లేటెస్ట్ గా ఇంద్రి వరల్డ్ విస్కీ మార్కెట్ లో హాల్ చల్ చేస్తోందట. ఈ విస్కీ హర్యానాలో తయారవుతుంది. ఈ విస్కీకి దుబాయ్, బ్యాంకాక్, సింగపూర్ ఎయిర్ పోర్టుల్లో ఫుల్ సేల్స్ ఉన్నాయట.
ఢిల్లీ : ప్రపంచంలో మన దేశం ఇప్పుడు మరో దానికి ఫేమస్ అవుతోంది. మనోళ్లు తాగడమే కాదు.. ఫారిన్ జనాలూ మన మందులు లొట్టలేసుకుంటూ.. గుటుక్కుమనిపిస్తున్నారట. దీంతో విదేశాల్లో ఇండియన్ విస్కీకి యమా క్రేజ్ ఉందట. మామూలుగా ఫారిన్ సరుకు అంటే మనోళ్లకు తెగ మోజు. అక్కడినుంచి మందు తెప్పించుకుని, బంధువులు, స్నేహితుల ముందు గొప్పగా ఆ బాటిల్ విప్పి పోస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది.
బాటిల్ లో సరుకు గొంతులో సమ్మగా దిగుతుంటే.. నెమ్మదిగా కిక్కెక్కుతుంటే.. ఆహా అనుకుంటారు. సేమ్ టూ సేమ్ ఇప్పుడు ఫారినర్స్ మన ఇండియన్ లిక్కర్ విషయంలో ఇదే అనుకుంటున్నారట. ఇలా మన విస్కీకి ఇంత క్రేజ్, ట్రెండ్ రావడానికి కారణం.. బెంగళూరుకు చెందిన అమృత్ బ్రాండ్. సింగిల్ మాల్ట్ విస్కీని అమృత్ లిమిటెడ్ ఎడిషన్ పేరుతో మార్కెట్లోని రిలీజ్ చేశారు. దీనికి ప్రపంచమార్కెట్లో తెగ డిమాండ్ వచ్చింది. అలా ఐదేళ్లుగా టాప్ టెన్ విస్కీ బాటిల్స్ లో అమృత్ ఒకటిగా వెలిగిపోతోంది. అమృత్ కంపెనీ నుండి తయారైన మరో రకం విస్కీ కురింజి. ఇది కూడా టాప్ టెన్ విస్కీ బ్రాండ్స్ లో ఒకటిగా నిలిచింది.
నీటి అవసరం పెద్దగా లేని పంటలే లక్ష్యం.. పంజాబ్ రైతులకు మోడీప్రభుత్వం ఆఫర్...
లేటెస్ట్ గా ఇంద్రి వరల్డ్ విస్కీ మార్కెట్ లో హాల్ చల్ చేస్తోందట. ఈ విస్కీ హర్యానాలో తయారవుతుంది. ఈ విస్కీకి దుబాయ్, బ్యాంకాక్, సింగపూర్ ఎయిర్ పోర్టుల్లో ఫుల్ సేల్స్ ఉన్నాయట. అన్ని డ్యూటీ ఫ్రీ ఎయిర్పోర్టు స్టోర్స్ లో ఇండియన్ లిక్కర్ కి డిమాండ్ బాగా పెరుగుతుందట. విస్కీనే కాదు కొన్ని ఇండియన్ బ్రాండ్స్ వోడ్కా బాటిల్స్ కూడా ఇప్పుడిప్పుడూ ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతున్నాయి.
మన కింగ్ ఫిషర్ బీర్.. ఇంటు ఇండియాలోనే కాదు... ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా దొరుకుతుంది. అది దాని డిమాండ్. అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో అయితే ఎంతోమందికి ఈ బీర్ చాలా ఫేవరేట్ అట. అంతకు ముందు ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా స్కౌట్ ల్యాండ్ విస్కీ చాలా ఫేమస్. దీనికోసం మనదేశీయులు తప్పక రుచి చూడాలనుకునేవారట.
స్కౌట్ ట్యాండ్ తరువాత ఆస్ట్రేలియా, యూరప్ దేశాల్లోని విస్కీ బ్రాండ్స్ కోసం మనోళ్లు తెగ ఆరాటపడుతుంటారు. కానీ సీన్ ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడు విదేశీయులే మన బ్రాండ్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇండియానుంచి వచ్చేవాళ్లను మన దగ్గరి విస్కీ బ్రాండ్ ఒకటి కానుకగా తెమ్మనేంత సీన్ వచ్చిందటే మరి మన దేశ క్వాలిటీని అర్థం చేసుకోవచ్చు.