ISRO: ఆదిత్య ఎల్1 మిషన్ ప్రయోగించిన రోజే ఇస్రో చీఫ్ సోమనాథ్‌కు క్యాన్సర్ గుర్తింపు

By Mahesh K  |  First Published Mar 4, 2024, 4:55 PM IST

ఆదిత్య ఎల్ 1 మిషన్ ప్రయోగించిన రోజే ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్‌కు క్యాన్సర్ ఉన్నట్టు బయటపడింది. ఓ రోటీన్ స్కాన్‌లో ఈ విషయం బయటపడిందని సోమనాథ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడంచారు.
 


ఆదిత్య ఎల్ 1 మిషన్‌ను అంతరిక్షంలోకి ప్రయోగించిన రోజే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) చీఫ్ సోమనాథ్‌కు క్యాన్సర్‌ ఉన్నట్టు తెలిసింది. టార్మాక్ మీడియా హౌజ్‌లో ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని సోమనాథ్ వెల్లడించారు. ఓ స్కాన్‌లో క్యాన్సర్ వ్రణం పెరుగుదలను గుర్తించినట్టు చెప్పారు. 

‘చంద్రయాన్ 3 మిషన్ సమయంలోనూ కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. కానీ, వాటి గురించి నాకు స్పష్టమైన అవగాహన లేకుండింది’ అని సోమనాత్ తెలిపారు. ‘ఆదిత్య ఎల్ 1 మిషన్‌ను ప్రయోగం చేపట్టిన రోజే నాకు క్యాన్సర్ ఉన్నట్టు తేలింది. ఆ విషయం నాకే కాదు.. నా కుటుంబానికి, కొలీగ్స్‌కు కూడా షాకింగ్‌గా అనిపించింది’ అని వివరించారు.

Latest Videos

సూర్యుడికి సంబంధించిన పలు పొరలను అధ్యయనం చేయడానికి ఆదిత్య ఎల్ 1 అనే మన దేశపు తొలి సోలార్ మిషన్‌ను 2023 సెప్టెంబర్ 2న ప్రయోగించారు. అదే రోజు ఎస్ సోమనాథ్ ఓ రోటీన్ స్కాన్ చేయించుకున్నారు. అందులో తన పొట్టలో ఓ అసాధారణమైన పెరుగుదల కనిపించింది. ఈ అసాధారణ రిజల్ట్‌తో ఆయన వెంటనే తదుపరి స్కానింగ్‌ల కోసం చెన్నై వెళ్లాల్సి వచ్చింది. తనలో క్యాన్సర్ ఉన్నట్టు అక్కడ ధ్రువీకరించారు. ఇది బయటపడిన రోజుల వ్యవధిలోనే తన వృత్తిగత బాధ్యతలను నెరవేర్చడానికి అనేక ఆరోగ్యపరమైన సవాళ్లు వచ్చాయి.

Also Read: Modi Ka Parivar: బీజేపీ నేతల ఎక్స్ బయోల్లో ‘మోడీ కా పరివార్’.. ఈ ట్రెండ్ ఎందుకో తెలుసా?

ఆ తర్వాత ఎస్ సోమనాథ్ కీమోథెరపీ ఆపరేషన్ చేయించుకున్నారు. ‘ఇది నిజంగా నా కుటుంబానికి ఒక షాక్ వంటిది. కానీ, ఇప్పుడు నాకు క్యాన్సర్ ఉన్నదనే ఎరుకలో ఉన్నాను. దానికి పరిష్కారంగా ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నాను’ అని సోమనాథ్ వివరించారు.

click me!