Today's Top Stories: బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి..ఐపీఎల్ 2024 షెడ్యూల్ వచ్చేసింది.. కూటమి కుదిరినట్టే!

By Rajesh Karampoori  |  First Published Feb 23, 2024, 7:55 AM IST

Today's Top Stories: శుభోదయం.. ఈ రోజు టాప్ న్యూస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి..ఐపీఎల్ 2024 షెడ్యూల్ వచ్చేసింది.. కూటమి కుదిరినట్టే., అర్ధరాత్రి వేళ వారణాసి వీధుల్లో ప్రధాని మోదీ.. ,క్రైస్తవులపై తృణమూల్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు.. హిందు వ్యతిరేక పాలసీ- సిద్దరామయ్య, కర్నూల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇలియాజ్ బాషా!, అరెస్టు చేస్తుండగా గాయపడ్డ వైఎస్ షర్మిల.., గృహజ్యోతి, రూ.500 సిలిండర్‌ పథకాల అమలుకు సన్నాహాలు.. ,  "22 రోజులు గడుస్తున్నా జీతాల్లేవు" - హరీష్ రావు ఫైర్ , రామ్ గోపాల్ వర్మ ‘వ్యూహం’ మళ్లీ వాయిదా.. వంటి వార్తల సమాహారం. 


Today's Top Stories: ( పూర్తి సమాచారం కోసం హెడ్డింగ్ పై క్లిక్ చేయండి)

PM Modi In Varanasi: అర్ధరాత్రి వేళ వారణాసి వీధుల్లో ప్రధాని మోదీ.. 

Latest Videos

PM Modi In Varanasi:  ప్రధాని మోదీ తన పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిలో ఆకస్మికంగా వచ్చారు. అర్థరాత్రి వేళ తన నియోజకవర్గంలో వీధుల్లో పర్యటించారు. దాదాపు  రాత్రి 11 గంటల ప్రాంతంలో వారణాసిలో ఇటీవల నిర్మించిన శివపూర్-ఫుల్వారియా-లహర్తారా రహదారిని పరిశీలించారు. ఈ సమయంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ప్రధాని మోదీతోనే ఉన్నారు. ప్రధాని మోదీ రాక తెలుసుకున్న అక్కడి ప్రజలు అర్థరాత్రి వేళ బయటకు స్వాగతం పలికారు. అనంతరం అక్కడ ఉన్న ప్రజలకు ప్రధాని కరచాలనం చేసి అభివాదం చేశారు.ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రధాని మోదీ సోషల్ మీడియాలో షేర్ చేశారు.


క్రైస్తవులపై తృణమూల్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు.. 

కోల్ కతా : క్రిస్టియన్ కమ్యూనిటీపై అనన్య బెనర్జీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. దీనిపై తృణమూల్ కాంగ్రెస్ కౌన్సిలర్ అనన్య బెనర్జీ మంగళవారం తన ప్రసంగం ఎలా ఎడిట్ చేశారో చెబుతూ ఓ వీడియో క్లిప్‌ను షేర్ చేశారు. దీని ద్వారా బిజెపి వ్యతిరేక "ప్రచారాన్ని వ్యాప్తి చేస్తోందని" నిప్పులు చెరిగారు.

హిందు వ్యతిరేక పాలసీ- బీజేపీ

కర్ణాటక అసెంబ్లీలో  కర్ణాటక హిందూ మత సంస్థలు, ధార్మిక  బిల్లు 2024 ఆమోదం పొందింది. ఈ విషయమై  కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ విమర్శలు గుప్పించింది. ఈ బిల్లు హిందూ వ్యతిరేకమైందిగా భారతీయ జనతా పార్టీ విమర్శించింది. కోటి రూపాయాల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న ఆలయాల ఆదాయంలో  10 శాతం ప్రభుత్వం వసూలు చేసుకొనేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. ఈ బిల్లుపై కాంగ్రెస్ సర్కార్ పై  బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తుంది.  కర్ణాటకలో సిద్దరామయ్య  ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాల్లో నిమగ్నమైందని బీజేపీ ఆరోపించింది.  


కర్నూల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇలియాజ్ బాషా!

YCP Candidate: కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఇంచార్జీపై సందిగ్దం వీడింది. కర్నూల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇలియాజ్ బాషా పేరు దాదాపుగా ఖరారైపోయినట్టు తెలిసింది. సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్‌కూ తగిన ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం. తాడేపల్లి గూడెం వద్ద వైసీపీ కర్నూల్ పంచాయితి ఒక కొలిక్కి వచ్చినట్టు తెలుస్తున్నది. కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని వైసీపీ గెలుచుకుంది. ప్రస్తుతం కర్నూల్ అసెంబ్లీ స్థానానికి ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ సారి కర్నూల్ అసెంబ్లీ స్థానంలో అభ్యర్థిని వైసీపీ మారుస్తున్నది. సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్‌కు కాకుండా.. ఇలియాజ్ బాషాను వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంచుకోవాలనే చర్చ జరిగింది.

CBN: కూటమి కుదిరినట్టే! వైసీపీపై దాడి షూరు.. 

ఈ రోజు టీడీపీ, బీజేపీ ఉమ్మడి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. టీడీపీని ఎన్డీయేలోకి ఆహ్వానించినట్టు అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఈ నెల 28వ తేదీన ఉమ్మడిగా బహిరంగ సభ నిర్వహించనున్నారు.  ఆంధ్రప్రదేశ్‌లో విపక్ష శిబిరంలో ఒక ముఖ్య ఘట్టం జరిగింది. విజయవాడలో టీడీపీ, జనసేన పార్టీల ఉమ్మడి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఇందులో రెండు తీర్మానాలను ఆమోదించారు. ఈ రెండు పార్టీల మధ్య పొత్తును స్వాగతిస్తున్న క్యాడర్‌ను అభినందిస్తూ ఒక తీర్మానం.. మీడియాపై దాడులను తప్పుబడుతో మరో తీర్మానాన్ని ఆమోదించారు. ఈ భేటీ అనంతరం, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు.


