మార్చి 4వ తేదీ సాయంత్రం వరకున్న టాప్ టెన్ వార్తలు
నలుగురు బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన
ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ నుంచి మాలోతు కవితలకు బీఆర్ఎస్ పార్టీ మరోసారి ఛాన్స్ ఇచ్చింది. వీరితోపాటు కరీంనగర్ నుంచి బోయినపల్లి వినోద్ కుమార్,పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్‌లను అభ్యర్థులుగా ప్రకటించింది. పూర్తి కథనం
ఢిల్లీలో మహాలక్ష్మీ పథకం
ఢిల్లీలో మహాలక్ష్మీ పథకాన్ని పోలిన నిర్ణయాన్ని కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకుంది. ఢిల్లీలో 18 ఏళ్లు, ఆ పైబడిన మహిళలకు రూ. 1,000 ఆర్థిక సహాయాన్ని ప్రతి నెలా పంపిణీ చేయాలని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పూర్తి కథనం
చట్టసభ్యులకు మినహాయింపు లేదు:సుప్రీం
లంచం కేసుల్లో ఎంపీ, ఎమ్మెల్యేలకు మినహాయింపు లేదని సుప్రీంకోర్టు సోమవారం నాడు సంచలన తీర్పును వెల్లడించింది. గతంలో ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ఇవాళ కొట్టివేసింది. ప్రజా ప్రతినిధులు విచారణను ఎదుర్కోవాల్సిందేనని ఉన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. పూర్తి కథనం
ఎట్టకేలకు విచారణకు కేజ్రీవాల్ ఓకే
ఢిల్లీ లిక్కర్ స్కాంలో న్యూఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారంనాడు ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు. అయితే ఇవాళ విచారణకు రావాలని ఈడీ అధికారులు ఇటీవలనే నోటీసులు పంపారు. అయితే ఇవాళ విచారణకు హాజరు కాకుండా ఈడీ అధికారులకు అరవింద్ కేజ్రీవాల్ ఓ లేఖ పంపారు. పూర్తి కథనం
ఆ రోజే ఇస్రో చీఫ్‌కు క్యాన్సర్ అని తేలింది
ఆదిత్య ఎల్ 1 మిషన్ ప్రయోగించిన రోజే ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్‌కు క్యాన్సర్ ఉన్నట్టు బయటపడింది. ఓ రోటీన్ స్కాన్‌లో ఈ విషయం బయటపడిందని సోమనాథ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడంచారు. పూర్తి కథనం
‘మోడీ కా పరివార్’ ట్రెండింగ్
బిహార్ మాజీ సీఎం లాలు ప్రసాద్ యాదవ్ ప్రధాని మోడీపై వ్యక్తిగత దాడికి దిగారు. ఇందుకు సమాధానంగా దేశ ప్రజలంతా తన కుటుంబమేనని మోడీ పేర్కొన్నారు. బీజేపీ నాయకులు మోడీ కా పరివార్ అంటూ సోషల్ మీడియాలో బయోలు మార్చుకుంటున్నారు. పూర్తి కథనం
నయన్ నుంచి షాకింగ్ కామెంట్
హీరోయిన్ నయనతార ఓ సందర్భంలో విగ్నేష్ తో ఉన్నా ప్రభుదేవా గుర్తుకు వస్తారు అన్నారు. ఆమె తన మాజీ బాయ్ ఫ్రెండ్ ప్రభుదేవా గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. పూర్తి కథనం
రాజమౌళి, మహేష్ మూవీ లేటెస్ట్ అప్డేట్
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో చిత్రానికి ముందస్తు సన్నాహకాలు జోరందుకుంటున్నాయి. వీలైనంత త్వరలో షూటింగ్ మొదలుపెట్టే ఆలోచనలో రాజమౌళి ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి కథనం
సిక్స్‌ను అడ్డుకొని రనౌట్
క్రికెట్ లో అనేక అద్బుతాలు చూస్తుంటాం. సిక్స్ గా వెళ్లే బంతిని ఫీల్డర్ అడ్డుకోవడమే కాదు ఓ బ్యాటర్ రనౌట్ కు కారణమయ్యాడు. ఈ ఘటన నేపాల్, నెదర్లాండ్స్ జట్ల మధ్య జరిగింది. పూర్తి కథనం
పుష్ప 2` టీమ్‌కి అల్లు అర్జున్ స్టిక్ట్ రూల్
`పుష్ప 2` సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందుతుంది. దర్శకుడు సుకుమార్ వేరే రేంజ్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో చిత్ర బృందానికి హీరో అల్లు అర్జున్ స్టిక్ట్ రూల్ పెట్టాడట. పూర్తి కథనం