March 18-Top Ten News: టాప్ టెన్ వార్తలు

By Mahesh K  |  First Published Mar 18, 2024, 6:12 PM IST

ఇవాళ్టి టాప్ టెన్ వార్తలు
 


తమిళిసై రాజీనామా

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. ఆమె లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఈ పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తున్నది. సెంట్రల్ చెన్నై నుంచీ బీజేపీ టికెట్ పై పోటీ చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తున్నది. పూర్తి కథనం

Latest Videos

కడప నుంచి షర్మిల పోటీ?

కడప పార్లమెంట్ స్థానం నుండి  కాంగ్రెస్ అభ్యర్ధిగా  వై.ఎస్ షర్మిల పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది.  ఈ విషయమై ఎఐసీసీ నేతలు షర్మిలతో మాట్లాడుతున్నారని  ప్రచారం సాగుతుంది.  కాంగ్రెస్ పార్టీ  త్వరలోనే అభ్యర్థులను ప్రకటించనుంది. పూర్తి కథనం

పాడి కౌశిక్ రెడ్డి నోట జగన్ డైలాగ్

పాడి కౌశిక్ రెడ్డి ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్ పాపులర్ డైలాగ్ కొట్టాడు. మీరు కొట్టారు మేం తీసుకున్నాం. మాకు టైం వస్తుంది. మేమూ కొడతాం అంటూ జగన్ చేసిన డైలాగ్‌ను ఇక్కడ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కామెంట్ చేశాడు. పూర్తి కథనం

ఇండియాలో మొదటిసారిగా కారు కొన్నది ఈయనే

టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జెమ్‌షెడ్ జి టాటా భారతదేశంలో మొదటి కారును కొనుగోలు చేసిన ఘనత పొందారు. భారతదేశంలో మొదటి కారు యజమానిగా గుర్తింపు పొందిన జంషెడ్ జి  ఆశ్చర్యకరమైన స్టోరీ మీకోసం... పూర్తి కథనం

లిక్కర్ స్కాంపై మోడీ కామెంట్

జగిత్యాల:తెలంగాణను దోచుకున్నవారిని విడిచిపెట్టేది లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు.సోమవారంనాడు జగిత్యాలలో నిర్వహించిన బీజేపీ విజయసంకల్ప యాత్రలో  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు.దోపిడీదారులను వదిలిపెట్టబోమని మోడీ విమర్శించారు. పూర్తి కథనం

ఇంటి నుంచి ఓటుకు అర్హులెవరు?

కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్‌లోని 27 ఏ కింద 80 ఏళ్లు వయసు నిండిన వారికి, 40 శాతం పైగా అంగవైకల్యం వున్న వారికి పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం 80 ఏళ్లు పైబడిన వారు, దివ్యాంగులు ... నోటిఫికేషన్ విడుదల చేసినప్పటి నుంచి పోలింగ్‌కు ఐదు రోజుల ముందే ఫారం 12 డీ కోసం దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి కథనం

దానం పై వేటు వేయండి

బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం సోమవారం తెలంగాణ అసెంబ్లీ స్పకీర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను కలిసింది. దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని పిటిషన్ అందించింది. పూర్తి కథనం

రష్యా అధ్యక్షుడిగా పుతిన్ విజయం

రష్యా అధ్యక్ష పదవిని పుతిన్ మరోసారి దక్కించుకున్నారు.రికార్డు స్థాయి ఓట్లను పుతిన్ పొందారు. పుతిన్ కు వ్యతిరేకంగా  ఆయన ప్రత్యర్థులు  పోలింగ్ స్టేషన్ల మధ్య నిరసనలు చేపట్టారు.  1999లో  తొలిసారిగా పుతిన్ రష్యాకు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. పూర్తి కథనం

ఓటీటీలో హనుమాన్ సరికొత్త రికార్డు

జీ 5 లో విడుదలైన ఈ చిత్రం ఓటిటిలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. కేవలం 11 గంటల్లోనే 102 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ సాధించింది. పూర్తి కథనం

‘భీమా’10 రోజుల కలెక్షన్స్ ?

ఫస్ట్ వీకెండ్ తర్వాత సోమవారం కూడా కొన్ని చోట్ల ఓకే అనిపించుకునే కలెక్షన్స్ తెచ్చుకున్న ఈ చిత్రం రెండో వారానికి పూర్తి డ్రాప్ అయ్యింది.  పది రోజుల్లో ఎంత వచ్చింది..ఎంత వస్తే బ్రేక్ ఈవెన్ అవుతుందోచూద్దాం. పూర్తి కథనం

click me!