అరెస్టు చేస్తుండగా గాయపడ్డ వైఎస్ షర్మిల..

YS Sharmila: డీఎస్సీ అభ్యర్థులకు సంఘీభావంగా ఛలో సెక్రెటేరియట్ కార్యక్రమం చేపట్టిన ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ముందునుంచే పోలీసులు రంగం సిద్ధం చేసుకున్నారు. కాంగ్రెస్ నాయకుల ముందస్తు అరెస్టులు కూడా చేశారు. ఇది గమనించే వైఎస్ షర్మిల నిన్న రాత్రి ఇంటికి వెళ్లలేదు. కాంగ్రెస్ కార్యాలయం ఆంధ్రరత్నం భవన్‌లోనే పడుకున్నారు. ఈ రోజు ఆమె కచ్చితంగా సచివాలయాన్ని చేరుకోవాలని ప్రతిన బూనారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా.. ఆమె వినలేదు. దీంతో బలవంతంగా ఆమెను బస్సులోకి ఎక్కించుకుని మంగళగిరి పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి

బీఆర్ఎస్ నాయకురాలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత (37) మరణించారు. ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి పటాన్ చెరు ఓఆర్ఆర్ ను ఢీకొట్టింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో కన్నుమూశారు. గత ఏడాది ఆమె తండ్రి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న చనిపోయారు. దీంతో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సాయన్న కూతురు లాస్యకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చింది. ఎమ్మెల్యేగా గెలుపొంది, అసెంబ్లీలో అడుగుపెట్టిన స్వల్ప కాలంలోనే ఆమె ఇలా రోడ్డు ప్రమాదంలో చనిపోవడం విచారకరం.

గృహజ్యోతి, రూ.500 సిలిండర్‌ పథకాల అమలుకు సన్నాహాలు..  

 Revanth Reddy: ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో భాగంగా మరో రెండు హామీల అమలుకు తెలంగాణలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోంది. గురువారం ప్రజా పాలన కార్యక్రమంపై సీఎం రేవంత్ రివ్యూ నిర్వహించారు. ఆరు గ్యారంటీల అమలుపై  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క తో కలిసి కేబినెట్‌ సబ్‌కమిటీతో చర్చించారు. ఈ క్రమంలో గృహ జ్యోతి, రూ.500లకు గ్యాస్ సిలిండర్ పథకాల అమలుకు వెంటనే సన్నాహాలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.


 "22 రోజులు గడుస్తున్నా జీతాల్లేవు"- హరీశ్ రావు

Harish Rao: తెలంగాణ కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం పై మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల జీతాల విషయంలో కాంగ్రెస్ చెబుతున్నది ఒకటనీ,  చేస్తున్నది మరొకటి అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రభుత్వం ఉద్యోగులకు ప్రతినెల 1 వ తేదీన జీతాలు చెల్లిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారనీ. కానీ.. వారు ఇచ్చిన హామీపై వారు నిలబడటం లేదనీ, హామీలను  ఆచరణలో పెట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రామ్ గోపాల్ వర్మ ‘వ్యూహం’ మళ్లీ వాయిదా.. 


‘వ్యూహం’ సినిమాకు నారా లోకేష్ Nara Lokesh అడ్డుపడ్డారంటూ రామ్ గోపాల్ వర్మ Ram Gopal Varma మొన్నటి వరకు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. కానీ ఈ సారి ఆయన కారణం కాదని ఆర్జీవీనే స్వయంగా చెప్పుకొచ్చారు. డాషింగ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma)  ప్రస్తుతం తెరకెక్కిస్తున్న పొలిటికల్ డ్రామా ‘వ్యూహం’. ఈ చిత్రం మొదటి నుంచి వివాదాలను ఎదుర్కొంటూనే వచ్చింది. ఎట్టకేళకు మొన్న రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. ఫిబ్రవరి 23న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అంటే రేపు థియేటర్లలో విడుదల కావాలి. కానీ సినిమా వాయిదా పడిందంటూ రామ్ గోపాల్ వర్మ తాజాగా అప్డేట్ ఇచ్చారు. Vyooham Movie Postponeకి కారణం కూడా చెప్పారు. మొన్నటి వరకు నారా లోకేష్ అడ్డుపడ్డారని చెప్పిన ఆర్జీవీ మాత్రం ఈసారి ఆయన కాదని క్లారిటీ ఇచ్చారు. 

ఐపీఎల్ 2024 షెడ్యూల్ వచ్చేసింది..  

IPL Schedule 2024: అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా  (బీసీసీఐ) ఐపీఎల్ షెడ్యూల్ విడుదల చేసింది. 17వ ఎడిషన్ ఐపీఎల్ ఫస్ట్ ఫేజ్ షెడ్యూల్‌ను ఇంతకు ముందే విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం, సరిగ్గా నెల రోజులకు ఫస్ట్ మ్యాచ్ జరుగుతుంది. మార్చి 22వ తేదీన ఫస్ట్ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్‌ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతుంది. దీంతో ఫస్ట్ మ్యాచ్‌ సీఎస్‌కే సొంత గడ్డ మీద ఆర్సీబీతో తలపడనుంది. గత ఐపీఎల్ సీజన్‌లో ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ పై సీఎస్‌కే విజయం సాధించిన సంగతి తెలిసిందే. మొత్తం 21 మ్యాచ్‌ల షెడ్యూల్.. 22 మార్చి మొదలు ఏప్రిల్ 7వ తేదీ వరకు షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేసింది.

click me!