సింహాలకు సీత, అక్బర్ అనే పేర్లు ( lions named Sita and Akbar) పెట్టడంపై పశ్చిమ బెంగాల్ (west bengal) ప్రభుత్వం కలకత్తా హైకోర్టు (Calcutta High Court ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా పేర్లు పెట్టి వివాదాన్ని ఎందుకు సృష్టిస్తున్నారని ప్రశ్నించింది. వెంటనే ఆ పేర్లు మార్చాలని ఆదేశించింది.
పశ్చిమ బెంగాల్ సిలిగురిలోని సఫారీ పార్కులో ఉన్న సింహాలకు అటవీ శాఖ అధికారులు ‘సీత’, అక్బర్ అనే పేర్లు పెట్టడం, వాటిని ఒకే ఎన్ క్లోజర్ లో ఉంచడంపై పశ్చిమ కలకత్తా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే వాటి పేర్లు మార్చాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ‘‘మీరు మీ పెంపుడు జంతువుకు హిందూ దేవుడు లేదా ముస్లిం ప్రవక్త పేరు పెడతారా?’’ అని జస్టిస్ సౌగతా భట్టాచార్య నేతృత్వంలోని సింగిల్ జడ్జి బెంచ్ ప్రశ్నించింది.
‘‘మిస్టర్ కౌన్సెల్, మీరు మీ పెంపుడు జంతువుకు ఏదైనా హిందూ దేవుడు లేదా ముస్లిం ప్రవక్త పేరు పెడతారా... మనలో ఎవరైనా అధికారంలో ఉండి ఉంటే వాటికి అక్బర్, సీత అని పేరు పెట్టి ఉండరని నేను అనుకుంటున్నాను. ఒక జంతువుకు రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు పెట్టాలని మనలో ఎవరైనా ఆలోచించగలరా? సీతను ఈ దేశంలో ఎక్కువ శాతం మంది ఆరాధిస్తారు. సింహానికి అక్బర్ పేరు పెట్టడాన్ని కూడా నేను వ్యతిరేకిస్తున్నాను. ఆయన సమర్థవంతమైన, విజయవంతమైన, లౌకిక మొఘల్ చక్రవర్తి’’ అని భట్టాచార్య కొనియాడారు.
రెండు సింహాలకు ప్రత్యామ్నాయ పేర్లను కేటాయించే అంశాన్ని పరిశీలించాలని సింగిల్ జడ్జి రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేశారు. పెంపుడు జంతువులకు జూ డిపార్ట్ మెంట్ అధికారి పెట్టిన పేర్లు గురించి తాము మాట్లాడటం లేదని, కానీ సంక్షేమ, లౌకిక రాజ్యం అని ఓ సింహానికి సీత, అక్బర్ పేర్లు పెట్టి ఎందుకు వివాదం సృష్టించారని ప్రశ్నించారు.
ఇదిలా ఉండగా.. పశ్చిమ బెంగాల్ లోని సఫారీ పార్కులోకి ఇటీవల ఓ మగ, ఆడ సింహాన్ని తీసుకొచ్చారు. వాటికి సీత, అక్బర్ అనే పేర్లు పెట్టి ఒకే ఎన్ క్లోజర్ లో ఉంచారు. అటవీ శాఖ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్ పీ) బెంగాల్ విభాగం కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది. ‘సీత’ పేరును మార్చాలని పిటిషన్ దాఖలు చేసింది. అధికారుల నిర్ణయం హిందువులందరి మత విశ్వాసాలపై ప్రత్యక్ష దాడి అని, దీనిని దైవదూషణగా పరిగణించవచ్చని వీహెచ్ పీ తన పిటిషన్ లో పేర్కొంది.
ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఈ మేరకు తాజాగా తీర్పు వెలువురించింది. అయితే సింహాలను సిలిగురిలోని బెంగాల్ సఫారీ పార్కుకు తీసుకురాడానికి ముందే త్రిపుర జూ అధికారులు 2016, 2018లో ఈ సింహాలకు 'సీత, అక్బర్' అని నామకరణం చేశారని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. వాటిని మార్చే యోచన కూడా ఉందని పేర్కొంది.