమ్‌ల మధ్యే

ఐపీఎల్ 2024 షెడ్యూల్ విడులైంది. బీసీసీఐ 17వ సీజన్ ఐపీఎల్ ఫస్ట్ ఫేజ్ షెడ్యూల్‌ను ఇప్పుడే విడుదల చేసింది. ఫస్ట్ మ్యాచ్ సీఎస్‌కే, ఆర్సీబీల మధ్య మార్చి 22న చెన్నైలో జరగనుంది.
 

IPL schedule 2024: bcci released ipl 17th edition first phase schedule kms
Author
First Published Feb 22, 2024, 5:48 PM IST | Last Updated Feb 22, 2024, 5:48 PM IST

IPL Schedule 2024: అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా  (బీసీసీఐ) ఐపీఎల్ షెడ్యూల్ విడుదల చేసింది. 17వ ఎడిషన్ ఐపీఎల్ ఫస్ట్ ఫేజ్ షెడ్యూల్‌ను ఇంతకు ముందే విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం, సరిగ్గా నెల రోజులకు ఫస్ట్ మ్యాచ్ జరుగుతుంది. మార్చి 22వ తేదీన ఫస్ట్ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్‌ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతుంది. దీంతో ఫస్ట్ మ్యాచ్‌ సీఎస్‌కే సొంత గడ్డ మీద ఆర్సీబీతో తలపడనుంది. గత ఐపీఎల్ సీజన్‌లో ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ పై సీఎస్‌కే విజయం సాధించిన సంగతి తెలిసిందే. మొత్తం 21 మ్యాచ్‌ల షెడ్యూల్.. 22 మార్చి మొదలు ఏప్రిల్ 7వ తేదీ వరకు షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేసింది.

ఇది ఫుల్ షెడ్యూల్ కాదు. ఎన్నికల కమిషన్ లోక్ సభ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయాల్సి ఉన్నది. ఈసీ ఈ షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత ఐపీఎల్ ఈ 17వ సీజన్ తుది దశ షెడ్యూల్‌ విడుదల కానుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios