దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు బీఆర్ఎస్ పిటిషన్ ఇచ్చింది.  

బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం సోమవారం తెలంగాణ అసెంబ్లీ స్పకీర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను కలిసింది. దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని పిటిషన్ అందించింది. బీఆర్ఎస్ టికెట్ పై ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ పార్టీ మార్చారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ ఆయనపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సారథ్యంలో వెళ్లిన ప్రతినిధులు తమ విజ్ఞప్తిని స్పీకర్‌కు సమర్పించారు.

నాగేందర్ పార్టీ మార్పుపై కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్నది. అసెంబ్లీలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సంఖ్య తక్కువగా ఉండటంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆకర్షించే ప్రయత్నాలు జరుగుతాయని సహజంగానే చాలా మంది అనుకున్నారు. అయితే.. చేవెళ్ల బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి పార్టీ మారడం మాత్రం ఆశ్చర్యానికి గురి చేసింది. 

Scroll to load tweet…

2019లో ఆయన తొలిసారిగా బీఆర్ఎస్ టికెట్ పై చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డిని ఓడించారు.